`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘పెళ్లికి ముందే ఆ తప్పు చేసిందట.. కానీ ఇప్పుడు కూడా...’

|

ఓ వైపు తనకేమో బ్రేకప్ జరిగి బాధలో ఉన్నాడు. తన ప్రియురాలిని ఇప్పుడిప్పుడే మరిచిపోయేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో కుటుంబ సభ్యులు తనకు ఓ మంచి సంబంధం తీసుకొచ్చారు.

తను పెళ్లి చూపుల సమయంలోనే తనకు కాబోయే గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ముఖ్యంగా తన గతం గురించి తెలుసుకున్న అతను.. ఇలాంటి అమ్మాయి తనను పెళ్లి తర్వాత అర్థం చేసుకుంటుందని భావించాడు.

అందుకే పాత విషయాలను పక్కనబెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం అయిన తర్వాత కూడా తన భార్య తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ తో పోల్చడం.. తనను తరచుగా ఇబ్బంది పెట్టడం చేస్తోందట.

అంతటితో ఆగకుండా ఆమె తన ప్రియుడితో నిత్యం టచ్ లో ఉంటుందట. ఈ విషయం తనకు తెలిసినా ఏమి అనలేకపోతున్నాడట. ఈ సమయంలో తన సమస్యకు పరిష్కారం చెప్పమని, నిపుణులను సంప్రదించగా.. వారేమి సమాధానం చెప్పారు.. ఇంతకీ తన ప్రాబ్లమ్ కి పరిష్కారం లభించిందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మూడు నెలల ముందే...

మూడు నెలల ముందే...

‘హాయ్ నా పెళ్లి జరిగి కేవలం మూడు నెలలే అయ్యింది. పెళ్లికి ముందు తన గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను. తను అన్నింటినీ పక్కనబెట్టి కొత్త లైఫ్ కోసం చూస్తున్నానంటే నమ్మేశాను.

డీప్ లవ్ లో..

డీప్ లవ్ లో..

అయితే పెళ్లికి ముందు నా జీవిత భాగస్వామి తన బాయ్ ఫ్రెండ్స్ తో పీకల్లోతు ప్రేమలో ఉందని తెలుసు కానీ.. అది శారీరకంగా కలిసేంత అని కాదని నమ్మాను. తను కూడా అదే చెప్పింది. తనతో బ్రేకప్ అయ్యిందని చెప్పింది.

మా ఫ్యామిలీలో..

మా ఫ్యామిలీలో..

అయితే తనకు పెళ్లికి ముందే తన బాయ్ ఫ్రెండ్స్ తో శారీరక సంబంధాలు కూడా ఉన్నాయని నాకిప్పుడే తెలిసింది. మా ఫ్యామిలీ ఏమో సంప్రదాయ కుటుంబం. ఇలాంటివి మా ఇంట్లో తెలిస్తే అస్సలు ఒప్పుకోరు.

మొదట్లో ఫోన్లో..

మొదట్లో ఫోన్లో..

పెళ్లైన కొత్తలో తను తరచుగా ఫోన్లో మాట్లాడేది. నా ముందు మాత్రం మచా మచా అంటూ మాట్లాడుతుండేది. అయితే, తనకు మళ్లీ ఫోన్ చేయకని, పదే పదే చెబుతుండేది. ఇది చూసిన నేను తను మారిందని అనుకున్నాను.

కానీ అదే రిపీట్..

కానీ అదే రిపీట్..

అయితే తనను మరచిపోతుందిలే అనుకున్న నాకు అతి తక్కువ కాలంలోనే షాకిచ్చింది. నేను లేనప్పుడు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలిసింది. దీంతో ఓ రోజు నాకు కోపం వచ్చింది. ఇంకోసారి ఇది జరిగితే, నేను తనపై దాడి చేస్తానని చెప్పా.

డిపార్ట్ మెంట్ లో జాబ్..

డిపార్ట్ మెంట్ లో జాబ్..

దీనికి ఆమె నవ్వుతూ ఇలా చెప్పింది. ‘నువ్వు తనని ఏమీ చేయలేవు. ఎందుకంటే తను డిపార్ట్ మెంట్ లో జాబ్ చేస్తున్నాడు. తను చాలా బలంగా ఉంటాడు. తను అలా చెప్పడానికి కారణం నేను చాలా చిన్నగా.. హైట్ తక్కువగా ఉండటం.

బాధగా అనిపించింది..

బాధగా అనిపించింది..

తను ఆమె ప్రియుడి గురించి అలా చెప్పేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. ఆమె ఫోన్లో తనతో నిత్యం మాట్లాడుతూ.. నన్ను బలహీనుడిగా మార్చేస్తోంది. దీంతో నేను చాలా డిప్రెషన్ కు గురవుతున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలేం చేయలేకపోతున్నాను' అని ఓ వ్యక్తి తన గోడు వెళ్లబోసుకున్నాడు. (గోప్యత నిమిత్తం బాధితుడి వివరాలు తెలపట్లేదు)

మీ భార్యకే చెప్పాలి..

మీ భార్యకే చెప్పాలి..

ఇందుకు నిపుణులు సమాధానం ఏం చెప్పారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరున్న పరిస్థితిని బట్టి మీ ఇద్దరి మధ్య బంధం ఇంకా బలోపేతం కావాల్సి ఉంది. ఇప్పుడు మీరనుభవిస్తున్న పెయిన్ ను మీ భార్యకే చెప్పాలి.

ప్రేమతో..

ప్రేమతో..

అయితే ఆ విషయాన్ని మీరు కోపంతో చెప్పకుండా.. కొంచెం ప్రేమతో చెప్పాలి. ఆమె మీరు చెప్పిన విషయాన్ని స్వీకరించేలా మీ మాటతీరు ఉండాలి. ఆమెను కూడా మీ ప్రాబ్లమ్ ఏంటో అర్థం చేసుకోమని చెప్పండి. ఆమెతో మీ బాధ గురించి చెప్పడానికి ఏది సరైన మార్గమనేది మీరే డిసైడ్ చేసుకోవాలి.

వ్యతిరేకత ఏర్పడుతుంది..

వ్యతిరేకత ఏర్పడుతుంది..

మీరు ఇలాంటి విషయాలను ఆవేశంగా చెబితే.. మీరు ఆమె ద్రుష్టిలో మరింత చులకగా మారిపోతారు. అంతేకాదు ఆమెకు మీ పట్ల వ్యతిరేక భావన ఏర్పడుతుంది. అందుకే మీరు తనలో నమ్మకాన్ని కలిగించేలా.. భద్రతను పెంపొందించేలా వ్యవహరించాలి.

అలా చేయొద్దు..

అలా చేయొద్దు..

ఆమె మీ వీక్ నెస్ గురించి మాట్లాడుతోందని ఎక్కువగా చింతించకండి. ఆమె గతాన్ని తవ్వడం.. పదే పదే తనకు గుర్తు చేయడం.. తప్పుల్ని ఎత్తి చూపడం వంటివి అస్సలు చేయకండి. ఆమెను మెప్పించేందుకు ట్రై చెయ్యండి. పరాయి వ్యక్తిని మరచిపోయేలా ప్రయత్నించండి.

English summary

My partner had a deep relationship with her boyfriend before marriage, Should i divorce or not?

Here we talking about the my partner had a deep relationship with her boyfriend before marriage, Should i divorce or not? Read on,
Story first published: Friday, October 30, 2020, 15:02 [IST]