For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్కింగ్ కపుల్స్ వారాంతంలో ఇలా చేస్తే బోర్ అనే ఫీలింగే రాదు...!

వర్కింగ్ కపుల్స్ వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు గల మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

ఏడు సముద్రాలు..
ఏడు కొండలు..
ఏడు రంగులు..
ఏడు స్వరాలు..
ఏడు ఖండాలు..
ఏడు రోజులు..

ఇందులో చివరిదైనా ఏడో రోజు అంటే వీకెండ్ కోసం మనలో చాలా మంది ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆరోజు దాదాపు అందరికీ సెలవు దొరుకుతుంది.

Fun Weekend Ideas for Working Couples in Telugu

ఆ ఒక్క రోజు ఎంచక్కా ఎంజాయ్ చేయాలని.. ముఖ్యంగా తమ పార్ట్నర్ తో మరియు పిల్లలతో లేదా స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని ఆశ పడుతూ ఉంటారు.

Fun Weekend Ideas for Working Couples in Telugu

ఎందుకంటే ఆ ఒక్కరోజు ఎలాంటి పని ఒత్తిడి ఉండదు. పైగా బోలెడంత రెస్ట్ తీసుకోవచ్చని భావిస్తారు. అయితే ఆ వీకెండ్ లో మాత్రం ఏవేవో పనులతో ఆ ఒక్కరోజును ఆనందంగా గడపలేకపోతారు. ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలైతే ఎప్పుడెప్పుడు ఫ్రీ టైమ్ దొరుకుతుందా అని ఎదురుచూస్తారు. కానీ దొరికిన కాసేపు సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారంతా ఈ చిట్కాలు పాటిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. మరెందుకు ఆలస్యం వీకెండ్లో ఎలా ఎంజాయ్ చేయాలో చూసెయ్యండి మరి.

ఆమెకు 12.. ఆయనకు 34.. అయినా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది...ఆమెకు 12.. ఆయనకు 34.. అయినా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది...

సరదాగా గడపాలి..

సరదాగా గడపాలి..

మనలో చాలా మంది జంటలు సుమారు వారమంతా కష్టపడి పని చేసి లేదా ఆఫీసులో బిజీగా గడుపుతూ ఉంటారు. కాబట్టి కనీసం వీకెండ్ అయినా బాగా ఎంజాయ్ చేసి పని ఒత్తిడిని తగ్గించుకోవడం లేదా మరచిపోవడం వంటివి చేయాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఆలుమగలిద్దరూ వీకెండ్ సమయంలో కచ్చితంగా ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి. వారాంతంలో సరదాగా గడపాలి. ఇద్దరూ కలిసి ఏకాంతంగా కూర్చొని మనసు విప్పి మాట్లాడుకోవాలి.

తర్వాతి వారంలో..

తర్వాతి వారంలో..

కేవలం లాంగ్ డ్రైవ్.. రెస్టారెంట్ల విషయాలే కాకుండా మీరు గత వారం ఏమి చేశారు.. వచ్చే వారం ఏమి చేయాలనే విషయాలపై ఇప్పుడే క్లారిటీగా మీ భాగస్వామితో మాట్లాడుకోవాలి. ముఖ్యంగా షాపింగ్ బిల్స్, లాండరీ వంటి వాటికి ఎంత ఖర్చు అవుతోంది. ఎంత డబ్బు ఆదా అవుతోంది అనే విషయాల్లో స్పష్టత తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్లాలి..? ఎలా గడపాలి..? అనే విషయాలను మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి.

రొమాంటిక్ లైఫ్..

రొమాంటిక్ లైఫ్..

ఆలుమగలు అన్నాక అసలు ఘట్టం మొదలయ్యేది పడకగదిలోనే. కాబట్టి వీకెండ్లో మీ బెడ్ రూమ్ మాంచి సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్స్ తో.. కలర్ ఫుల్ బెలూన్లు, రంగురంగుల పూలు, మల్లెపూలతో అలంకరించి మీ రొమాన్స్ ప్రారంభిస్తే చాలు.. మీ శ్రుంగార జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించొచ్చు. దీని వల్ల మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది.

మీ భాగస్వామి ‘అలక' తీర్చడం చాలా తేలిక.. అదెలాగో చూసెయ్యండి...మీ భాగస్వామి ‘అలక' తీర్చడం చాలా తేలిక.. అదెలాగో చూసెయ్యండి...

