Latest Updates
-
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా?
Relationship Problems: బిల్ గేట్స్ వివాహా బంధానికి వీడ్కోలు...! 27 ఏళ్ల మ్యారేజ్ లైఫ్ కి బ్రేకులు...!
విడాకులు తీసుకోవడానికి గల ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో వివాహ బంధం అంటే ఒక కొత్త వ్యక్తితో తమ జీవితాన్ని పంచుకోవడం. అంతేకాదు తనతోనే జీవితాంతం గడపాలని భావిస్తారు. అయితే విదేశాల్లో మాత్రం వివాహాల విషయంలో ఎలాంటి షరతులు ఉండవు.
PC : dw

ఎప్పుడు కావాలనుకుంటే.. అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు.. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు విడిపోవచ్చు. అందుకే కొందరు ఒక సంవత్సరానికి.. కొందరు రెండేళ్లకు.. మరికొందరు పదేళ్లకో.. ఇరవై ఏళ్లకో విడిపోతుంటారు.

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా బిల్ గేట్స్ కపుల్స్ 27 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలకబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దంపతులు విడాకులు తీసుకోవడానికి గల సాధారణ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

వివాహ బంధానికి వీడ్కోలు..
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దంపతులు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పనున్నట్లు సోమవారం రాత్రి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తమ 27 ఏళ్ల మ్యారేజ్ లైఫ్ జర్నీకి పర్మినెంట్ గా పుల్ స్టాప్ పెట్టనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ జంట విడాకులు తీసుకోవడం అన్న వార్త విని అందరూ షాక్ కు గురయ్యారు.

అనేక సేవా కార్యక్రమాలు..
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు పొందిన ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. కరోనాపై పోరులో, టీకాల కోసం వీరు భారీ మొత్తంలో డబ్బును విరాళంగా ఇస్తున్నారు.

ఎంతో మదనం తర్వాత..
‘ఎన్నో చర్చలు, సమాలోచనలు, ఎంతో మదనం చేసుకున్న తర్వాతే తమ మ్యారేజ్ లైఫ్ కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాం' అని చెప్పారు. ‘‘27 ఏళ్ల సంవత్సరంలో మేము ముగ్గురు మంచి పిల్లలను తీర్చిద్దాం. వారి భవిష్యత్తుకు దారి చూపాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు.. అందరూ ఎదిగేందుకూ మా సంస్థ ద్వారా ఎంతో ప్రయత్నించాం' అని వివరించారు.

మేము విడిపోయినా..
మేమిద్దరం దంపతులుగా విడిపోయినప్పటికీ, స్వచ్ఛంద సంస్థ మిషన్లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. మేమిద్దరం కొత్త జీవితంలో వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాం' అని ట్విట్టర్లో బిల్, మిలిండాలు ప్రకటించారు.

విడిపోవడానికి కారణాలు..
బిల్ గేట్స్ కపుల్స్ సంగతి పక్కనబెడితే.. ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే విడిపోతున్నారు. చిన్న చిన్న గొడవలకే అపార్థం చేసుకుంటున్నారు. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. ఎవ్వరినీ పట్టించుకోకుండా విడాకులు కోరుతున్నారు. ఆవేశంలో తమ జీవితం తాము బతికేస్తామని అంటున్నారు.

విడాకులకు కారణాలు..
అయితే ఇలా విడాకులు తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులోనూ అబ్బాయిలే కంటే అమ్మాయిలే విడాకులు తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారట. విడిపోవడం అనే టాపిక్ తీసుకొచ్చేదే అమ్మాయిలంట. ఇదే విషయం పలు సర్వేలలో కూడా నిరూపితమైంది. ఆస్ట్రేలియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందట.

సహకారం లేకపోవడం వల్లే..
భర్తల నుండి తాము ఆశించిన సహకారం లభించకపోవడం వల్లే అసలు సమస్య స్టార్టవుతుందట. ఇంటి పని, ఆఫీసు పని, పిల్లలను చూసుకోవడంతో పాటు కుటుంబ బాధ్యతలు ఇతర పనులన్నీ తామొక్కరే చేయాల్సి వచ్చినప్పుడు చాలా మంది మహిళలు విడాకుల గురించి ఆలోచన చేస్తారట.

తమ లక్ష్యం చేరుకోకపోతే..
మరి కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత తమ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని భావన కలిగినప్పుడు, తమ గుర్తింపును కోల్పోయినప్పుడు, తరచూ గొడవలు వస్తున్నప్పుడు, మానసికంగా ఒత్తిడి, జీవితం చాలా బోరింగ్ గా అనిపించినప్పుడు, భర్త నుండి శారీరక, మానసిక సహకారం లేక దాడులు ఎక్కువైనప్పుడు విడాకులు తీసుకోవాలనే ఆలోచన వస్తుందట.
ఇలాంటి కారణాల వల్లే చాలా మంది దంపతులు విడిపోయి స్వతంత్రంగా బతకాలని భావిస్తున్నారని ఆ సర్వేలో తేలింది.



Click it and Unblock the Notifications