For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘పెళ్లైన కొత్తలో కనీసం తాకనిచ్చేది కాదు.. ఏడాది తర్వాత పిల్లలు కావాలంటోంది.. ఎందుకని ఆరా తీస్తే...’!

మీ భాగస్వామి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడితే.. దాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మీ అందరికీ 'బహుమతి' సినిమా గుర్తుందా? అందులో హీరో వేణు భార్యగా నటించిన సంగీత భర్తను ఎంతలా హింస పెడుతుందో తెలుసుగా. అయితే అదంతా రీల్ లైఫ్.

How To React When Your Spouse Says Hurtful Things in Telugu

అయితే రియల్ లైఫ్ లో కూడా అంతకన్నా ఘోరంగా ఉంది తన భార్య అంటున్నాడో ఓ భర్త. ఏకంగా తన భార్యనుద్దేశించి.. విశ్వంలోనే అత్యంత భయంకరమైన భార్యగా అభివర్ణించాడు.

How To React When Your Spouse Says Hurtful Things in Telugu

అయితే అతను ఎందుకు అంత పెద్ద మాటలు అన్నాడు.. ఇంతకీ తను భార్యతో ఎలాంటి బాధలు పడ్డాడు.. తను ఇంకా ఏయే విషయాలు చెప్పాడు. మరి అంతలా బాధపెట్టే భార్య నుండి తనకు రిలీఫ్ దొరికిందా? లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...''నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...'

ఫారిన్లో ఉంటున్నాం..

ఫారిన్లో ఉంటున్నాం..

‘నాకు పెళ్లయి సుమారు మూడేళ్లు అవుతుంది. ప్రస్తుతం ఫారిన్లో ఉంటున్నాం. మాది పెద్దలు సెట్ చేసిన పెళ్లి. అయితే మా ఇద్దరం పెళ్లైన కొత్తలో చాలా సంతోషంగా ఉండేవాళ్లం. అయితే నిశ్చితార్థం తర్వాత అసలు కథ మొదలైంది.

నాపైనే ఫోకస్..

నాపైనే ఫోకస్..

ఎప్పుడైతే మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగిందో.. అప్పటి నుండి తను పూర్తిగా నాపైనే ఫోకస్ పెట్టింది. ప్రతి చిన్న విషయానికీ గొడవ పడేది. పైగా బూతులు కూడా తిట్టేది. ఇక పెళ్లి తర్వాత నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.

ఎక్కడ ఏం జరిగినా..

ఎక్కడ ఏం జరిగినా..

ఈ విశ్వంలో ఎక్కడ ఏం జరిగినా.. అది తనపై ఆపాదించుకుంటోంది. తనపై కుట్రతోనే అదంతా జరుగుతోందని ఊహించుకుంటోంది. అలా ప్రతిరోజూ ఏదో ఒక విషయంపై లేదా ఎవరో ఒకరి మీద కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. అక్కడితో ఆగకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది.

హనీమూన్, శోభనం సమయంలో ఈ విషయాలు ప్రత్యేకంగా ఎందుకు జరుగుతాయో తెలుసా...హనీమూన్, శోభనం సమయంలో ఈ విషయాలు ప్రత్యేకంగా ఎందుకు జరుగుతాయో తెలుసా...

ఏడాది వరకు..

ఏడాది వరకు..

అలా గొడవ పడటం కారణంగా మేమిద్దరం పెళ్లైన నాటి నుండి సుమారు సంవత్సరం పాటు ఫిజికల్ గా కలవలేదు. తనను కనీసం తాకనిచ్చేది కాదు. ముట్టుకుంటే చాలు కస్సుబస్సుమనేది. కానీ ఇటీవల తన ఫ్రెండ్స్ అంతా ప్రెగ్నెన్సీలని తెలుసుకుంది. అప్పటి నుండి తనలో కూడా పిల్లలు కావాలనే కోరికలు కలిగాయి.

నాతో ప్రేమగా..

నాతో ప్రేమగా..

అప్పటి నుండి నాతో ప్రేమగా ఉన్నట్టు నటించడం స్టార్ట్ చేసింది. అయితే ఏ సమయంలో కలయికలో పాల్గొంటే సంతానం కలుగుతారో తెలిసి.. కేవలం ఆ టైమ్ లో మాత్రమే నాతో ప్రేమగా నటిస్తోంది. మిగిలిన రోజుల్లో తనను తాకితే చాలు తెగ కోప్పడుతుంది. ఈ విశ్వంలో ఇలాంటి భయంకరమైన భార్య ఎవరికీ ఉండదేమో అనిపిస్తోంది.

