For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిడసరి అత్తతో గడసరి కోడలు ఇలా చేస్తే... ఎప్పటికీ గొడవ అనేదే ఉండదు...!

పెళ్లయిన ప్రతి ఒక్కరూ అత్తగారితో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

అత్తా, కోడళ్ల మధ్య సంబంధం అనగానే మన సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఒక వింత అవగాహన ఉంది. కొందరు అత్తగారంటే సూర్యకాంతాన్నే గుర్తు చేసుకుని, అలాంటి వారితో పోరు ఎప్పటికీ ఉండకూడదని భావించేవారు. చేసే ప్రతి పనిలోనూ లోపాలను ఎత్తి చూపుతూ.. సూటిపోటి మాటలతో ఎత్తిపొడుస్తూ రాచి రంపాలు పెడుతుంటారనే అపొహ ఉండేది.

relationship with your mother in law

ఇలాంటి ఆలోచనల వల్లే అత్తా, కోడళ్ల మధ్య సంబంధం, వారు కోరుకుండానే పరస్పరం విభజనగా ప్రారంభమవుతుంది. అయితే మీరు ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రతి వ్యక్తికి భిన్నమైన అభిప్రాయాలు, విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి.

relationship with your mother in law

కాబట్టి మీరు కొత్త కుటుంబంలో కొత్త సభ్యుల స్వభావాన్ని అర్థం చేసుకునే విషయంలో అస్సలు తొందరపడకూడదు. ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు కూడా ఓ అత్త అవుతారని గుర్తుంచుకోవాలి. అందుకే తొలినాటి నుండి అత్తగారితో మంచిగా సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించండి. అందుకోసం ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?
కొన్ని నియమాలు..

కొన్ని నియమాలు..

పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు, మరియు కొత్తగా పెళ్లి చేసుకున్న మహిళలు అత్తగారితో సంబంధాల విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. దాని వల్ల మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత బలపడుతుంది. మీకు ఎలాంటి సమస్యలే ఎదురుకావు.

అంచనాలు పెట్టుకోకుండా...

అంచనాలు పెట్టుకోకుండా...

మీరు అత్తగారింట్లో అడుగు పెట్టే సమయంలో ఎలాంటి అంచనాలను పెట్టుకోకండి. అలా చేయకుండా ఉండటమే మీరు సంతోషంగా ఉండటానికి ఉత్తమమైన మార్గం. మరో విషయమేమిటంటే మీరు అత్తగారి నుండి ఎప్పుడూ దేన్నీ ఆశించకపోవడం. ఇలాంటివి లేనప్పుడే అత్తా, కోడలి మధ్య పోరు షురూ అవుతుంది.

ఒకరినొకరు ఆశించకుండా..

ఒకరినొకరు ఆశించకుండా..

ఇక పనుల విషయంలో ఒకరినొకరు ఏమీ ఆశించకుండా మీకొచ్చిన పనులను చేయాలి. వీలైతే ఇంటి పనులను విభజించుకోండి. మీరు ఏ పనులు చేస్తారో.. ఏవి చేయలేరో ముందుగానే వారికి చెప్పండి. ఇలా చెప్పడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా కొత్త పనులు తెలుసుకోవడానికి కూడా వీలుంటుంది. దీని వల్ల మీ సంబంధం మరింత మెరుగవుతుంది.

గౌరవం అవసరం..

గౌరవం అవసరం..

మీరు అత్తమ్మకు గౌరవం ఇవ్వడం అనేది మీ ఇద్దరి మధ్య మంచి సంబంధానికి ఒక సంకేతం. ఎందుకంటే ఆమె మీ కంటే వయసులో చాలా పెద్దది. అనేక విషయాల్లో అనుభవం ఉన్నవారు. చాలా విషయాల్లో అవగాహన కూడా ఉంటుంది. అంతేకాదు మీకు ఏదైనా సమస్య ఉంటే, దాని పరిష్కారానికి మీకు సహాయపడుతుంది.

మీకు ఎక్కువగా ఈ కలలు వస్తున్నాయా? అయితే అందులోని అర్థాలేంటో తెలుసుకోండి...మీకు ఎక్కువగా ఈ కలలు వస్తున్నాయా? అయితే అందులోని అర్థాలేంటో తెలుసుకోండి...


గౌరవం లేని చోట..

గౌరవం లేని చోట..

