Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
'కోరిక' ఉంటేనే సంబంధం సజావుగా సాగుతుంది, దానిని సజీవంగా ఉంచడం ఎలాగంటే..
సంబంధంలో దంపతుల మధ్య ఉండాల్సిన కోరిక ఏంటి, ఎలాంటి కోరిక వల్ల సంబంధం సజీవంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దాంపత్య బంధంలో కోరిక ఉండాలి. ఆ కోరికనే ఆ సంబంధాన్ని కలకాలం సజీవంగా ఉంచుతుంది. కోరిక అంటే లైంగిక సంబంధమైనది కాదు. అది వేరే. ఆ కోరిక సంబంధాన్ని బలోపేతం చేసే మార్గాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. మీరు ప్రేమలో ఉండొచ్చు, మీ సంబంధంలో స్నేహం, నమ్మకం, విధేయత ఉండొచ్చు.. అయితే ఇవన్నీ కోరికగా పేర్కొనలేం.

సంబంధంలో దంపతుల మధ్య ఉండాల్సిన కోరిక ఏంటి, ఎలాంటి కోరిక వల్ల సంబంధం సజీవంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కోరిక అంటే ఏంటి? ప్రేమకు దానికి తేడా ఏంటి?
లైంగిక కోరిక అనేది లోపల మాత్రమే కాదు, భాగస్వాముల మధ్య కూడా ప్రవహిస్తుంది. ప్రేమ అనేది ప్రతి జంట మధ్య ఉండాల్సినది. కోరిక అనేది దంపతుల మధ్య కావాల్సినది. ప్రేమ అనేది మనకు తెలిసిన విషయం అయితే, కోరిక అనేది ఏదో తెలియని ఉత్సాహం. ఏదైనా ఊహించదగినది అయితే అది భద్రతా భావాన్ని జోడించగలదు. కానీ రహస్యంగా ఉండటం వల్ల సంబంధంలో అదనపు స్పార్క్ ను జోడించవచ్చు.
సంబంధం మొదట్లో ఉత్సాహం ఉంటుంది. కానీ కాలక్రమేణా అది తగ్గుతూ వస్తుంది. అయితే దంపతులు ఇద్దరూ సరైన పనులు చేస్తే మొదట్లో ఉన్న ఉత్సాహం ఎప్పటికీ ఉంటుంది. అయితే అది అనుకున్నంత సులభమేం కాదు. దాని కోసం ఇద్దరు భాగస్వాములు శ్రమించాల్సి ఉంటుంది.
సంబంధంలో కోల్పోయిన కోరికను, ఉత్సాహాన్ని ఈ చిట్కాలతో తిరిగి తీసుకురావొచ్చు.

1. ఇద్దరికీ ఆసక్తి కలిగించే పనులు చేయాలి
సంబంధాన్ని తేలికగా ఉంచడానికి హ్యూమర్ జోడించాలి. ఇద్దరికీ సంతోషాన్ని కలిగించే పనులు చేయాలి. జ్ఞాపకాలను నిర్మించుకోవడం, కలిసి ఆనందాన్ని పంచుకోవడం చాలా అవసరం. ఇది ప్రతిదానిని ఉల్లాసంగా చేయడమే కాకుండా అనవసరమైన డ్రామాలను కూడా దూరంగా ఉంచుతుంది.

2. భాగస్వామి చెప్పేది వినాలి
సంబంధంలో సమస్యలు కామన్. అయితే వాటిని ఎలా పరిష్కరించుకున్నామనే దానిపైనే సంబంధం ఆధారపడి ఉంటుంది. దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. మనసులో ఏముందో చెప్పేయ్యాలి. అప్పుడు మీ భావాలు ఎదుటివారికి అర్థం అవుతాయి. అలాగే వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటే దానిని పరిష్కరించడం సులువు అవుతుంది.

3. ప్రేమను వ్యక్తపరచాలి
మీ మనసులో ఏముందో, ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలియదు. జీవిత భాగస్వామికి కూడా మీరేమనుకుంటున్నారో సరిగ్గా తెలియదు. అందుకే మీరేమనుకుంటున్నారో మీరే చెప్పాలి. సైలెంట్ గా ప్రేమిస్తూ పోవడం కాదు మీరు ప్రేమిస్తున్నట్లు చెప్పాలి. వివిధ సందర్భాల్లో ఆ ప్రేమను వ్యక్తపరచాలి. మీరు చేసే పనులకు రొమాన్స్ జోడించాలి. తరచూ తాకడం, వెనక నుండి వాటేసుకోవడం, చిలిపిగా మాట్లాడటం, సర్ ప్రైజ్ బహుమతులు ఇవ్వడం లాంటివి చేస్తుండాలి. వాటి వల్ల మీకెంత ప్రేమ ఉందో వారికి అర్థం అవుతుంది.

4. మన్నించండి, మరచిపోండి, ప్రశంసించండి
తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. మీరూ చేస్తారు, మీ భాగస్వామి చేస్తారు. కాబట్టి మీ లైఫ్ పార్ట్‌నర్ ఏదైనా తప్పు చేస్తే వారిని మన్నించండి, దాని గురించి మర్చిపోండి. మీరేదైనా తప్పు చేస్తే క్షమించమని అడగండి. అలాగే మీ భాగస్వామి చేసే చిన్న చిన్న పనులను ప్రశంసించండి. వాటి ద్వారా మీకు వారి పట్ల ఉన్న అభిమానం వారికి తెలుస్తుంది.

5. కొత్తగా ప్రయత్నించాలి
సంబంధాన్ని కొత్త అనుభవాలతో నింపండి. దాని ద్వారా దంపతుల మధ్య కొత్త ఉత్సాహం వస్తుంది. అది మీ బంధాన్ని సజీవంగా ఉంచుతుంది. భాగస్వామితో తగినంత నాణ్యమైన సమయాన్ని వెచ్చించండి. దాని వల్ల మీరు భాగస్వామికి ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతుంది.



Click it and Unblock the Notifications