For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కార్యంలో అనుభవం లేనోళ్లు.. ఎక్కువగా చేసే పొరపాట్లు ఇవే..

|

మనలో వయసులో ఉన్న ఆడ, మగవారిలో ప్రతి ఒక్కరూ రతి క్రీడకు అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. భార్యభర్తలు లేదా ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడాలన్నా.. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగాలన్నా..

రొమాంటిక్ లైఫ్ ఆనందంగా సాగాలన్నా.. శృంగారం కీ రోల్ ప్లే చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే తొలిసారి శృంగారంలో పాల్గొనే వారు కొంత ఆందోళనకు లేదా భయపడటం అత్యంత సహజమే. మొదటిసారి ఆ కార్యంలో పాల్గొనేవారికి కొన్నిరకాల అపొహలు ఉండటం సర్వసాధారణమే.

ఈ రకమైన ఆందోళన ఆడవారిలో మరియు మగవారు ఇద్దరిలోనూ ఉంటుంది. తొలిసారి అనుభవం ఎలా ఉంటుందో.. తాను భాగస్వామిని ఆనందపరుస్తానా? తమ తనువుల తహతహలకు సరైన పరిష్కారం లభిస్తుందా? తన భాగస్వామిని తన సామర్థ్యాన్ని మెచ్చుకుంటుందా.. తన అంచనాల్ని నేను అందుకుంటానా? అనే విషయాలతో పాటు ఇంకా అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. అందుకే చాలా మంది జంటలు తొలిసారి ఆ కార్యంలో పాల్గొనేటప్పుడు కొన్ని పొరపాట్లు కచ్చితంగా చేస్తారు. కాబట్టి అలాంటి తప్పులను అధిగమించేందుకు కొన్ని పనులు చేయాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'ముందు అన్నయ్యతో లవ్.. బ్రేకప్..! తర్వాత నాకు ప్రియురాలిగా..' రేస్ సినిమాలా మారిన మా ప్రేమ కథ...!'ముందు అన్నయ్యతో లవ్.. బ్రేకప్..! తర్వాత నాకు ప్రియురాలిగా..' రేస్ సినిమాలా మారిన మా ప్రేమ కథ...!

శృంగారంపై ఫోకస్..

శృంగారంపై ఫోకస్..

మనలో చాలా మందికి పెళ్లికి ముందు పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంటుంది. చాలా మంది అందులో చేసినట్టుగానే తమ భాగస్వామితోనూ ఆ కార్యాన్ని ఆస్వాదించాలనుకుంటారు. మీరు కూడా అందులో చూపినట్టుగా చేయాలనుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అందులో నటించే వారు చాలా సార్లు బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. అంతేకాక, యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు స్పెషల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ ఎక్కువగా చేస్తుంటారు. ఇదంతా మీరు నిజమనుకుంటే తప్పులో కాలేసినట్టే. కాబట్టి మీరు కూడా మీ పార్ట్ నర్ తో అలా చేయాలనుకోకండి. వారిని కూడా అలా చేయాలని ఒత్తిడి చేయకండి. ఇవన్నీ పక్కనబెట్టి తొలిసారి ఆ కార్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టండి.

అలా తెలుసుకోండి..

అలా తెలుసుకోండి..

మీరు తొలిసారి లైంగిక కార్యంలో పాల్గొంటూ ఉంటే.. మీరు మీ భాగస్వామి ఆ కార్యం గురించి ఏమనుకుంటున్నారో ఒకరికొకరు ముచ్చట్లు పెట్టి తెలుసుకోండి. మీరు ఆ విషయం గురించి లోతుగా చర్చించుకున్నాక, మీ కోరికలు, అవసరాలు మరియు భయాలేంటో క్లుప్తంగా తెలుసుకోవాలి. మీ భాగస్వామి ఆ కార్యం గురించి ఏమనుకుంటున్నారో.. తనకు ఎలాంటి భయాలు ఉన్నాయో తెలుసుకోవాలి.

కండోమ్ వాడకపోవడం..

కండోమ్ వాడకపోవడం..

