For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Arranged marriages: ప్రవాస భారతీయులు అరెంజ్డ్ మ్యారేజ్‌లకే ఓకే చెబుతున్నారెందుకు?

మాట్రిమోనియల్ సైట్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. మనకు నచ్చిన సైట్ లోకి వెళ్లి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి కావాలో వెతుక్కోవచ్చు.

|

Arranged marriages: దేశం నుండి విదేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అయిన ప్రవాస భారతీయులు అనగానే చాలా మందిలో ఒకరకమైన భావన కలుగుతుంది. అదేటంటే.. వారు అక్కడికి వెళ్లిన తర్వాత భారత సాంప్రదాయాలను మర్చిపోతారని అనుకుంటారు. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయల పట్ల విలువ ఇవ్వరని భావిస్తారు. ఒకప్పుడు ఇక్కడ పాటించిన ఆచారాలను చిన్నచూపు చూస్తారని అనుకుంటారు. పండగలను, పబ్బాలను వేడుకగా జరుపుకోరని అనుకోవడం చూసే ఉంటాం. కానీ భారతీయులు ఏ దేశానికి వెళ్లినా భారతీయులుగా ఉండేందుకే ఇష్టపడతారన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. వారు అన్ని పండగలు జరుపుకుంటారు. వీలైనంత మేర ఇక్కడి సాంప్రదాయాలను పాటిస్తారు. చాలా మంది ప్రవాసీయులు మన దేశంలో చేసుకున్నట్లుగానే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకే ఓకే చెబుతున్నారు. కల్చర్ మారినా, వెస్టర్న్ స్టైల్ ను ఫాలో అయినా.. అరెంజ్డ్ మ్యారేజెస్ కే ఎందుకు మొగ్గు చూపుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

అరెంజ్డ్ మ్యారేజెసే ఎందుకు?

అరెంజ్డ్ మ్యారేజెసే ఎందుకు?

ముంబయి పుట్టి, పెరిగిన మలైకా నేరి ప్రస్తుతం యూరప్ లో నివసిస్తున్నారు. ఆమె ఓ రిలేషన్ షిప్ కన్సల్టెంట్ గా అక్కడ పనిచేస్తున్నారు. ఆమె చెప్పినదాని ప్రకారం, భారత దేశం నుండి విదేశాలకు వెళ్లి అక్కడ స్థిర పడ్డవారు అరెంజ్డ్ మ్యారెజేస్ కే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. మలైకా నేరి వద్ద భారతదేశం నుండే కాకుండా, యూఎస్, యూకే, యూరప్ లాంటి పలు దేశాలకు చెందిన వారు వినియోగదారులుగా ఉన్నారు. మిగిలిన దేశాల వారి కంటే భారతీయులు కాస్త భిన్నంగా ఆలోచిస్తారని ఆమె అంటున్నారు. వారు డేటింగ్ యాప్ ల నుండి సంబంధాలను వెతుక్కోకుండా మాట్రిమోనియల్ సైట్లు, రిలేషన్ షిప్ కన్సల్టెంట్ల ద్వారా తమకు నచ్చిన వారిని వెతుక్కుంటారని నేరి చెప్పారు. భారత్ నుండి దూరంగా విదేశాల్లో ఉంటున్నా.. వారు మాత్రం అక్కడి ఆచారాలు పాటించడానికే ఇష్టపడుతున్నారట. సంస్కృతి ప్రకారం డేటింగ్ అనేది పెళ్లికి ముందు తప్పు అనే భావన వారిలో ఉంటుంది. అందువల్ల వివాహానికి ముందు వారికి అలాంటి అనుభవం ఉండదు. కాబట్టి స్టాక్ హోం, లండన్ వంటి నగరాల్లో భాగస్వామి కోసం వెతకడం కష్టమని వారు అనుకుంటారు. కాబట్టి అరెంజ్డ్ మ్యారేజెస్ వైపు వస్తుంటారని మలైకా నేరి చెబుతున్నారు.

సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య అంతరం:

సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య అంతరం:

భారతదేశం మరియు దక్షిణాసియాలో కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పొరుగు వారు సంబంధాలు కుదర్చడం అనేది సర్వసాధారణం. ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఏర్పాటు చేయబడే పెళ్లిళ్లకు ఆదరణ ఉండటంలేదు. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా డేటింగ్ మరింత సామాజికంగా ఆమోదయోగ్యమైనదిగా మారుతోంది. ఈ మార్పుకు అనుగుణంగా, చాలా మంది మ్యాచ్ మేకర్స్ కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. అలాగే మ్యాచ్ మేకింగ్ ‌కు ప్రత్యామ్నాయ విధానాలను అందిస్తున్నారు. ఇవి వ్యక్తులు వారి సంబంధాన్ని ఎంపిక చేసుకోవడంపై మరింత కచ్చితత్వంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది.

అరెంజ్డ్ మ్యారేజ్ కన్జూమర్స్:

అరెంజ్డ్ మ్యారేజ్ కన్జూమర్స్:

టెక్నాలజీ పెరుగుతోంది. రోజురోజుకూ చాలా మార్పులు వస్తున్నాయి. దానితో పాటు ముందుకు వెళ్లకపోతే వెనకబడిపోతాం. ఇదే ధోరణిలో వెళ్తోంది మ్యారేజెస్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు సంబంధాలు చూసే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మాట్రిమోనియల్ సైట్ లలో తమ వివరాలు పెడుతున్నారు. ఫోటోలతో పాటు తమకు సంబంధించిన పూర్తి సమాచారం అందులో పొందుపరుస్తున్నారు. నచ్చిన వారు వారిని నేరుగా సంప్రదించి తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ధోరణి పెరిగిపోయింది. మాట్రిమోనియల్ సైట్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. మనకు నచ్చిన సైట్ లోకి వెళ్లి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి కావాలో వెతుక్కోవాలి. తర్వాత వారి పెద్దలతో సంప్రదింపులు జరుపుకోవాలి. తర్వాత ఇరు పక్షాల అంగీకారం తర్వాత పెళ్లిళ్లు అవుతున్నాయి. వీటిని కూడా అరెంజ్డ్ మ్యారేజేస్ అనే అంటున్నారు.

భారతీయ వివాహ మార్కెట్:

భారతీయ వివాహ మార్కెట్:

* భారతదేశంలోని ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ మార్కెట్ గత ఐదేళ్లలో రెండింతలు పెరిగింది.

* KPMG, Google చేసిన అధ్యయనం ప్రకారం, ఈ రోజు సుమారు $260 మిలియన్లుగా అంచనా వేయబడింది.

* మ్యాచ్ మేకింగ్ వెబ్‌సైట్‌లు 1997 నాటి నుండే ఉన్నాయి. ఎవరైనా వివాహం చేసుకోవాలని నేరుగా శోధించే వ్యక్తులు ఉపయోగించారు.

డిజిటల్ మ్యాచ్‌మేకింగ్ ఎందుకింత ఆదరణ?:

డిజిటల్ మ్యాచ్‌మేకింగ్ ఎందుకింత ఆదరణ?:

స్వదేశంలో ఉన్న వారికి అయినా.. విదేశాల్లో ఉన్న వారికైనా డిజిటల్ వేదికల్లో భాగస్వాములను వెతుక్కోవడం చాలా సులభం. తమకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న వారిని ఒక్క క్లిక్ తో వెతుక్కోవచ్చు. అదే సాంప్రదాయ పద్ధతుల్లో అయితే ఇది చాలా సమయం, ఖర్చుతో కూడుకున్న పని. మతం, కులం, ప్రాంతం వారీగా పార్ట్ నర్స్ ను వెతుక్కునే వీలు ఉంటుంది. వారికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. నిమిషాల్లో చాలా మంది గురించి డిజిటల్ వేదికల్లో వాకాబు చేయవచ్చు.

English summary

Reasons Why do expat Indians choose arranged marriages in telugu

read on to know Reasons Why do expat Indians choose arranged marriages in telugu
Story first published:Friday, July 22, 2022, 13:26 [IST]
Desktop Bottom Promotion