For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లైన తర్వాత పండుగ వేళ నవ వధువులు అలానే ఆలోచిస్తారా?

నవ వధువు అత్తారింట్లో తొలి పండుగను జరుపుకునే సమయంలో ఏమని ఆలోచిస్తారు.. అలానే ఎందుకు ఆలోచిస్తారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

పెళ్లి అనే మధురమైన ఘట్టం కోసం ఎంతో మంది చాలా ఆశగా ఎదురుచూస్తారు. ఆ వేడుక రెండు కుటుంబాల మధ్య ఎన్నో అద్భుతమైన అనుభూతులనూ అందిస్తుంది. ఇక పెళ్లి తర్వాత ఎక్కువ సంతోషించేది పెళ్లికొడుకుతో వారి కుటుంబమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Brides Thought of Celebrating Their First Festival Away From Home; Here is why

అయితే వధువుతో పాటు వారి కుటుంబం కొంత సంతోషంగా ఉన్నప్పటికీ.. చాలా బాధపడతారు. ఇదిలా ఉండగా.. అత్తారింట్లో అడుగు పెట్టిన కొత్త కోడలు తొలి ఏడాది వచ్చే పండగలన్నీ ఎంతో అద్భుతంగా జరుపుకోవాలని ఆశిస్తుంది. కానీ అదే సమయంలో తను తన ఫ్యామిలీని మిస్సవుతున్నాను అని ఫీలవుతుంది.

Brides Thought of Celebrating Their First Festival Away From Home; Here is why

కొత్త కుటుంబంతో త్వరగా కలిసిపోవాలని.. తన ఫ్యామిలీని తక్కువ ఆలోచించాలని ఆశిస్తూ ఉంటుంది. కానీ తను చిన్నప్పటి నుండి చేసిన కొన్ని అల్లరి పనులు, చిలిపి పనులు.. పాటించే పద్ధతులు అన్నింటినీ ఒక్కసారిగా వదిలేయడం కాస్త కష్టమే. అందుకే అత్తారింట్లో కొన్ని కొత్త పద్ధతులు అలవాటు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సాధారణంగా ఫ్యామిలీకి దూరంగా ఉండటం వేరు.. కుటుంబమంతా ఆనందంగా జరుపుకునే పండుగ సందర్భంగా వారిని కాస్త బాధపడేలా చేస్తుంది. ఈ సందర్భంగా కొత్తగా పెళ్లయిన నవ వధువు మనసులో పండుగ వేళ చేసే ఆలోచనలు ఎలా ఉంటాయనే విషయాలను కొందరు అమ్మాయిలు మాతో పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

ఇలా చేస్తే... మీ మాజీ లవర్ మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్లీ వచ్చేస్తారట...ఇలా చేస్తే... మీ మాజీ లవర్ మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్లీ వచ్చేస్తారట...

తల్లిదండ్రులను మిస్సవుతున్నా..

తల్లిదండ్రులను మిస్సవుతున్నా..

మన దేశంలో పండుగ అంటేనే కొత్త బట్టలు, పిండి వంటలు.. ప్రత్యేక పూజలతో పాటు ఇంకా ఎన్నో.. వీటన్నింటికీ మించి తల్లిదండ్రులు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండుగపూట ఉదయాన్నే నిద్రలేమని చెప్పే అమ్మ.. ఎంతగా నిద్రలేమన్నా.. లేవకపోవడం.. కానీ తను నా రూమ్ వచ్చి చూసేలోపు చక చకా రెడీ అయిపోయి.. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం.. ఇవన్నీ మరపురాని మధురానుభూతులు అని ఓ నవ వధువు వెల్లడించారు.

మళ్లీ నాదే బాధ్యత..

మళ్లీ నాదే బాధ్యత..

