For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ విషయంలో ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే...!

ఎవరైతే జంటలు సెక్స్ లో తమ సామర్థ్యం తక్కువగా ఉందని బాధపడుతున్నారో ఈ చిట్కాలను పాటించండి...

|

సాధారణంగా చాలా మంది శృంగారం గురించి తమకన్నీ తెలుసుని అనుకుంటారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత లేదా శృంగారంలో పాల్గొనేంత వరకు గానీ.. వారి అసలు తత్వం బోధపడదు. సరిగ్గా ఆ కార్యంలో పాల్గొనేటప్పుడే ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటారు.

Couples Worry about their performance during sexual relation, these tips will help

లైంగిక ఔషధ సమీక్షలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, మగవారిలో 9 నుండి 25 శాతం వరకు అంగస్తంభన మరియు అకాల స్ఖలనం వంటి సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో 6 నుండి 16 శాతం మహిళలు శృంగారాన్ని ఎక్కువగా చేయాలనే పేద్ద కోరికను కలిగి ఉంటారు.

Couples Worry about their performance during sexual relation, these tips will help

కొంతమంది పురుషులు ఈ అంగస్తంభన సమస్యను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల తమ అన్యోన్య దాంపత్య జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొన్ని సార్లు భార్యభర్తల మధ్య సమస్యలు వారి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతున్నాయి.

ఇలాంటి సమస్యలేవీ ఎదురుకాకుండా.. మీరిద్దరూ హాయిగా, ఆనందంగా.. మీ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తుంటే మీరు కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి... మీ దాంపత్య జీవితాన్ని సంతోషకరంగా గడపండి...

మీరు శృంగారంలో రెట్టింపు ఆనందాన్ని పొందాలంటే... ఈ చిట్కాలను ట్రై చెయ్యండి...!మీరు శృంగారంలో రెట్టింపు ఆనందాన్ని పొందాలంటే... ఈ చిట్కాలను ట్రై చెయ్యండి...!

శారీరక సంబంధంలో ఆందోళన ఎందుకు?

శారీరక సంబంధంలో ఆందోళన ఎందుకు?

ఒక వ్యక్తి ఒక విషయం గురించి ఒత్తిడి మరియు నిరాశలో ఉన్నప్పుడు, అది అతని లైంగిక జీవితంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. లైంగిక ఔషధ సమీక్షలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, శారీరక సంబంధం కలిగి ఉన్నవారు.. కోరికలు కలిగే సమయంలో ఆందోళన లేదా ఉద్రిక్తతలతో ఇబ్బంది పడితే అది శరీర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అది వారి శృంగార సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంంది. ఇలాంటి అలవాటును అధిగమిస్తేనే మీ లైంగిక జీవితం మెరుగవుతుంది.

టెస్టులు చేయించుకోవాలి..

టెస్టులు చేయించుకోవాలి..

ఒక వ్యక్తికి ఆర్థరైటిస్, షుగర్ లేదా ఎండోమెట్రియోసిస్ కు సంబంధించిన సమస్యలు ఉంటే, శారీరక సంబంధం కలిగి ఉన్నప్పుడు వారు ఒత్తిడికి లోనవుతారు. మీరు కలయికలో ఉన్న సమయంలో మీ రక్త ప్రసరణ అనేది చాలా ప్రభావితమవుతుంది. ఇలాంటి సమయంలో మీరు ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మీరు కలయికలో పాల్గొనే సమయంలో దేనిపై ఒత్తిడి పడుతుందనే విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సులభంగా మార్గాలను వెతుక్కుంటారు.

మీ బాడీని స్టడీ చేయండి..

మీ బాడీని స్టడీ చేయండి..

మీరు మీ భాగస్వామితో కలయికలో పాల్గొనే ముందు మీ బాడీ గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు మీ శృంగార జీవితాన్ని ప్రారంభించాలి. అలాగే మీరిద్దరూ కలయికలో పాల్గొనేటప్పుడు ఒకరినొకరు విశ్వసించడం అనేది చాలా ముఖ్యం. మీరు, మీ శరీర ఆక్రుతి కూడా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.

పడకగదిలో మహిళలు ఈ విషయాల గురించి ఖచ్చితంగా పురుషులతో మాట్లాడకూడదు ... సమస్య ఉండదు!పడకగదిలో మహిళలు ఈ విషయాల గురించి ఖచ్చితంగా పురుషులతో మాట్లాడకూడదు ... సమస్య ఉండదు!

సెక్స్ ఎడ్యుకేషన్..

సెక్స్ ఎడ్యుకేషన్..

ఈ ఆధునిక కాలంలోనూ చాలా మంది శృంగార విద్య గురించి అవగాహన లేకుండా ఉంటున్నారు. దీని వల్ల చాలా మంది శారీరక సంబంధాల సమయంలో ఏదైనా సమస్య ఉంటే, దాని గురించి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అంతేకాదు డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఇలాంటి సమయంలోనే చిన్న సమస్యలు కాస్త.. పెద్దవిగా మారుతున్నాయి. అందుకే శృంగారం గురించి సరైన అవగాహన కలిగి ఉండటం.. ఎప్పటికప్పుడు దీని గురించి సమాచారం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం.

మీ పార్ట్ నర్ తో మాట్లాడండి..

మీ పార్ట్ నర్ తో మాట్లాడండి..

మీరు మీ భాగస్వామితో శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడాలి. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగేందుకు.. మంచి కమ్యూనికేషన్ కూడా చాలా బాగా సహాయపడుతుంది. మీరు శృంగార జీవితం గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో.. తను ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. ఇలా ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే అనుమానం వంటివి మాత్రం పెంచుకోకండి. ఇలాంటివి మీ పనితీరుపై మరింత ప్రభావం చూపుతాయి.

ఒత్తిడిని అధిగమించడానికి..

ఒత్తిడిని అధిగమించడానికి..

మీరు శృంగారం విషయంలో ఒత్తిడిని అనుభవిస్తుంటే.. దాని వల్ల మీ మనసులో బాధగా ఉంటే.. అలాంటి వాటిని అధిగమించేందుకు యోగా మరియు ధ్యానం వంటి వాటిని ఆశ్రయించండి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువగా నూనె లేదా కొవ్వు పదార్థాలను చేర్చకండి.

English summary

Couples Worry about their performance during sexual relation, these tips will help

Usually couples worry about their performance during sexual relation. These tips can help you to enjoy a more fulfilling sex life.
Story first published:Wednesday, October 14, 2020, 16:08 [IST]
Desktop Bottom Promotion