For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....

కొత్తగా పెళ్లి అయిన జంటలు వారికి తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలివ్వాలో తెలుసుకోండి.

|

పెళ్లి అయిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు అనేది కచ్చితంగా వస్తుంది. అప్పటిదాకా ఒంటరిగా ఎలా పడితే అలా తిరిగిన వారికి ఒక్కసారిగా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

How to smartly reply to baby planning questions

పెళ్లి చేసుకుని కొద్ది కాలం కూడా పూర్తి కాక ముందే స్నేహితులు, బంధువులు, పక్కింటి వారు, ఎదురింటి వారి నుండి తరచుగా కొన్ని ప్రశ్నలు ఎదురవుతుంటాయి. చాలా మంది భార్యభర్తలు ఇలాంటి ప్రశ్నలను తరచుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

How to smartly reply to baby planning questions

ముఖ్యంగా పిల్లల గురించి పదే పదే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కొంతమంది వీటి నుండి తప్పించుకోవడానికి అసలు బయటికెళ్లడమే మానేయ్యడం.. లేదా కోపం తెచ్చుకోవడం వంటివి చేస్తుంటారు. వీరికి ఇది ఒక సవాలుగా మారిపోతుంది.

How to smartly reply to baby planning questions

అయితే ఇలాంటి సమయాల్లోనే మీరు ఓపికగా వ్యవహరించాలి. చాలా సహనంతో స్మార్ట్ గా వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మీ బంధువులు, స్నేహితులు, ఇతరులు మీ పిల్లల గురించి లేదా ఇతర ప్రశ్నలేవైనా సంధించినప్పుడు ఎలా స్పందించాలి.. ఎలాంటి సమాధానాలివ్వాలో అనే విషయాలను మీ కోసం తీసుకొచ్చాము. వాటిని చూసి మీరు ఇలానే ప్రయత్నించండి.

కామసూత్రాల్లో లైంగిక విషయాల గురించి 20% మాత్రమే... మరి మిగిలిన విషయాలేంటో తెలుసా?కామసూత్రాల్లో లైంగిక విషయాల గురించి 20% మాత్రమే... మరి మిగిలిన విషయాలేంటో తెలుసా?

స్వేచ్ఛగా మాట్లాడండి..

స్వేచ్ఛగా మాట్లాడండి..

మీరు ఒక కొత్త కుటుంబంలో ప్రవేశించాక.. పిల్లల గురించి ప్రశ్నలనేవవి చాలా చాలా కామన్. కాబట్టి మొదట్లో ఇలాంటి ప్రశ్నలెదురైతే సిగ్గు పడండి. అయినా వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, మీరు ఆ విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడండి. మీరు ఎంత తెలివిగా మాట్లాడితే, వారు మిమ్మల్ని అంత చికాకు పెట్టడం మానేస్తారు.

కోపం తెచ్చుకోకండి

కోపం తెచ్చుకోకండి

సాధారణంగా వివాహం తరువాత, అమ్మాయిలకు పిల్లల పుట్టేందుకు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారనే ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతాయి. అయితే కొన్నిసార్లు అబ్బాయిలకు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. కాబట్టి మీరు మీరు ఇలాంటి ప్రశ్నలపై శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి సమయంలో మీరు మీ భావోద్వేగాన్ని నియంత్రించుకోవాలి. ఓపికగా వ్యవహరించాలి. కోపం తెచ్చుకోకూడదు. ఈ రకమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండండి. మీ మానసిక స్థితిని ఎట్టి పరిస్థితిలో పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మీకు మరియు మీ భాగస్వామికి దీనిపై అవగాహన ఉంటే చాలు.

ఫన్నీగా సమాధానం ఇవ్వండి

ఫన్నీగా సమాధానం ఇవ్వండి

మీ ముందు ఉన్న వ్యక్తి అదే ప్రశ్నను పదేపదే వాటి గురించే అడిగితే, మీరు దానికి సరదాగా సమాధానం ఇవ్వడం ప్రారంభించండి. మీకు వ్యక్తిగత జీవితం ఉందని, బేబీ ప్లానింగ్ నిర్ణయం కూడా మీ వ్యక్తిగత విషయం అని వ్యంగ్యంగా సమాధానం చెప్పవచ్చు. ఇది సముచితమని మీకు అనిపించినప్పుడు మీరు ప్రజలకు శుభవార్త ఇస్తారు.

ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...

మానసికంగా సిద్ధం కావాలి..

మానసికంగా సిద్ధం కావాలి..

మీరు కుటుంబ నియంత్రణ చేయకపోతే బేబీ ప్లానింగ్ ప్రశ్నలతో భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్నల నుండి మీరే ఒత్తిడి చెందాల్సిన పని లేదు. మీరు మరియు మీ భాగస్వామి శిశువు కోసం శారీరకంగా మరియు మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించండి. ప్రజలకు ప్రశ్నించడం అలవాటు, కాబట్టి వారు చెప్పే దాని గురించి చింతించకండి.

