For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాపురంలో కలహాలు.. విభేధాలతో విడాకులు.. ఇదే లేటెస్ట్ ట్రెండ్...! దీని గురించి ప్రముఖులు ఏమంటున్నారంటే

|

మన భారతదేశంలో పెళ్లి అనే బంధానికి ఎంతో మంది అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఒకరు ఇంకొకరిని బంధుమిత్రులు, పెద్దల సాక్షిగా వివాహం చేసుకున్నారంటే జీవితాంతం వారితోనే కలిసి ఉండేలా ప్రమాణం చేస్తారు. అయితే ప్రస్తుత జనరేషన్ వారు పెళ్లైన కొత్తలో బాగానే కలిసి ఉంటున్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ వారి కాపురంలో కలహాలను పెంచుకుంటున్నారు.

అంతేకాదు ఈ విడాకుల విషయంలో సెలబ్రిటీలు ముందు వరుసలో నిలుస్తున్నారు. లేటు వయసులోనూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి కమల్ హాసన్ వరకు విడాకులు తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు.

ఈ సందర్భంగా విడాకులు అనేది నిజంగా సానుకూలామా కాదా? విడాకుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? లేదా ప్రతికూలతలు ఉన్నాయా? అనే వివరాలను ఈ స్టోరీలను తెలుసుకుందాం...

ముందుగా విడాకుల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు...

సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు...

మీరు వివాహ బంధం నుండి విముక్తి పొంది విడాకులు తీసుకుంటే మీరు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ వ్యక్తిగత విషయాల గురించి వేరొకరితో సంప్రదించాల్సిన అవసరం అనేదే ఉండదు. మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే మీరు మీ వివాహ బంధంలో కచ్చితంగా సమస్యలు ఉన్నాయని అనిపిస్తేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

సెకండ్ ఇన్సింగ్స్..

సెకండ్ ఇన్సింగ్స్..

మీరు మీ వివాహ బంధం నుండి మీరు విడిపోయినప్పుడు మీరు ప్రేమ మరియు ఆప్యాయతలు, మనసు వంటి వాటికి దూరం కావచ్చు. అయితే విడాకులు తీసుకోవడం వల్ల మీకు సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ‘‘నేను వివాహం చేసుకున్న తర్వాత 22 సంవత్సరాల తర్వాత నా భార్యను కలిసినప్పుడు నేను ఆమెలో ఒక బలమైన, స్థిరమైన భాగస్వామిని గుర్తించాను‘‘ అని విలియం సివి చెప్పారు.

రాజీ పడాల్సిన అవసరముండదు...

రాజీ పడాల్సిన అవసరముండదు...

వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్య లేదా భర్త ఏదో ఒక సందర్భంలో రాజీ పడాల్సి వస్తుంది. అయితే వివాహ బంధం వీగిపోవడం వల్ల మీరు ఎలాంటి వాటికి రాజీ పడాల్సిన అవసరం ఉండదు. మీకు నచ్చిన జీవన శైలిని మీరు అనుసరించవచ్చు.

విడాకులు తీసుకొనే కంటే ఈ విధంగా చేయడంలో తప్పేముంది...?

మరెన్నో అవకాశాలు...

మరెన్నో అవకాశాలు...

మీరు వివాహం బంధం వల్ల ఆగిపోయిన లేదా నిలిచిపోయిన స్నేహాలను తిరిగి కొనసాగించవచ్చు. అంతే కాదు కొత్త ప్రేమ మరియు కొత్త సాహసాలు వంటి మరెన్నో అవకాశాలు ఉంటాయి.

ప్రతిదీ మారుస్తుంది...

ప్రతిదీ మారుస్తుంది...

‘‘కొత్త ప్రారంభాన్ని పొందగల సామర్థ్యం.. నా నిజమైన ప్రేమను మరియు ఆత్మీయతను కనుగొనడం మరియు అతనితో పిల్లలను కలిగి ఉండటం అనేది నాకు సంతోషంగా ఉంది. నా కొత్త జీవితాన్ని, నన్ను నేను పునర్నిర్మించుకోగలిగాను మరియు నన్ను నేను తిరిగి ఆవిష్కరించుకోగలిగాను‘‘ అని ఎలిజిబెత్ అన్నారు.

కంఫర్ట్ జోన్...

కంఫర్ట్ జోన్...

విడాకులు తీసుకోవడం అనే దానిని కంఫర్ట్ జోన్ అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఇద్దరు వ్యక్తులు సరిహద్దుల కోసం తాము గొడవ పడకుండా, వారంతా సుఖంగా ఉన్నట్లు, విడాకులు తీసుకున్న తర్వాత సౌకర్యవంతంగా ఉండొచ్చని తారా ఐసెన్ హార్డ్ చెప్పాడు.

విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు చేసే 5 పొరపాట్లు...

విడాకుల వల్ల ప్రతికూలతలేంటో తెలుసుకుందాం...

విడాకుల వల్ల ప్రతికూలతలేంటో తెలుసుకుందాం...

ప్రధాన భాగాన్నికోల్పోతారు..

‘‘మీరు వివాహ బంధానికి వీడ్కోలు పలికి విడాకులు గనుక తీసుకుంటే మీ జీవిత చరిత్రలో ప్రధాన భాగాన్ని కోల్పోతారు. మీ గుర్తింపును కూడా కోల్పోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు దిక్కుతోచని పరిస్థితిలా అనిపిస్తుంది‘‘ అని ఎలిజిబెత్ చెప్పారు.

మధుర క్షణాలను...

మధుర క్షణాలను...

‘‘నేను నా భర్త కలిసి ఎంతో సంతోషంగా గడిపిన మధుర క్షణాలు గుర్తుంచోవడం అనేది చాలా కష్టంగా తయారవుతుంది‘‘ అని ఎలిజిబెత్ అన్నారు.

ఒంటరితనం...

ఒంటరితనం...

మీరు వివాహ బంధం నుండి విముక్తి పొందామని అనుకుంటే అది ఒక పెద్ద పొరపాటే. విడాకులు తీసుకున్నాక మీతో మీ భాగస్వామి లేని సమయంలో మీకు కొత్తగా మరియు వింతగా అనిపిస్తుంది. మీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పటికీ మీకు ఒంటరితనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ‘‘నా ఇద్దరు కూతుళ్లతో నేను కలిసి ఉన్నప్పటికీ, చాలా సమయాల్లో చాలా ఒంటరిగా ఉన్నట్లు ఉంటుందని‘‘ ఆమె తన అనుభవాలను చెప్పుకొచ్చారు.

స్నేహితులను కోల్పోతారు..

స్నేహితులను కోల్పోతారు..

‘‘నేను విడాకులు తీసుకున్న సమయంలో మంచి స్నేహితులను కోల్పోతారు. చాలా మంది వివాహ బంధంలో స్నేహపూర్వకంగా మెలగాలని అనుకుంటారు. అలాగే గడుపుతారు. తీరా వివాహా బంధాన్ని ముగించాక ఎంత మందో అద్భుతమైన వ్యక్తులను కోల్పోయాను అనిపిస్తుంది‘‘ అని ఆమె చెప్పారు.

మళ్లీ పెళ్లి చేసుకుంటే...

మళ్లీ పెళ్లి చేసుకుంటే...

‘‘నేను మొదటి వివాహ బంధానికి వీడ్కోలు పలికి, మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మాత్రం నేను నా సవతి పిల్లలతో కలిసి ఉంటున్నాను. ఈ సమయంలో నాకు చాలా బాధగా, కష్టంగా ఉంటుంది‘‘ అని ఆమె చెప్పారు.

ఆర్థిక భారం...

ఆర్థిక భారం...

‘‘విడాకులు తీసుకోవడానికి ఆర్థికపరమైన కారణాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. తన ఇంటిని నిలబెట్టుకోవటానికి తన మాజీలలో ఒకరిని ఆర్థికంగా చెల్లించాల్సి ఉందని‘‘ ఆమె గుర్తు చేసుకుంది.

నిరాశ..

నిరాశ..

‘‘ కొన్ని సందర్భాల్లో విడాకుల విషయంలో ద్రోహం జరిగినట్లు అనిపిస్తుంది. మొదటి సారి అనేక రకాల భావోద్వేగాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఈ సందర్భంలో చాలా నిరాశ ఎదురవుతుందని‘‘ హోలింగర్ చెప్పారు.

మీరే ప్రశ్నించుకోండి...

మీరే ప్రశ్నించుకోండి...

వివాహ బంధం విషయంలో మీకు మీరే ప్రశ్నించుకోండి. మీ కఠినమైన ప్రశ్నలకు అద్దం ముందు నిలబడి మీ ముఖం చూసుకుంటూ మీరే సమాధానాలు ఇచ్చుకోండి. అప్పుడు విడాకుల విషయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచించాల్సి వస్తుంది. ఈ విమర్శనాత్మక పరిశీలన ఉంటే మీరు మంచి వ్యక్తిగా మారి, మీ ప్రధాన పురోగతులకు దారి తీస్తుంది.

English summary

People Reveal the Best and Worst Things About Getting Divorced

Here we talking about people reveal the best and worst things about getting divorced. Read on