Just In
Don't Miss
- Sports
రెండో టీ20లో సిమ్మన్స్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ ఘన విజయం
- News
చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
- Finance
ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
- Movies
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
శోభనం రోజు జరిగే నాటకీయ పరిణామాలేంటో తెలుసా...
తొలి రాత్రి గురించి ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఏదేదో ఊహించుకుంటారు. సినిమాల్లో, సీరియల్స్ లో చూపించినట్లుగా ఫస్ట్ నైట్ రోజే అన్ని జరిగిపోవు. ఎందుకంటే ఆరోజు వధూవరులిద్దరికీ ఇంట్లో అంత మంచి వాతావరణం ఉండదు. కానీ దాన్ని వారు అంతగా గమనించకుండా ఎంతో రహస్యంగా చేయాలని భావించి ఉంటారు. కానీ ఆ రోజు మీ బెడ్ రూమ్ చుట్టూ బంధువులు ఉండి ఉంటారు.
అయితే వధువు, వరుడు కలిసి గడిపే తొలి రాత్రికి సంబంధించి అనేక ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు కూడా వారికి ఆ ఘట్టం పట్ల భయాన్ని కలిగించవచ్చు. అయితే వైద్య నిపుణులు ఈ భయం మూఢనమ్మకం వల్ల కాదు కేవలం వారికి ఆ కార్యాలపై అవగాహన లేకపోవడమే అని చెబుతుతున్నారు. ఈ నేపథ్యంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే..

మూఢ నమ్మకాలు
శోభనం రోజు అబ్బాయి మరియు అమ్మాయి ఎక్కువ సాధారణం కంటే పది రెట్లు ఆశతో, కోరికతో ఉంటారట. ఈ మూఢ నమ్మకాలు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఉదాహరణకు పాశ్చాత్య దేశాలలో తొలి రాత్రి జున్ను ను దిండు కింద ఉంచడం వల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారని నమ్ముతారట.

పూల అలంకరణ..
అప్పట్లో శోభనం రోజు పడక గదిని తాజా పువ్వులతో అందంగా, భారీ సువాసన వెదజల్లేలా అలంకరించేవారట. ఎందుకంటే పువ్వుల ద్వారా వచ్చే సహజ సువాసన పడక గదిలో వధూవరులకు తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి, రొమాన్స్ పెంచడానికి మంచి మానసిక స్థితిని ఏర్పడుతుందని నమ్మేవారట. సాధారణంగా మల్లెపూలను ఎక్కువగా వాడేవారట. ఎందుకంటే ఆ పూలు ఇద్దరిలోనూ మత్తు ఎక్కించేందుకు బాగా ఉపయోగపడతాయట. అలాగే గులాబీలు అన్యదేశ సుగంధాన్ని కలిగి ఉంటాయి. ఇవి జంటలపై కామోద్దీపన ప్రభావాన్ని చూపుతాయని నమ్మేవారట.

వరుడిని ఆట పట్టించడం..
శోభనం రోజు రాత్రి వరుడిని ఆట పట్టించేందుకు బంధువులు మరియు స్నేహితులు కలిసి రకరకాల ఎత్తులు వేస్తారట. అతనిలో అసహనం పెరిగేంత వరకు అతడిని వధువు వద్దకు అనుమతించరట. అయితే వరుడి సోదరీమణులు లేదా ఇతర చిన్నారి బంధువులు ఉంటే మరింత ఆలస్యం చేస్తారట. ఆ సమయంలో అతడిని లోపలికి వదలటానికి కొంత డబ్బు ముట్టచెబితే అప్పుడు వరుడిని వధువు గదిలోకి పంపుతారట. ఇలాంటివి చాలా ఆహ్లాదకరంగా మరియు హాస్యాస్పదంగా ఉండేవట.

ఒక గ్లాసు పాలు..
హిందూ ధర్మం, సంప్రదాయం ప్రకారం వివాహం అనేది రెండు వ్యక్తిగత శరీరాల వంటి రెండు ఆత్మల యొక్క ఐక్యత. అవి ప్రత్యేక అస్తిత్వాలుగా మిగిలిపోతాయి. కానీ అవి ఆత్మలో కలిసిపోతాయి. పెళ్లి రోజు రాత్రి నూతన వధూవరులకు సాంప్రదాయకంగా ఒక గ్లాసు పాలు ఇస్తారు. దీనిని బాదం చూర్ణం చేస్తారు. అలాగే పడక గదిలో వారు మరింత రెచ్చిపోవడానికి అందులో మిరియాలు కూడా కలుపుతారట. ఇతర కామోద్దీపన కషాయాలను కూడా అందులో కలిపి ఇచ్చేవారంట.