చిన్నప్పటి నుండి పుట్టింట్లో అమ్మతో కలిసి ముగ్గు పెట్టడం.. పండుగ వేళ రంగుల ముగ్గులు వేయడం.. రంగు రంగుల పూలు నింపడంతో పాటు పూజలోనూ అమ్మకు సాయం చేసేదాన్ని. అలాగే వంటగదిలోనూ అమ్మతో కలిసిపోయేదాన్ని. అయితే అవే పనులు ఇప్పుడు అత్తారింట్లో చేస్తున్నా.. అక్కడ నేర్చుకోవడం మంచిది అయ్యింది. లేదంటే నా పరిస్థితి అంతే అంటూ.. కొత్త పెళ్లికూతురు చెప్పుకొచ్చింది.

పుట్టింట్లో పూర్తి స్వేచ్ఛ..

పుట్టింట్లో పూర్తి స్వేచ్ఛ..

మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. పండుగ ఉన్నా.. లేకున్నా.. నాకు ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేచేదాన్ని. నేనేప్పుడు నిద్ర లేచినా.. మా పేరేంట్స్ ఏమనేవారు కాదు.. నన్ను చాలా అల్లారుముద్దుగా పెంచారు. అంతేకాదు నాకిష్టమొచ్చినప్పుడు ఇష్టమైన ఫుడ్ తినేదాన్ని. ఇక పండుగ వేళ స్వీట్లు చేసే సమయంలోనే తినే దాన్ని. ఎందుకంటే నాకు స్వీట్లంటే చాలా ఇష్టం. అయితే అత్తారింట్లో ఇలా చేయొచ్చా? లేదా అర్థం కావడం లేదు. ఒకవేళ ఇక్కడ అలా చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురుతాయా? అని నాకు సందేహం కలుగుతోంది అని మరో నవ వధువు చెప్పింది.

మీ మాజీ లవర్ నుండి అనుకోకుండా అలాంటి మెసెజ్ వస్తే...!మీ మాజీ లవర్ నుండి అనుకోకుండా అలాంటి మెసెజ్ వస్తే...!

అంతవరకు ఆగాలా?

అంతవరకు ఆగాలా?

మాములుగా మా ఇంట్లో ఉంటే పండుగ వేళ పూజలు చేస్తారు. అయితే అక్కడ పూజ అయ్యేలోపు ఆకలైతే ఏమైనా తినొచ్చు. ఎలాంటి నిబంధనలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం అలా కుదరడం లేదు. పూజ పూర్తయ్యేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో నాకు పాత రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో నేను నిద్ర లేచిన వెంటనే తినడానికి వంటగదిలోకి పరుగెత్తేదాన్ని అంటూ కొత్త పెళ్లికూతురు తన ఇబ్బందులను చెప్పుకొచ్చింది.

క్లీనింగ్ విషయంలో..

క్లీనింగ్ విషయంలో..

పండుగ వేళ ఇంటిని క్లీన్ చేయడానికి అమ్మ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తనతో పాటు నాతో కూడా బలవంతంగా శుభ్రం చేయించేది. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టదని చెబుతుండేది.. ఇప్పుడు ఆ బాధ్యతను ఎవరికిచ్చింది.. లేక మళ్లీ తానే ఇంటిని క్లీన్ చేసుకుంటుదేమో.. నాకు పెళ్లి అవ్వకపోయుంటే నేను తనకు సాయం చేసేదాన్ని అని మరో వివాహిత వివరించారు.

పెళ్లి చేసుకుని తప్పు చేశానా?

పెళ్లి చేసుకుని తప్పు చేశానా?

ఇలాంటి సందర్భాల్లోనే నాకు పెళ్లి చేసుకుని తప్పు చేశానా? నాకు ఇంత తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి ఎందుకు పంపించేశారు? అని అమ్మనాన్నలను అడగాలనిపిస్తుంది. నన్ను కొత్త ఇంటికి పంపి.. మీరు ఆనందంగా ఉంటున్నారు కదా అంటూ వారితో గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది అని మరో నవ వధువు తన మనసులోని మాటలను బయట పెట్టేసింది.

English summary

Brides Thought of Celebrating Their First Festival Away From Home; Here is why

Brides Thought of Celebrating Their First Festival Away From Home; Here is why. Read in telugu.
Story first published:Wednesday, September 15, 2021, 16:44 [IST]
Desktop Bottom Promotion