For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కపుల్స్ కలయికలో హ్యాపీగా ఉండేందుకు ఇదొక కారణమని తెలుసా...

|

ప్రస్తుత తరం వారు సోషల్ మీడియా అంటే తెలియని వారు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కాలంలో చిన్నపిల్లాడి నుండి పండు ముసలి వాళ్ల వరకూ చాలా మంది సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు.

చాలా మంది ఉదయాన్నే సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్టు చేయడం.. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, కూ వంటి అనేక మాధ్యమాల్లో తమ పోస్టులలో ప్రతిరోజూ కొత్తగా ట్రై చేయడం.. దానికి వచ్చే లైక్స్, కామెంట్స్, షేర్లను చూస్తూ మురిసిపోతుంటారు. అంతేకాదు రాత్రికి రాత్రే తమ పోస్టులు వైరల్ కావాలాని.. తాము సెలబ్రెటీలుగా మారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇప్పటికే చాలా మంది తమ సెలబ్రెటీలుగా మారిపోయారు. ఇంకా చాలా మంది తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియానే తమ సోల్ మేట్ అని చెప్పేస్తున్నారు. అయితే ఇది మన సంబంధాలను శాసించే స్థాయికి వెళ్లిందని పలు అధ్యయనాలలో తేలింది. మరోవైపు సోషల్ మీడియాలో కొందరు కపుల్స్ చేసే పోస్టులు చాలా విచిత్రంగా ఉంటాయి. అంతేకాదు కొన్ని అసూయ పుట్టిస్తుంటాయి. దీంతో తాము కూడా వారిలా సంతోషంగా, ఆనందంగా ఉన్నామని.. తామలా ఉన్నామా లేదా కంపేర్ చేసుకుని చూస్తుంటారు.

ఇది చూడటానికి రొమాంటిక్ గా ఉన్నప్పటికీ.. వాస్తవం మాత్రం అలా ఉండకపోవచ్చు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. కొత్తగా పెళ్లైన వారు, అందులోనూ వివాహ జీవితంలో సంతోషంగా ఉన్న వారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారని, కేవలం అప్పుడప్పుడు మాత్రమే పోస్టులను చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని వెనుక గల కారణాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'ఆ కార్యం' గురించి మగాళ్లకు వచ్చే కామన్ డౌట్స్ ఇవే...! ముఖ్యంగా దాని సైజు గురించే...!

రెండు లాభాలు..

రెండు లాభాలు..

కొన్ని జంటలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ చేయడం వల్ల గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మీ సమస్యలకు పరిష్కారం కూడా లభించొచ్చు.

సోషల్ మీడియాకు దూరంగా..

సోషల్ మీడియాకు దూరంగా..

అయితే ఎవరైతే జంటలు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారో. తమ పర్సనల్ లైఫ్ గురించి పోస్టులు పెట్టకుండా తామే పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా ఉంటారో.. వారే ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారని తేలింది. దీనికి కారణం ఏంటంటే.. సోషల్ మీడియాలో తమ గురించి అప్ లోడ్ చేశారంటే.. తమ మధ్య ఉన్న అనుబంధం పది మంది మెచ్చుకోవాలని, వారికి తమ బంధం గురించి ఏదో చూపించాలనే ఫీలింగ్ లోలోపల ఉంటుందట.

ఎంత సంతోషమో..

ఎంత సంతోషమో..

అయితే జీవితంలో హ్యాపీగా ఉండే కపుల్స్ తమ వివాహ జీవితం గురించి.. తమ పార్ట్ నర్ పట్ల ఎంత ప్రేమ ఉంది.. తామెంత సంతోషంగా ఉన్నామనే విషయాలను నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తారట. అంతేకాదు తామిద్దరి మధ్య ఉన్న ప్రేమ సంబంధంలో నిజాయితీ గురించి నలుగురికి తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదని ఫీలవుతారట.