తొలిసారి లైంగిక చర్యలో పాల్గొనే వారు చేసే పెద్ద పొరపాటు కండోమ్ వాడకపోవడం. దీని వల్ల మీరు ఇతర సమయాల్లో కూడా అలానే రతిక్రీడలో పాల్గొనాలని భావిస్తారు. దీని వల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా అది వాడకపోవడం వల్ల సంక్రమణ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవాంఛిత గర్భం, లైంగిక జబ్బులు వస్తుంటాయి. మీరు అలాంటి వాటి నుండి రక్షణ పొందడానికి కండోమ్ ను కచ్చితంగా వాడాలని గుర్తుంచుకోండి.

కారు లోన్ కట్టాక.. బ్రేకప్ చెప్పింది.. సరిగ్గా పెళ్లికి ముందే మాజీ ప్రియుడితో..!కారు లోన్ కట్టాక.. బ్రేకప్ చెప్పింది.. సరిగ్గా పెళ్లికి ముందే మాజీ ప్రియుడితో..!

ఒత్తిడి చేయొద్దు..

ఒత్తిడి చేయొద్దు..

చాలా మందికి తొలిసారి లైంగిక క్రీడలో పాల్గొనేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది. కొందరికి రక్తపు మరకలు కూడా అవుతుంటాయి. అయితే అందరికీ అలానే కావాలన్న అవసరం లేదు. మొదటిసారి ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు రక్తస్రావం అయితేనే కన్యత్వం ఉన్నట్లు భావించకండి. ఎందుకంటే చాలా మందికి రన్నింగ్ లేదా సైకిల్ తొక్కేటప్పుడే చిన్నపొర చినిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మొదటిసారి ఆ కార్యంలో పాల్గొనేటప్పుడు చాలా మంది స్త్రీలకు సహజంగానే కొంత నొప్పి కలుగుతుంది. కొందరు పురుషులు చాలా బలంగా వారి యోనిలోకి బలంగా పురుషాంగాన్ని చొప్పిస్తుంటారు. అయితే దీని వల్ల వారికి తీవ్రమైన అసౌకర్యం, నొప్పి కలుగుతుంది. దీనికి పరిష్కారంగా మీరు ఫోర్ ప్లే ప్రయత్నించండి. అంతేకానీ వారిపై ఒత్తిడి చేయకండి.

ఆందోళనకు గురి కావొద్దు..

ఆందోళనకు గురి కావొద్దు..

మీరు ఆ కార్యంలో తొలిసారి పాల్గొనేటప్పుడు వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే ఆలోచనలు చేయండి. సినిమాల్లో చూపించినట్టు చేయాలని, అప్పుడే మీరు ఆ కార్యంలో ఆస్వాదించాలని అనుకోకండి. ముఖ్యంగా రతి క్రీడలో తొలిసారి పాల్గొనేటప్పుడు ఎలాంటి టార్గెట్లు పెట్టుకోకండి. మీ భాగస్వామిని సైతం ఆందోళనకు గురి చేయకండి. మీరు ఆ కార్యాన్ని ఆనందంగా ఆస్వాదించాలంటే.. ‘పెద్ద వక్షోజాలు' లేదా ‘పెద్ద పురుషాంగం' ఉండాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. రతి క్రీడ అనేది ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఆస్వాదించే క్రీడ అనే విషయాన్ని మరచిపోవద్దు.

స్నేహితులతో షేర్ చేసుకోవడం..

స్నేహితులతో షేర్ చేసుకోవడం..

చాలా మంది జంటలు తొలిసారి కలయిక గురించి తమ అనుభవాలను గొప్పగా స్నేహితులతో చెప్పుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి విషయాలు మీ భాగస్వామికి ఇష్టం ఉండకపోవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని ముందు మీ పార్ట్ నర్ తో మాట్లాడండి. మీరు వీటి గురించి ఇతరులతో అంటే మీకిష్టమైన వారితో చెప్పడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావనే నమ్మకం ఉంటేనే, వాటి గురించి షేర్ చేసుకోండి.

English summary

Most Common First Time Love Making Mistakes in Telugu

Here is a look at the most common first time love-making mistakes. Read on.
Story first published: Monday, May 24, 2021, 19:47 [IST]