Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
లైఫ్ పార్ట్‌నర్‌తో మరింత రొమాంటిక్‌గా ఎలా ఉండాలో తెలుసా?
రొమాంటిక్ మెసేజీలు పంపుకోవడం, చేతులు పట్టుకోవడం, వెనక నుండి కౌగిలించుకోవడం, రొమాంటిక్ సంజ్ఞలు చేయడం రొమాన్స్‌లో ఇలాంటివి చాలా ఉంటాయి. లైఫ్ పార్ట్‌నర్‌తో ఎలా రొమాంటిక్‌గా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రొమాన్స్ అనేది బలమైన, అభివృద్ధి చెందుతున్న సంబంధానికి చాలా అవసరం. సంబంధం ఆనందంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందుకోసం కృషి చేయడంలో విఫలం అవుతుంటారు. కొందరికి లైఫ్ పార్ట్‌నర్‌తో రొమాంటిక్‌గా ఎలా ఉండలో తెలియదు. శృంగారం చేయడం వేరు, రొమాంటిక్‌గా ఉండటం వేరు. రొమాంటిక్‌గా ఉండటం అనేది ఓ కళ. దానిని సంబంధంలో ఉన్న ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. దాని వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగడంతో పాటు బంధం బలోపేతం అవుతుంది.

కొత్తగా పెళ్లైనా, లేదా కొత్తగా రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టినా రొమాంటిక్‌గా ఉండటం తెలియకపోవచ్చు. చిలిపి పనులు చేయడం, రొమాంటిక్ మెసేజీలు పంపుకోవడం, చేతులు పట్టుకోవడం, వెనక నుండి కౌగిలించుకోవడం, రొమాంటిక్ సంజ్ఞలు చేయడం రొమాన్స్‌లో ఇలాంటివి చాలా ఉంటాయి. లైఫ్ పార్ట్‌నర్‌తో ఎలా రొమాంటిక్‌గా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సర్‌ప్రైజ్ డేట్‌లకు ప్లాన్ చేయాలి:
జీవిత భాగస్వామితో సమయడం గడపడం చాలా ముఖ్యం. మీ లైఫ్ పార్ట్‌నర్‌తో టైం స్పెండ్ చేయడానికి ఏదైనా ప్లాన్ చేయండి. సర్‌ప్రైజ్ డేట్‌లకు తీసుకెళ్లండి. పార్క్, సినిమా, రెస్టారెంట్ లాంటివైనా పర్లేదు కానీ సర్‌ప్రైజ్‌గా ప్లాన్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న పనులే దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి.

శారీరక ఆప్యాయత చూపించాలి:
ప్రతి సంబంధానికి శారీరక స్పర్శ చాలా ముఖ్యం. మీ భాగస్వామిని వారి చేయి పట్టుకోవడం ద్వారా వారికి కౌగిలింతలు ఇవ్వడం ద్వారా లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా మీ ప్రేమను వ్యక్తం చేయండి.

ప్రశంసించాలి:
మీ భాగస్వామిని మీరు ఎంతగా అభినందిస్తున్నారో చెప్పడానికి సమయాన్ని వెచ్చించండి. ప్రేమ నోట్‌ను అందివచ్చడం, లెటర్ రాయడం లాంటి వాటి ద్వారా మీ భావోద్వేగాన్ని వారికి తెలియజేయండి.

బహుమతులు ఇవ్వాలి:
మీ భాగస్వామికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. వాటి ద్వారా మీరు వారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారని వారు అర్థం చేసుకుంటారు. బహుమతులు పెద్దది లేదా ఖరీదైనది కానవసరం లేదు. ఇక్కడ చూడాల్సింది బహుమతి విలువ కాదు, ప్రేమ విలువ.

పరధ్యానంగా ఉండొద్దు:
లైఫ్ పార్ట్‌నర్‌తో ఉన్నప్పుడు పరధ్యానంగా ఉండొద్దు. మీ దృష్టి మొత్తం వారిపై ఉండేలా చూసుకోండి. ఫోన్‌ను అతిగా వాడొద్దు. ఇతర అంశాల ప్రస్తావన తీసుకురావొద్దు. వీలైనంత వరకు మీ జీవితం, మీ బంధం గురించి మాట్లాడుకోవాలి.

ప్రేమ చూపించాలి, చెప్పాలి:
మీరు నిజంగా మీ భాగస్వామిని ప్రేమిస్తున్నట్లైతే ఆ ప్రేమను చూపించండి. వీలైనప్పుడల్లా దానిని ప్రదర్శించండి. అలాగే ప్రేమిస్తున్నట్లు నోటి ద్వారా చెప్పండి. ప్రేమించడం ఎంత ముఖ్యమో అది వారికి తెలిసేలా చేయడం అంతకంటే ముఖ్యం.

ఒకరికొకరు సమయాన్ని వెచ్చించాలి:
కలిసి వాకింగ్‌కు వెళ్లడం, జిమ్ కు వెళ్లడం, యోగా క్లాసులకు వెళ్లడం లాంటివి ఒకరితో ఒకరు సమయం గడపడానికి మంచి మార్గాలు. వీటితో పాటు కలిసి మాట్లాడుకుంటూ ఇంటి పనులు చేయడం ఏదైనా అలవాటు నేర్చుకోవడం వంటివి చేయడం వల్ల ఒకరికొకరు సమయాన్ని వెచ్చించుకోవచ్చు. దాని వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
