Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
ఒకరి కోసం మనల్ని మనం మార్చుకుంటూ పోవడం వల్ల మనమంటూ ఒకరం ఉండలేం. ఎదుటి వారి సంతోషం కోసం మన సంతోషాన్ని వదులుకునే వ్యక్తిత్వం ఉన్న వారు ఈ చిట్కాలతో ఆ బిహేవియర్ నుండి బయటపడవచ్చు.
ఒకరి పట్ల దయగా, సున్నితంగా, సానుభూతితో ప్రవర్తించడం మంచిది. మన వల్ల వారు సంతోషంగా ఉండాలనుకోవడం కూడా మంచిదే. అయితే ఎదుటివారి సంతోషం కోసం మనల్ని మనం కోల్పోవడం ఏమాత్రం మంచిది కాదు. ఎదుటివారి అవసరాలను తీర్చడంలో మన అవసరాలను పట్టించుకోకపోవడం వల్ల వాళ్లు సంతోషంగా ఉండొచ్చు. కానీ మనం హ్యాపీగా ఉండలేం. అలాగే మనల్ని మనం కూడా కోల్పోతాం.

అందుకే మన పట్ల మనం నిజాయితీగా ఉండాలి. ముందుగా సొంత అవసరాలపై శ్రద్ధ పెట్టాలి. ఎదుటివారిని మెప్పించడానికి మనల్ని మనం కోల్పోవద్దు. ఎదుటివారికంటే మన అవసరాలే మనకు మఖ్యం. మన సంతోషమే మనకు ప్రధానం. ఒకరి కోసం మనల్ని మనం మార్చుకుంటూ పోవడం వల్ల మనమంటూ ఒకరం ఉండలేం. ఎదుటి వారి సంతోషం కోసం మన సంతోషాన్ని వదులుకునే వ్యక్తిత్వం ఉన్న వారు ఈ చిట్కాలతో ఆ బిహేవియర్ నుండి బయటపడవచ్చు.
పీపుల్ ప్లీజింగ్ వ్యక్తిత్వంతో ఎలా వ్యవహరించాలి
1. క్రమంగా మారాలి
మార్పు క్రమంగా జరుగుతూ ఉండాలి. ఉన్నపళంగా, ఆకస్మికంగా చేసే మార్పులు మంచి కంటే చెడు ఎక్కువగా చేస్తాయి. చిన్న చిన్న మార్పులు చేయాలి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఇతర సమయాల్లో మీరు మీ భావాలు మరియు పరిమితుల గురించి ఎదుటివారికి తెలియజేయాలి. మీ భావోద్వేగాలను వ్యక్తపరచడం, అభిప్రాయాలను తెలియజేయడం, అవసరాల గురించి మాట్లాడటం ప్రారంభించాలి.
2. సరిహద్దులు సెట్ చేయాలి
పరిమితులు ఏమిటో తెలుసుకోవాలి. ఎక్కడ హద్దు దాటకూడదో తెలిసి ఉండాలి. అలా జీవితంపై నియంత్రణను తిరిగి పొందాలి. ఎవరైనా మీ నుండి ఎక్కువగా ఆశిస్తుంటే, అది మీ పరిమితికి దాటి ఉంటే అలాంటి వాటికి నో చెప్పాల్సిందే. నో చెప్పడం నేర్చుకోవాల్సిందే.
3. సాకులు చెప్పొద్దు
మీరు ఎవరికైనా నో చెప్పాలనుకుంటే నేరుగా చెప్పెయ్యాలి. అనవసరమైన సాకులు, కారణాలు చెప్పొద్దు. ఏదైన విషయం మీకు నచ్చకపోతే అదే విషయం చెప్పాలి. నో చెప్పడం ఒక కళ. అది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అలవర్చుకోవాలి.
4. సంబంధం వన్-వే రోడ్డు కాదు
మీరు, మీ భాగస్వామి ఒకరి భావాలు, అవసరాలను పరస్పరం పంచుకోవడం చాలా అవసరం. ఇది ఆరోగ్యకరమైన సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది. సంబంధంలో ఉన్నప్పుడు ఒకరే రాజీ పడుతున్నా, ఒకరే ఎక్కువసార్లు ఇస్తున్నా అది సంబంధాన్ని ఏమాత్రం మంచిది కాదు.
5. ప్రాధాన్యతలను సెట్ చేసుకోవాలి
ప్రాధాన్యతలు తెలుసుకోవడం వాటిని సెట్ చేసుకోవడం ముఖ్యం. మీరు ఎటువైపు నడవాలో తెలిస్తేనే కదా అడుగు వేయగలం. ఏదైనా పని చేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటే దానిని కొనసాగించాలి. ఒక పని ద్వారా మీరు సౌకర్యంగా లేకుండా దానిని విస్మరించాలి.
6. చేసే ముందు ఆలోచించాలి
ఏ పనైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఒక పని చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి, దానికి మీరెంత సమయం వెచ్చించాలి, ఎంత కష్టపడాలి సహా ఇతర అంశాల గురించి ప్రశ్నించుకోవాలి. అప్పుడే పని మొదలుపెట్టాలి.



Click it and Unblock the Notifications