For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటే మీ మ్యారేజ్ లైఫ్ సూపర్ గా ఉంటుందట...!

నిపుణుల అభిప్రాయం మీ వివాహ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.

|

మనలో చాలా మంది జీవితాల్లో ఏర్పడే అనేక బంధాల్లో అత్యంత ముఖ్యమైన బంధం వివాహ బంధం. ఇద్దరు వ్యక్తులతో పాటు రెండు కుటుంబాలు ఒక్కటయ్యే మధురమైన ఘట్టం. అంతేకాదు సమాజానికి ఒక కొత్త కుటుంబాన్ని కూడా అందివ్వడం అనేది చాలా గొప్ప విషయం.

Body languages that indicates a healthy marriage according to experts

ఇటీవలి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు, కుల, మతాలకు అతీతంగా వివాహాలు జరిగిపోతున్నాయి. ఇలాంటి వివాహాలను కూడా తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఆనందంగా వివాహాలు చేస్తున్నారు. ఎవ్వరికైనా అన్ని అడ్డంకులను అధిగమించి తమ మనసుకు నచ్చిన వారిని మనువాడటం కంటే ఆనందం మరొకటి ఏముంటుంది.

Body languages that indicates a healthy marriage according to experts

అందుకే ప్రపంచమంతా ఎలా ఉన్నా మన భారత దేశంలో మాత్రం వివాహ బంధానికి ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ వివాహ బంధంలో అంతా సంతోషంగా మరియు ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకోవడం సహజం. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ బాడీ లాంగ్వేజ్ ను బట్టి మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది.

Body languages that indicates a healthy marriage according to experts

మీ భాగస్వామితో మీరు ఎలా వ్యవహరిస్తారు.. మీ పెళ్లి జీవితం సంతోషంగా ఉంటుందా లేదా విచారంగా ముగుస్తుందా అనే విషయాలను తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అలా మీ బాడీ పార్ట్స్ సూచించే కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

'అలా కలిశాడు.. పెళ్లి కాలేదని చెప్పి వాడేసుకున్నాడు.. ఆ తర్వాత..''అలా కలిశాడు.. పెళ్లి కాలేదని చెప్పి వాడేసుకున్నాడు.. ఆ తర్వాత..'

కళ్లలోకి కళ్లు..

కళ్లలోకి కళ్లు..

పెళ్లికి ముందు లేదా పెళ్లి తర్వాత అయినా, మీరు మరియు మీ భాగస్వామితో ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు లేదా చర్చించేటప్పుడు మీ కన్నులు అదే పనిగా వారి వైపే చూస్తుంటే.. మీరిద్దరూ స్పష్టమైన మరియు పారదర్శక సమాచార మార్పిడికి ప్రాధాన్యత ఇస్తారని కచ్చితమైన అర్థం. ఇలా నిత్యం జరిగితే.. మీరిద్దరూ ఒకరిమాటను ఒకరు వింటున్నారని అర్థం. ఒకవేళ ఇలా కాకుండా, మీ భాగస్వామి మిమ్మల్ని విస్మరిస్తుంటే, వారు వారి చూపులను మళ్లిస్తూ ఉంటారు.

వాటిని తాకుతూ..

వాటిని తాకుతూ..

మీ ఇద్దరి మద్య కొంటెచూపులు.. అద్భుతమైన హావాభావాలు ఉంటే.. మీ ఇద్దరి మధ్య లోతైన ప్రేమ ఉన్నట్లు సూచిస్తాయి. మీ పార్ట్ నర్ మీ ఫేస్, చేతులు లేదా వెనుకభాగాన్ని సున్నితంగా తాకడం వంటివి చేస్తే.. లేదా మీరు తనకు అలా చేసినా.. మీ ప్రియమైన వారికి అది చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి పనులు మీ ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగేలా చేస్తుంది. అంతేకాదు మీరంటే ఆప్యాయత, ఆరాధన వంటివి కూడా చేరొచ్చు.

‘పెళ్లైన కొత్తలో కనీసం తాకనిచ్చేది కాదు.. ఏడాది తర్వాత పిల్లలు కావాలంటోంది.. ఎందుకని ఆరా తీస్తే...'!‘పెళ్లైన కొత్తలో కనీసం తాకనిచ్చేది కాదు.. ఏడాది తర్వాత పిల్లలు కావాలంటోంది.. ఎందుకని ఆరా తీస్తే...'!

ఒకరినొకరు..

ఒకరినొకరు..

చాలా మంది జంటల్లో ఒకరికొకరికి తెలియకుండానే.. వారి చర్యలు మరియు అలవాట్లు వారంటే ఏంటో ప్రతిబింబింపజేస్తాయి. వారు తమ భాగస్వామిపై ఉన్న ప్రేమతో, వారికి తెలియకుండానే.. తమ భాగస్వామి అడుగుజాడల్లో పయనిస్తుంటారు. దీనంతటికి కారణం, వారి భాగస్వామిని పూర్తిగా విశ్వసించడం మరియు నమ్మడమే. అందుకే అలాంటి వారికి ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి జంటలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.

ఉత్సాహంగా మాట్లాడితే..

ఉత్సాహంగా మాట్లాడితే..

మీ భాగస్వామి నిజంగా ఏదైనా ఉద్వేగభరితమైన విషయం గురించి మాట్లాడితే.. మీరు ఆకర్షితులవుతుంటే.. వారంటే మీకు చాలా ఇష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారు ఏమి మాట్లాడుతున్నారనే విషయాలను తెలుసుకునేందుకు.. మీ గురించి ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని మీరు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. వారు కూడా మీరు కోరుకున్నట్టే మాట్లాడటం వల్ల మీ ఇద్దరి వివాహ జీవితంలో సంతోషంగా మరియు ఆరోగ్యకరంగా కొనసాగుతుంది.

అరచేతులు చూస్తూ..

అరచేతులు చూస్తూ..

మీ భాగస్వామి మాట్లాడే సమయంలో మీరు అరచేతులను తెరిస్తే, మీరు అభద్రత మరియు ఆలోచనల గురించి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థం. మీరు మీ భాగస్వామి దగ్గర అరచేతులను ఓపెన్ చేయడం అనేది మీలో నిజాయితీని సూచిస్తాయి.

ఇది మీ సంబంధం యొక్క అతి ముఖ్యమైన పునాది. దీని అర్థం ఏమిటంటే.. మీరు ఏ విమర్శలనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.

English summary

Body languages that indicates a healthy marriage according to experts

Here we are talking about the Body languages that indicates a healthy marriage according to experts. Take a look
Desktop Bottom Promotion