లాంగ్ డ్రైవ్..

లాంగ్ డ్రైవ్..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా సడలింపులు ఉన్నాయి. మన దేశంలో కూడా లాక్ డౌన్ ఆంక్షలు తగ్గడంతో చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇంత త్వరగా లాంగ్ డ్రైవ్ చేయడానికి ఎవ్వరూ ఆసక్తి చూపరు. కాబట్టి మీరు ఇలాంటి సమయంలో లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం వల్ల మీకు ఎలాంటి డిస్ట్రబ్ అనేదే ఉండదు. అలాగే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి ఏకాంతంగా మీరిద్దరూ కలిసి గడిపే క్షణాలను మీరు ఎప్పటికీ మరచిపోలేరు.

ఇలా చేస్తే..

ఇలా చేస్తే..

చాలా మంది వీకెండ్ వస్తే చాలు ఏదైనా మంచి రెస్టారెంట్ లేదా హోటల్ కు వెళ్లి భోజనం లేదా డిన్నర్ చేయడం వంటివి చేస్తారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అలాంటి పరిస్థితులు చాలా వరకు తగ్గిపోయాయి. చాలా మంది పార్సిల్స్ తెచ్చుకుని తింటున్నారు. అయితే మీరిద్దరూ ఎప్పుడూ బయటకు వెళ్లి తెచ్చుకోవడం కాకుండా.. ఈసారి మీరిద్దరూ కలిసి ఇంట్లోనే వంట వండుకుని తినడం చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ ఇద్దరికీ అది కుదరకపోతే.. మీరిద్దరూ కలిసి ఏదైనా నచ్చిన పనిని చేస్తే కూడా చాలా సరదాగా ఉంటుంది.

పిల్లలుంటే..

పిల్లలుంటే..

ఈ సమయంలో మీ భాగస్వామికి ఏకాంతంగా గడిపేందుకు సమయం కావాలంటే.. దాన్ని కూడా మీరు తప్పకుండా నెరవేర్చాలి. ఆ తర్వాత మీరు వారితో సరదాగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. అదే సమయంలో మీకు పిల్లలుంటే వారి పట్ల కూడా మీరు చాలా బాధ్యతగా వ్యవహరించాలి.

ఇద్దరూ కలిసి సినిమాలు..

ఇద్దరూ కలిసి సినిమాలు..

ప్రస్తుతం సినిమా థియేటర్లు సరిగ్గా ఓపెన్ చేయడం లేదు కాబట్టి.. మీరు ఇంట్లోనే మీ భాగస్వామితో కలిసి కొత్త సినిమాలను చూడాలి. పైగా ఇప్పుడు అమెజాన్, ఆహా, నెట్ ఫ్లిక్స్ తోపాటు ఎన్నో రకాల సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి మీరు మీకు నచ్చిన సినిమాలను మీ పార్ట్నర్ తో కలిసి చూడొచ్చు. లేదా ఏదైనా వెబ్ సీరిస్ కూడా చూడొచ్చు.

గొడవలు జరిగితే..

గొడవలు జరిగితే..

భార్యభర్తలన్నాక ఏదో ఒక విషయం గురించి.. ఏదో ఒక సందర్భంలో కోపాలు, అలకలు, గొడవలు రావడం అనేది చాలా సహజం. అయితే గత వారం జరిగిన వాటి గురించి మరచిపోకుండా.. అది ఎందుకు జరిగింది.. అలా జరగకుండా ఉండేందుకు, ఏదైనా సమస్య ఎదురైతే దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఇలా చేస్తే మీరు వీకెండ్లోనే కాదు.. మీకు నచ్చినప్పుడంతా మీ పార్ట్నర్ తో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. వీటితో పాటు ఇంకేమైనా ఐడియాలు ఉంటే మాతో షేర్ చేసుకోండి. మీ ఆలోచనలతో మరికొంతమంది జంటలకు సహాయం చేయండి.

English summary

Fun Weekend Ideas for Working Couples in Telugu

Here are the fun weekend ideas for working couple in Telugu. Have a look
Story first published:Friday, July 9, 2021, 15:26 [IST]
Desktop Bottom Promotion