భాగస్వామి మద్దతు

భాగస్వామి మద్దతు

కొత్తగా పెళ్లి అయిన వారికి లేదా పెళ్లి అయి కొన్ని నెలలు గడిచిన వారికి, మీ పిల్లల గురించి ప్రశ్నలు తరచుగా ఎదురవుతుంటే, మీరు మీ భాగస్వామి మద్దతును తీసుకోవాలి. మీరిద్దరూ కలిసి కూర్చొని, వీటిపై మాట్లాడుకోవడం మంచిది. దీనికి ఒక పరిష్కారం కూడా కనుగొనాలి. ఎందుకంటే మీ భాగస్వామి మీతో ఉన్నప్పుడు, మీరు ప్రపంచంలో ఎలాంటి పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు ఎలాంటి క్లిష్ట సమస్యలకైనా సులభంగా పరిష్కారం కనుగొనగలరు.

డైవర్ట్ చెయ్యండి..

డైవర్ట్ చెయ్యండి..

కుటుంబసభ్యులంతా కలిసి ఒక ఫంక్షన్ లేదా ఏదైనా పార్టీలో కలుసుకున్నప్పుడు, కొత్తగా పెళ్లయిన వారికి లేదా పెళ్లి అయిన కొంతకాలం గడిచిపోయినట్లయితే అందరి కళ్లు మీపైనే ఉంటారు. వారు కచ్చితంగా మీరు పిల్లల్ని ఎప్పుడు కంటున్నారు. మాకు ఎప్పుడు శుభవార్త చెబుతారు. మా మనవడిని మా చేతుల్లో ఎప్పుడు పెడతారు అనే ప్రశ్నలు కచ్చితంగా ఎదురవుతాయి. ఇలాంటి చోట్ల మీరు స్మార్ట్ గా తప్పించుకోవాలి. మీరు వెంటనే అలాంటి అంశాలను డైవర్ట్ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. వారికి కూడా ఈ ప్రశ్న ఇప్పుడు అడగాల్సిన సమయం కాదని తెలిసిపోతుంది.

<strong>ఇవి మీ సంబంధాలను మరియు సెక్స్ జీవితాన్ని ఎలా మారుస్తుందో మీకు తెలుసా?</strong>ఇవి మీ సంబంధాలను మరియు సెక్స్ జీవితాన్ని ఎలా మారుస్తుందో మీకు తెలుసా?

పెళ్లి తర్వాత ఉద్యోగానికెళ్తావా?

పెళ్లి తర్వాత ఉద్యోగానికెళ్తావా?

ఉద్యోగం చేసే చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి ప్రశ్న కచ్చితంగా ఎదురవుతుంది. అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే, మీరు దానికి అవుననే సమాధానం చెప్పాలి. దీన్ని కొందరు మెచ్చుకోవచ్చు. కొందరు మాత్రం ఏవేవో కారణాలు చెప్పి నిరుత్సాహ పరచొచ్చు. మీరు వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు.

స్మార్ట్ ఫోన్ విషయంలో..

స్మార్ట్ ఫోన్ విషయంలో..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కారణంగా ప్రపంచమే మన అరచేతిలో ఉండిపోతోంది. ప్రతి చిన్న పనికీ స్మార్ట్ ఫోన్ కావాల్సిందే. అది లేదంటే రోజు అనేదే గడవదు. అయితే కొత్తగా పెళ్లయిన సమయంలో ఫోన్ లో కాస్త ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అంత మాత్రానికే కొంతమందికి ఏదేదో సందేహం వస్తుంది. కొంతమంది నేరుగా ఇలాగే అడిగేస్తారు. ఏంటీ ఈ మధ్య ఫోనులో తెగ మాట్లాడుతున్నావు అంటారు. అప్పుడు మీరు ఇలా చెప్పండి. మన కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులతో టచ్ లో ఉండటానికి ఉన్న ఏకైక మార్గం స్మార్ట్ ఫోనే. అందుకే ఎవరైనా బాగా దగ్గరైన వాళ్లు ఫోన్ చేస్తే కాస్త ఎక్కువ మాట్లాడతాం స్మార్ట్ గా సమాధానం చెప్పండి. మరోసారి మీకు ఇలాంటి ప్రశ్న అనేదే ఎదురవ్వదు.

ఒక్కటే వెళతావా?

ఒక్కటే వెళతావా?

అమ్మాయిలకు పెళ్లి అయిన తర్వాత ఆఫీసుకు లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, ఇలాంటి ప్రశ్న కచ్చితంగా ఎదురవుతుంది. ‘ఏంటీ పెళ్లి తర్వాత కూడా ఒక్కదానివే వెళ్తావా? మీ శ్రీవారిని తోడు తీసుకెళ్లచ్చుగా' అనే ప్రశ్నలు ఎదురవుతాయి. అయితే మీరు వారికి స్మార్ట్ గా సమాధానమివ్వాలి. ‘మేము చదువుకున్న వారం. కాబట్టి మా చుట్టూ ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేయకండి' అని సమాధానమివ్వండి.

వీటిని పట్టించుకోకండి..

వీటిని పట్టించుకోకండి..

కొత్తగా పెళ్లయిన వారికి లేదా పెళ్లి అయిన కొంత కాలానికి ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వడం అనేది సర్వసాధారణం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు అస్సలు బాధపడొద్దు. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని ఇతరుల కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. ఎందుకంటే మీకు నచ్చినట్టు మీరు ఉన్నప్పుడే మీరు ఆనందంగా, హాయిగా జీవించగలుగుతారు.

English summary

How to Smartly Reply to Baby Planning Questions

Here are some smart ways to response on baby planning questions.
Desktop Bottom Promotion