ఇతరుల కోసమే..

ఇతరుల కోసమే..

తనకు నేనంటే అస్సలు ఇష్టం లేదు. తను ఏం చేసినా ఇతరులకు చూపించడం కోసమే. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే.. నన్ను తీవ్రంగా నిరాశపరుస్తుంది. చాలాసార్లు నాకు పెళ్లయినా.. ఒంటరిగా జీవిస్తున్నా అనే భావన కలుగుతోంది. ఏదైనా అంటే.. నన్ను, నా ఫ్యామిలీని తిట్టిపోస్తుంది. దీంతో తనకు విడాకులు ఇచ్చేయాలని అనిపిస్తోంది. కానీ తనకు తండ్రి లేడు. తను తల్లి మాటలే వింటోంది. ఏదైనా చెబితే ఇష్యూను మరింత పెద్దది చేస్తుంది. విడాకులు తీసుకుంటే సామాజికంగా చెడ్డ పేరు వస్తుందని ఆందోళన చెందుతున్నా. ఇప్పుడేం చేయాలి' అని ఓ భర్త తన ఆవేదనను వెళ్లగక్కాడు. దీనికి నిపుణులు ఏమి సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

Marriage Tips: మీ మ్యారేజ్ లైఫ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే.. ఈ పదాలను రెగ్యులర్ గా చెప్పాలంట...!Marriage Tips: మీ మ్యారేజ్ లైఫ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే.. ఈ పదాలను రెగ్యులర్ గా చెప్పాలంట...!

మిమ్మల్ని బాధిస్తున్నాయి..

మిమ్మల్ని బాధిస్తున్నాయి..

వివాహం అనేది జీవితకాల రిలేషన్ అనేమి రూల్ లేదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం లాంటిది. ఇది వివాహ జంటలు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. మీరు తనను గౌరవిస్తున్నా.. తను మిమ్మల్ని తిడుతూనే ఉంటంతో.. తన ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తోందని అర్థమవుతోంది. ఈ సమయంలో కొన్ని సూచనలు పాటించి చూడండి.

ఎదురు చెప్పకండి..

ఎదురు చెప్పకండి..

తను మిమ్మల్ని ఎంత తిడుతున్నా.. ప్రేమగానే మాట్లాడండి. అస్సలు ఎదురు మాట్లాడకండి. మొదట్లో మీకు ఇది కష్టంగా ఉన్నప్పటికీ, చివరికి ఆమె మాటలు మీరు పట్టించుకోరనే విషయం అర్థం చేసుకోరని తెలిసి వెనక్కి తగ్గొచ్చు.

దగ్గరయ్య దారులు..

దగ్గరయ్య దారులు..

తనకు దూరం కావాలనే థాట్ (ఆలోచన)ను పక్కనబెట్టి.. దగ్గరయ్యే మార్గాలను అన్వేషించండి. ఆమెలో మీరు ఏం కోరుకుంటున్నారో తెలియజేయండి. తన నుండి ఎలాంటి స్పందన లేకపోతే.. ప్రెజర్ పెట్టకండి. కాస్త ఓపికతో ఎదురుచూడండి. మీరు దూరమైతే తనకు ఎంత ప్రాబ్లమో చెప్పే ప్రయత్నం చేయండి.

మైండ్ సెట్..

మైండ్ సెట్..

ముందుగా తన మైండ్ సెట్ గురించి థింక్ చేయండి. వీలైతే మానసిక వైద్యులను కలవండి. మీ ఇద్దరిలో సాన్నిహిత్యం లేనప్పుడు మీరు సంతానం కావాలనుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి తన మానసిక స్థితి మంచిగా ఉన్నప్పుడే ఆ కార్యంలో పాల్గొనండి.

లేకపోతే మీ పిల్లలు ఇబ్బంది పడతారు. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు కేవలం ప్రేమతో మాత్రమే తన మనసు మార్చొచ్చనే విషయాన్ని మరవకండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.

English summary

How To React When Your Spouse Says Hurtful Things in Telugu

Here we are talking about the how to react when your spouse says hurtful things in Telugu. Read on
Desktop Bottom Promotion