For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లైన తర్వాత ప్రియుడు/ప్రియురాలు కనిపిస్తే... మీ రియాక్షన్ ఇదేనా?

|

మనలో వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడే ఉంటారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతూ ఉంటారు.

అయితే ఇద్దరు వ్యక్తులు ఏదో విషయం గురించి గొడవపడి విడిపోయినంత మాత్రాన వారు జీవితంలో ఎప్పటికీ కలవరని అనుకోవడం పొరపాటే. అలాగే వారు తిరిగి ప్రేమలో పడరని అనుకోవడం కూడా తప్పే.

ఎందుకంటే ఎంత గాఢమైన బంధమైనా.. అప్పుడప్పుడు ఏదో ఒక మనస్పర్దలు వస్తుంటాయి. ఆ క్షణంలో కొందరు ఆవేశంలో బ్రేకప్ చెప్పేస్తారు. అంతేకాదు ఇంట్లో చూసిన సంబంధాలకు ఓకే చెప్పేస్తారు. ఆవేశంలో పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకు మీ మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రియురాలు కనిపిస్తే మీ రియాక్షన్ ఏంటి? మీకు ఎలాంటి ఆలోచనలు కలుగుతాయనే వివరాలను కొందరు మాతో షేర్ చేసుకున్నారు. అప్పుడు కలిగే ఫీలింగ్స్ ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

'నా భర్త పెళ్లైనా పక్కచూపులు చూస్తున్నాడు.. ఇతర స్త్రీలతో సరసాలాడుతూ...''నా భర్త పెళ్లైనా పక్కచూపులు చూస్తున్నాడు.. ఇతర స్త్రీలతో సరసాలాడుతూ...'

స్నేహితుల్లా విడిపోయాం..

స్నేహితుల్లా విడిపోయాం..

సాధారణంగా ఎవరైనా జంటలు విడిపోతే ఎక్కువగా గొడవపడటం లేదా ఏదైనా మనస్పర్దలు వచ్చి విడిపోతూ ఉంటారు. కానీ మేం మాత్రం అలా కాకుండా మంచి స్నేహితుల్లాగా విడిపోయాం. అదే స్నేహంతో పెళ్లి తర్వాత కూడా టచ్ లో ఉన్నాం. మేం విడిపోయిన రెండేళ్లకు నా మాజీ ప్రియుడు సిటీకి వచ్చాడు. ఫోన్ చేసి వీలైతే కలుద్దామన్నాడు. అప్పటికే నాకు పిల్లలు కూడా ఉన్నారు. తనకు కూడా మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తనతోనే కొత్త జీవితం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు.

అందుకే వెళ్లాను..

అందుకే వెళ్లాను..

తనతో క్యాజువల్ గా కలుద్దామని వెళ్లాను. కానీ తనతో కలిసి మాట్లాడగానే నా మనసు మళ్లీ మారిపోయింది. తను ఇంతకుముందులా లేడని అనిపించింది. చాలా విషయాలు మేం హ్యాపీగా మాట్లాడుకున్నాం. తను సిటీకి ఓ పని మీద వచ్చాడట. లాడ్జికి వెళ్లాలని చెప్పాడు. కానీ నేను మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా మా ఇంట్లో ఉండమని చెప్పేశాను.

అవన్నీ గుర్తొచ్చేవి..

అవన్నీ గుర్తొచ్చేవి..

తను కూడా నా మాట కాదనకుండా మా ఇంటికొచ్చేశాడు. తను మా ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుండి గతంలో మా ఇద్దరి మధ్య జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చేవి. మేమిద్దరం తొలిసారిగా కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన రోజులు గుర్తొచ్చాయి. మళ్లీ ఇప్పుడు తను మా ఇంట్లో రెండురోజులు తోడుగా నిలిచాడు. నాకు కొంత సాయం కూడా చేశాడు.

మళ్లీ ఆ బంధం..

మళ్లీ ఆ బంధం..

ఇక రాత్రి డిన్నర్ టైమ్ లో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నాకెందుకో మళ్లీ తనతో ఆ రిలేషన్ కంటిన్యూ చేయాలనిపించింది. తనతో అదే విషయం చెప్పాను. తను కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు మా రిలేషన్ కంటిన్యూ చేయాలంటే మేమింకా ఎక్కువ కష్టపడాలని మాకు తెలుసు. మేమిద్దరం అందుకు సిద్ధంగా ఉన్నాం. మళ్లీ మా బంధాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం' అని ఓ వివాహిత తన ఫీలింగ్స్ ను షేర్ చేసుకుంది.

ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. అది పక్కన పెట్టాల్సిందే...!ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. అది పక్కన పెట్టాల్సిందే...!

సడన్ గా కనిపించేసరికి..

సడన్ గా కనిపించేసరికి..

మరొక యువకుడు తన మాజీ ప్రియురాలి గురించి ఈ విషయాలు చెప్పాడు. తను ఆమె గాఢంగా ప్రేమించుకున్నారట. కాకపోతే వారి కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వారి ప్రేమ పరిణయం దాకా వెళ్లలేదు. అందులోనూ తనది వేరే మతం అయ్యేసరికి గొడవలు కాకూడదనే ఉద్దేశ్యంతో మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది.

మరచిపోలేకపోయాను..

మరచిపోలేకపోయాను..

తను నా నుండి దూరమైన వెంటనే ఫోన్ నెంబర్ కూడా మార్చేసింది. కొత్త నెంబర్ కోసం ఎంత ట్రై చేసినా దొరకలేదు. నా ఫేస్ బుక్ అకౌంట్ ను కూడా బ్లాక్ చేసింది. కానీ నేను మాత్రం తనను మరచిపోలేకపోయాను. లక్కీగా ఓ ఫ్రెండ్ ద్వారా తన ఇంటి నెంబర్ సంప్రదించాను.

రెగ్యులర్ గా టచ్ లో..

రెగ్యులర్ గా టచ్ లో..

అప్పటినుండి నేను మరో కొత్త నెంబరుతో తన ల్యాండ్ లైను ఫోన్ చేసేవాన్ని. కానీ అప్పటికే తనకు పెళ్లైందన్న విషయం తెలిసింది. అది తెలిసి నా గుండె పగిలినంత పనయ్యింది. అయినా తను నాతో ప్రేమను కొనసాగించేందుకు ఆసక్తి చూపింది. కానీ నేనే ధైర్యం చేయలేదు' అంటూ ఓ యువకుడు తన అనుభవాలను చెప్పుకున్నాడు.

English summary

If You Meet Your Ex After Getting Married, What Is Your Reaction?

Here we are talking about the if you meet your ex after getting married, what is your reaction?. Have a look
Story first published: Saturday, June 12, 2021, 11:54 [IST]