ఎక్కడైతే మిడసరి అత్త.. గడసరి కోడలు అనే భావనలు ఉంటాయో.. ఎక్కడైతే పెద్దలను గౌరవించడం అనేవి జరగవో.. అక్కడే వివాదాలు ప్రారంభమవుతాయి. అవి చిన్న జల్లులా ప్రారంభమై గాలి వానలా మారిపోతాయి.

అన్ని విషయాలను పంచుకోండి..

అన్ని విషయాలను పంచుకోండి..

అత్తా, కోడలి మధ్య సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మీరిద్దరూ ఒకరినొకరు మీ భావాలను అర్థం చేసుకోవాలి. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధంలో మెరుగుదలకు ఉపయోగపడుతుంది.

పిల్లల విషయంలో..

పిల్లల విషయంలో..

మన సమాజంలో చాలా మంది పెళ్లయిన ఏడాదిలోపే పిలల్ని కనాలనుకుంటారు. కానీ ప్రస్తుతం జనరేషన్ వారు మాత్రం అలా కాకుండా కొంత సమయం తీసుకుంటున్నారు. ఈ సమయంలో పిల్లల పుట్టుకను వాయిదా వేసుకోవాలనుకున్నా.. లేదా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నా అలాంటి విషయాలన్నీ మీరు అత్తగారితో పంచుకోవచ్చు. ఆమె మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది.

ఇలాంటి ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా?ఇలాంటి ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా?

అసంపూర్ణంగా వినొద్దు..

అసంపూర్ణంగా వినొద్దు..

మీకు ఏదైనా విషయం గురించి సంపూర్ణంగా తెలియనప్పుడు, మీరు వెంటనే స్పందించకూడదు. అత్తగారితో గొడవలకు ఇదే అతి పెద్ద కారణం అవుతుంది. మీరు ఏదో తప్పుడు సమాచారం విన్నట్లు.. మీరు తప్పుగా అర్థం చేసుకుని, అనసవరమైన విషయాల పట్ల స్పందించకండి. మీకు ఏదైనా అనుమానం ఉంటే, ఓపెన్ గా మాట్లాడుకోండి. ఇతరుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయని వివరించండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య సంబంధం మెరుగవ్వడమే కాకుండా, ఒకరిపై మరొకరికి నమ్మకం కూడా పెరుగుతుంది.

మరో అమ్మ..

మరో అమ్మ..

ఈ ప్రపంచంలో తల్లికి మించిన వారెవ్వరు లేరు. అయితే అత్తగారిని కూడా మరో అమ్మగా భావించాలి. మీరు మీ అత్తగారిని తల్లిగా భావిస్తే.. మీరు వారి పట్ల ఎప్పటికీ తప్పుడు ఆలోచనలేవే చేయరు. ఇలా చేస్తే మీ సంబంధం మెరుగవ్వడమే కాదు.. కలకాలం హాయిగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా కొనసాగుతుంది.

సమయం ఇవ్వండి..

సమయం ఇవ్వండి..

ప్రతి సంబంధానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఈరోజుల్లో చాలా మంది అమ్మాయిలు పని చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది వారి కుటుంబాలకు తక్కువ సమయాన్ని ఇస్తున్నారు. కాబట్టి మీరు మీ సంబంధాల విషయంలో కుటుంబానికి కొంత సమయం కచ్చితంగా కేటాయించాలి. మీరు వారితో ఉన్నప్పుడు, వారి ఇష్టాలను, భావాలను తెలుసుకోవాలి. అలాగే వారితో కలిసి టివి చూడటం, సినిమాలు చూడటం.. వారితో అన్ని విషయాలను పంచుకోవడం ద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు.

స్నేహితులుగా..

స్నేహితులుగా..

ఈ విశ్వంలో ఏ ఒక్క వ్యక్తి పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి. అందుకే వారి తప్పులను సరిదిద్దడం కంటే ఇతరులను నిందించడం చాలా తేలికైన విషయం. అయితే ఇలా చేయకుండా మీ అత్తగారితో సంబంధం చాలా విలువైనదని భావించాలి. మీరు ఇద్దరూ స్నేహితులుగా ఫీలైతే మీ మధ్య గొడవలు అనేవే ఉండవు. కావాలంటే మీరొకసారి ప్రయత్నించి చూడండి... అందులో ఉండే మజా ఏమిటో మీకే తెలుస్తుంది.

English summary

How Can Improve Relationship With Your Mother in Law

Here we talking about how can improve relationship with your mother in law. Read on
Desktop Bottom Promotion