Just In
- 2 hrs ago
ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!
- 4 hrs ago
ఆల్కహాల్ వల్ల బ్లడ్ షుగర్ లో వచ్చే మార్పును ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకోండి!
- 4 hrs ago
Carbide Free Mangoes:మామిడిలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఇలా కనిపెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...
- 5 hrs ago
మీ భర్తలోని 'ఈ' లక్షణాల వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు...!
Don't Miss
- News
కిన్నెర మొగులయ్య మనస్థాపం: పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తా, బీజేపీ నేతలు బదనాం చేస్తున్నారు..
- Sports
బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణమేంటో చెప్పిన హార్దిక్.. ఆర్సీబీ టీం నుంచి సిరాజ్ ఔట్
- Movies
RC15 : రామ్ చరణ్ మరో న్యూ లుక్ వైరల్.. శంకర్ ప్లాన్ మామూలుగా లేదు!
- Technology
ఈ కోడ్ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు
- Automobiles
హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?
- Finance
ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లయినా తమ పార్ట్నర్ ను మోసం చేసేందుకు గల కారణాలివే...
ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి కారణంగా అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయి.
కొందరు వ్యక్తులు తెలిసి తెలిసి తప్పులు చేసి తమ పచ్చని కాపురాన్ని చేతులారా కూల్చేసుకుంటున్నారు. ఇంకా కొందరైతే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, కోరికలు తీర్చుకునేందుకు క్షణికావేశంలో వివాహేతర సంబంధాలు పెట్టుకుని స్త్రీ, పురుషులిద్దరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు.
అక్రమ సంబంధం నేపథ్యంలో తాము మూడు ముళ్లు వేసిన జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నారు. మరికొందరు తమ భాగస్వామిని మోసం చేస్తూ హత్యలు చేసి హంతకులుగా మారిపోతున్నారు. ఇంకా కొందరు వివాహ జీవితంలో తమ భాగస్వామి ద్రోహం చేస్తున్నారని తెలిస్తే, వారితో వెంటనే విడిపోతున్నారు.
ఇదిలా ఉండగా కొందరు వ్యక్తులు వివాహ జీవితంలో తమ జీవిత భాగస్వామిని నిరంతరం మోస్తూ ఉంటారు. అయితే వారికి విడాకులిచ్చేందుకు మాత్రం నిరాకరిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? మోసం చేసే భాగస్వాములు వైవాహిక బంధంలో కొనసాగేందుకు గల కారణాలేంటో కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Mantras
From
Kamasutra
in
Telugu:
శృంగారంలో
ఈ
నియమాలను
ప్రతి
ఒక్కరూ
తప్పక
తెలుసుకోవాలి...

మోసగాళ్లు పెళ్లి ఎందుకు చేసుకుంటారు?
కొందరు వ్యక్తులు రెగ్యులర్ గా మోసం చేసేందుకు పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే వారు తమ జీవితాన్ని పంచుకోవడానికి భాగస్వామిని కూడా కోరుకుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామిని మళ్లీ మళ్లీ మోసం చేస్తూనే ఉంటారు. ఒకరితో ఒకరు మరొక సంబంధం లేకుండా జీవించలేరు. అయితే వారి నుండి ఎలా తప్పించుకోవాలో... వారిని ఎలా మాయ చేయాలనే విషయాలు వీరికి బాగా తెలుసు.

మోసం చేసే భాగస్వామి..
తమ జీవిత భాగస్వామికి నమ్మకద్రోహం చేసే పురుషులు ఇప్పటికీ తమ భార్యలను ప్రేమిస్తారు. వారు ఇప్పటికీ సంబంధంలో ఏదో ఒక అవసరం కావాలని కోరుకుంటారు. వారి కోరికల్లో ఉత్సాహం, మద్దతు, సెక్స్ లేదా మరేదైనా కావొచ్చు. ఎప్పటికీ యవ్వనంగా ఉండాలంటే వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉండాలని వారి మనసు కోరుకుంటుంది.

సౌకర్యవంతమైన ఇల్లు..
పెళ్లయిన వ్యక్తులు తమ వివాహ జీవితంలో తరచుగా ఏదైనా కొత్తది కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా కొత్తదనం కోసం తమ భాగస్వామిని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే చివరికొచ్చేసరికి తమ పిల్లలు మరియు జీవిత భాగస్వామితో ఉండాలని కోరుకుంటారు. వీరు ఇంట్లో వండిన ఆహారాన్ని తింటారు మరియు వారికి సుపరిచితమైన మరియు తేలికగా భావించే వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటారు. వారికి కావాల్సింది ఇదే. కానీ, అదే సమయంలో వేరొకరితో రిలేషన్ షిప్ లో హ్యాపీగా డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
మీ
భర్త
లేదా
భార్య
మాటలతో
వేధిస్తున్నారని
తెలుసుకోవడం
ఎలాగో
తెలుసా?

జీవితంలో మార్పు
ఇలాంటి వ్యక్తులు చాలా మందిని మోసం చేస్తారు. ఎందుకంటే వీరు తమ రోటీన్ లైఫ్ నుండి గ్యాప్ కావాలని కోరుకుంటారు. అందుకే ఇంట్లో వారి జీవిత భాగస్వాముల నుండి చాలా వివాదాలను ఎదుర్కొంటారు. ఇది వారిని నిరుత్సాహపరుస్తుంది లేదా చికాకుపెడుతుంది కాబట్టి వారు తమ ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ఇష్టపడతారు. వారు వివాహేతర సంబంధంలో ఉండాలనుకుంటున్నందున మరొక వ్యక్తిలో ఉత్సాహాన్ని కనుగొనడం ఉత్తమం.

నమ్మకంతో ఉంటారు..
చాలా మందికి తమ తప్పులను ఒప్పుకుని జీవిత భాగస్వామికి నిజం చెప్పే ధైర్యం ఉండదు. వారు తమ ద్రోహాన్ని సొంతం చేసుకోవడం మరియు కొత్త జీవితం కోసం తమ జీవిత భాగస్వామిని మరొక జీవిత భాగస్వామితో విడిచిపెట్టడం గురించి ఎప్పటికీ ఊహించలేరు. అందువల్ల ఈ రెండింటినీ ఎదుర్కోగలమనే నమ్మకంతో ఉంటారు.

పార్ట్నర్ పై ప్రేమ..
కొందరు పెళ్లయిన వ్యక్తులు తమ జీవిత భాగస్వామిపై చాలా ప్రేమను కలిగి ఉంటారు. వారు తమ భాగస్వామిని నిజంగా ప్రేమిస్తారు. కాబట్టి వారు తమ జీవిత భాగస్వామిని మోసం చేసినప్పటికీ వారితో కలిసి జీవించాలని కోరుకుంటారు. జీవితంలో కొంత ఉత్సాహం కోసం వారు తమ భాగస్వామిని మోసం చేస్తారు. కానీ, తమ భాగస్వామిని ప్రేమించడం కోసం ఏళ్ల తరబడి విడిచిపెట్టాలని వారు ఊహించలేరు.

బలమైన కారణాలివే..
మోసగాళ్లు తమ జీవిత భాగస్వాములతో కలిసి ఉండటానికి మరొక బలమైన కారణం ఏమిటంటే, వారికి పిల్లలు, ఆర్థిక పెట్టుబడులు మరియు ఇతర లక్షణాలు ఉండటం వల్ల నేరుగా విడాకులకు వెళ్లడం కష్టమవుతుంది. సమాజంలోని ఇతర వ్యక్తుల మాదిరిగానే వారు కుటుంబంగా జీవించాలనుకుంటున్నారు.