మీ మ్యారేజ్ లైఫ్ లో సోషల్ మీడియా వల్ల వచ్చే నష్టాలేంటో తెలుసా...

బానిసలా మారకూడదనే..

బానిసలా మారకూడదనే..

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తమ పర్సనల్ లైఫ్ గురించి పోస్టులు చేసే వారు దానికి ఎక్కువగా అడిక్ట్ అవుతారట. ముఖ్యంగా వీరు సోషల్ మీడియాలో వచ్చే లైక్లు, కామెంట్లు, షేర్లకు బాగా అడిక్ట్ అవుతారంట. అలా వారి లైఫ్ లో చాలా విషయాలను ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ తో కాకుండా ఇతరులే ఎక్కువగా ఉండటం ఒక కారణం. అందుకే తమ ఉనికిని చాటుకోడానికి క్రమం తప్పకుండా పోస్టులు చేస్తుంటారట.

కొంత గ్యాప్...

కొంత గ్యాప్...

చాలా మంది కపుల్స్ ప్రస్తుతం ఉన్న లైఫ్ ను బాగా ఇష్టపడతారు. కపుల్స్ ఎన్నిసార్లు హనీమూన్ కు వెళ్లినా.. ఎక్కడికైనా విహరయాత్రకు వెళ్లి ఎంత బాగా ఎంజాయ్ చేసినా.. ఎన్ని ఫొటోలను తీసుకున్నా కూడా.. కొంత గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేస్తుంటారు. అంతేగానీ.. తాము ఎప్పుడు తింటున్నాం.. ఏది తింటున్నాం.. ఏమి చేస్తున్నాం.. అనే ప్రతి విషయాన్నీ వెంట వెంటనే పోస్టులు పెట్టి కామెంట్స్, లైక్స్ వంటి వాటి కోసం చూసుకోరు. ఎందుకంటే ముందుగా తాము ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు వారికి బాగా తెలుసు. వారు కేవలం సంతోషానికే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వీరు పొగడ్తలు, రియాక్షన్ కోసం రాలేదన్న విషయం వారికి బాగా తెలుసు. ఇదొక్కటే కాదు.. వీరు తమ పార్ట్ నర్ తో ఎక్కువ క్షణాలను ఆనందిస్తారట.

హ్యాపీ కపుల్స్ కు..

హ్యాపీ కపుల్స్ కు..

సోషల్ మీడియా అంటే అంతా మనం ఊహించుకున్నట్టు ఉండదు. ఎందుకంటే ఇదొక పోటీ ప్రపంచం. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండాలన్నా.. వైరల్ కావాలన్నా.. అందరికంటే తాము మెరుగ్గా ఉండాలని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయతే ఇలాంటివాటి గురించి ఆలోచిస్తూ.. చాలా మంది ఇన్ సెక్యూర్ కు ఫీలవుతారు. ఎప్పటికప్పుడు ఇతరులతో పోల్చుకుని ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారు. అయితే హ్యాపీగా ఉండే జంటలకు ఈ సమస్యలనేవే ఉండవు.

టైం వేస్ట్ చేయరు..

టైం వేస్ట్ చేయరు..

కొందరు కపుల్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం అంటే టైం వేస్ట్ అని ఫీలవుతారంట. ఎందుకంటే వారు తమ రిలేషన్ షిప్ లో నిజాయితీగా ఉండటం వల్ల చాలా హ్యీపీగా ఉంటామని భావిస్తారట. అందుకే వీరు సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడకుండా ఉంటారట. అందుకే వీరు తమ సంతోషంతో ఇతరుల్ని అసూయపడేలా చేయాలనో.. ఇతరులకు ఏదో నిరూపించాలనో ఆశించరు.

English summary

Reasons why happy couples rarely post their lives on social media

Here we are talking about the reasons why happy couples rarely post their lives on social media. Read on.
Story first published: Wednesday, March 31, 2021, 15:28 [IST]