తొలి రాత్రి ఆనందించేందుకు..
శోభనం రోజు వధూవరులు ఇద్దరూ ఆనందించేందుకు గాను కొన్ని పురాతన గ్రంథాలు మరియు గ్రంథాల ప్రకారం, వధువు మరియు వరుడు ఒక గ్లాసు కుంకుమపువ్వు, ఫెన్నెల్ రుచి, లేదా మసాలా దినుసులను పంచుకోవాలని సూచించే వారట. వారిద్దరూ తిరిగి శక్తిని పొందడానికి వాటిని పాలలో కలిపి ఇచ్చే వారట. దీని వల్ల వారికి అలసట అనేదే అనిపించకుండా ఉంటుందని నమ్మేవారు.

పాలను ఇవ్వడంలో సైంటిఫిక్ కారణాలు..
హిందూ మతం ఆచారం ప్రకారం శోభనం రోజు పాలను ఇవ్వడం వెనుక సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయని తేలింది. పెళ్లి రోజు రాత్రి పాలు తాగిన వధూ వరులిద్దరిలో హార్మోన్లలో డెవలప్ మెంట్ జరిగి వారు రొమాన్స్ జరుపుకోవడానికి, ఆ ఘట్టం జరుపుకోవడానికి అది ఉపయోగపడుతుందని తేలిందట. దీంతో వీటిని సినిమాలలో, టీవీ సీరియల్స్ లోనూ ఎక్కువగా అనుకరిస్తున్నారు.

వైట్ బెడ్ షీట్..!
శోభనం రోజు అంటే పడక గదిలో బెడ్ షీట్ తాజాగా, తెల్లగా ఉండాలనేది సంప్రదాయమట. భారతీయ సంప్రదాయల ప్రకారం వివాహేతర రొమాన్స్ కు దూరంగా ఉండటానికి చాలా ప్రాధాన్యత ఇస్తాయి. ఇప్పటికీ చాలా మంది శోభనం రోజు వారి పడక గదుల్లో నూతన వధూవరుల కోసం బెడ్ పై వైట్ బెడ్ షీటునే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీని వల్ల వధువు యొక్క కన్యత్వం సులభంగా తెలుసుకోవచ్చని వారు నమ్మేవారట. కానీ ఇది మహిళలకు అత్యంత అసంబంద్ధమైన విషయమని సమాజం గ్రహించాలి.

ప్రపంచంలో శోభన సంప్రదాయాలిలా..
వివాహాలు అనేవి శాశ్వత సంప్రదాయాలు. ప్రపంచవ్యాప్తంగా తొలి రాత్రి వేడుకలు భిన్నంగా ఉంటాయి. అమెరికాలో అయితే పెళ్లి అయిన వెంటనే వధూవరులిద్దరు రహస్య హనీమూన్ కు కారులో వెళ్లడం అనేది ఒక ఆచారం. జర్మన్లు మరియు ఫ్రెంచ్ దేశస్తులు అయితే తొలి రాత్రిని ‘‘కలవర పెట్ట‘‘ సంప్రదాయంగా చేసేస్తారు. దీనినే చివేరి అని కూడా పిలుస్తారు. దంపతులు తొలిరాత్రి గడిపే స్థలంలో బయట ఉండి వారు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తారు. కొంతమంది వినోదం కోసం ప్రతిచోటా అలారం గడియారాన్ని దాచడం వంటివి చేస్తారు.

మహిళల కన్యత్వానికి ఎక్కువ ప్రాధాన్యత..
పశ్చిమ ఆఫ్రికాలోని ప్రజలు మహిళల కన్యత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తొలిరాత్రి వధువు కన్య అని రుజువు అయితే ఆమెకు బహుమతి ఇవ్వబడుతుంది. దాని కోసం వారి ఫస్ట్ నైట్ తర్వాత ఉదయం దంపతుల దుస్తులలో రక్తపు మరకలను పరీక్షిస్తారు.

ప్రస్తుత ఆనవాయితీ..
ఇలాంటి ఆచారాలలో కొన్ని మనకు ఇప్పటికే తెలుసు. మరి కొన్నింటి గురించి విని ఉంటాం. అయితే వివాహాల విషయంలో ప్రపంచంలో విచిత్రమైన ఆచారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గ్రహించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. దాని తర్వాత తొలి రేయి ఇంకా ముఖ్యమైనది. అయితే మన దేశంలో చాలాచోట్ల తొలిరోజు శోభనం కార్యక్రమం నిర్వహించరట. పెళ్లి అయిన నాలుగో రోజు రాత్రి శోభన ఘట్టాన్ని నిర్వహిస్తారట. ఆ సమయంలో పడకగదిని అగర్ బత్తీలు, మిఠాయిలు, పండ్లు, సువాసన వెదజల్లే సుగంధ ద్రవ్యాలు, పూలతో అలంకరిస్తారట. ఇది ప్రస్తుతం ఎక్కువగా కొనసాగుతున్న ఆనవాయితీ.