For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా మీద మన్ను పడ... అంతా ఆన్ లైన్ కళ్యాణాలే...! అన్నీ వాడిపోయిన ముఖాలే...!

|

మన దేశంలో చాలా మంది చిన్ననాటి నుండే పెళ్లి విషయంలో ఎన్నో కలలు కంటూ ఉంటారు. తమ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేసుకోవాలని, ఏవేవో చేయాలని తెగ ఊహించుకుంటూ ఉంటారు. అయితే అలా ఘనంగా కావాల్సిన కళ్యాణ కార్యక్రమాలన్నీ కరోనా దెబ్బకు చాలా మంది ఇలాంటి వాటిని వేసుకోవాల్సి వస్తుంది. అయితే మన దేశంలో ప్రస్తుతం వైశాఖ మాసం. అంటే పెళ్లిళ్ల సీజన్ అన్నమాట. ఈ సమయంలో ఎన్నో జంటలు ఒక్కటవుతుంటాయి.

అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ప్రభావం కళ్యాణాలపై కూడా పడింది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ లాక్ డౌన్ ను లెక్కచేయకుండా అతి తక్కువ మంది జన సమూహంతో తమకు కాబోయే భాగస్వామిని వివాహం చేసుకుంటున్నారు.

ఇటీవలే మన టాలీవుడ్ లో కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యంగ్ హీరో నిఖిల్, జబర్దస్త్ మహేష్ లు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే రాణా దగ్గుబాటి కూడా తనకు కాబోయే ఫియాన్సీ గురించి సోషల్ మీడియాలో వివరాలను షేర్ చేసుకున్నాడు.

అయితే కొంతమంది మాత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ పెళ్లిళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి పెళ్లిళ్ల గురించి మీరు వినే వింటారు. అయితే తాజాగా అలాంటి ఆన్ లైన్ పెళ్లి ఒకటి తాజాగా వైరల్ అయ్యింది. అయితే అందరిలాగా ఈమె పెళ్లి సంతోషంగా జరగలేదు. ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో 'దాని' కోసం చూస్తున్నారా? అలా చేయడం తప్పు కావచ్చు ...!

దివి నుండి దిగొచ్చిన దేవకన్యలా..

దివి నుండి దిగొచ్చిన దేవకన్యలా..

అందులో ఓ పెళ్లికూతురు చూడటానికి చాలా అందంగా అచ్చం దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా కనిపిస్తోంది. అందమైన పెళ్లికూతురిలా ముస్తాబైంది. కొత్త పట్టుచీర, చేతికి బంగారు గాజులు, మోచేతుల వరకు గోరింటాకు పెట్టుకుని, తన కురులను అందంగా అలంకరించుకుని పెళ్లికి సిద్ధమయ్యింది.

ల్యాప్ టాప్ ఎదుట..

ల్యాప్ టాప్ ఎదుట..

అయితే అందరూ ఊహించినట్టు ఆమె పెళ్లి ఏ ఫంక్షన్ హాలులోనో, కళ్యాణ మండపంలోనో కాదు. తన ఇంట్లోనే. అది కూడా నాలుగు గోడల మధ్య ఓ ల్యాప్ టాప్ ముందు. అందుకేనేమో ఆ అందమైన అమ్మాయి ముఖంలో కనీసం రక్తపు చుక్క కూడా కనబడలేదు. ఆనందం అసలే లేదు. చాలా బాధగా జూమ్ యాప్ లో బంధువులను చూస్తూ పెళ్లికి సిద్ధమైపోయింది.

తగ్గిన కళ..

తగ్గిన కళ..

అందంగా ముస్తాబై ల్యాప్ టాప్ ముందు కూర్చున్న అందమైన పెళ్లికూతురు ముఖం బాగా వాడిపోయింది. బహుశా తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన వివాహ వేడుక ఇలా జూమ్ యాప్ లో చేసుకునే సరికి ఆ వధువు ఆందోళనతో ఆమె ముఖం మొత్తం ఎంతో బాధ నిండిపోయింది.

ఈ లక్షణాలుంటే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్టే...!

సోషల్ మీడియాలో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్..

జూమ్ లో వీడియో కాలింగులో వివాహానికి ముందు ల్యాప్ టాప్ దగ్గరకు ఓ అందమైన వధువు వచ్చింది. అయితే అందులో ఆమె ఆందోళనగా కనిపిస్తోంది. ఈ ఫొటోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది కాస్త బాగా వైరల్ అయిపోయింది.

నెటిజన్ల కామెంట్లు...

నెటిజన్ల కామెంట్లు...

ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని పెళ్లిళ్లు ఇలా ఆన్ లైన్ లో చేసుకోవాల్సిన కర్మ పట్టిందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం కరోనా కారణంగా పెళ్లిళ్లు ఆన్ లైన్ చేస్తున్నారు సరే.. కాపురం ఎలా చేస్తారని.. అది కూడా అందులోనే కానిచ్చేయండని సెటైర్లు వేస్తున్నారు.

ప్రత్యేక అనుభవంగా..

ప్రత్యేక అనుభవంగా..

అయితే ఆన్ లైన్ లో పెళ్లి కార్యక్రమానికి కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా హాజరవుతున్నారు. వారు హాజరై కెమెరాలో వధూవరులిద్దరినీ ఆశీర్వదిస్తున్నారు. ఈ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలా వివాహ వేడుకలకు హాజరవ్వడం వధూవరులతో పాటు బంధువులకు కూడా ప్రత్యేక అనుభవంగా మిగిలిపోయింది.

జూమ్ యాప్ లో పెళ్లి..

జూమ్ యాప్ లో పెళ్లి..

కరోనా మహమ్మారి వల్ల ఇలా ఆన్ లైన్ లో పెళ్లిళ్లు ఎక్కువ అవుతుండటంతో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పెళ్లి వంటి ముఖ్యమైన ఘట్టాలకు 20 నుండి 50 మంది వరకు పెళ్లిళ్లకు హాజరవ్వచ్చని పేర్కొన్నాయి. అయితే వేర్వేరు రాష్ట్రాల్లో ఉండే వధూవరులు, కుటుంబసభ్యులైతే మాత్రం జూప్ యాప్ లోనే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.

English summary

Online Wedding Troubles for the beautiful bride

Here are the online wedding trobules for the beautiful bride. Take a look.
Story first published: Monday, May 18, 2020, 18:27 [IST]