For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవ వధువు శోభనం గదిలోకి పాలనే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా...

|

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనే మధుర ఘట్టం చాలా ప్రత్యేకమైన సందర్భం. కొత్తగా పెళ్లి చేసుకున్న వధూవరులిద్దరూ తమ జీవితంలో శోభనం అనే కార్యాన్ని ఎప్పటికీ మరచిపోలేని విధంగా జరుపుకోవాలని ఆశిస్తారు.

అయితే మన భారతీయ సమాజంలో పెళ్లి అంటేనే బోలెడన్ని నియమాలు, కట్టుబాట్లు, ఎన్నో ఆచారాలు ఉంటాయి. కొన్ని ఆచారాలు మతపరమైనవి అయితే.. మరికొన్ని ఆచరణాత్మకంగా శాస్త్రీయంగా ఉండేవి. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ సడలింపులు కూడా ఉండటంతో మన దేశంలో పెళ్లిళ్లు జోరుగానే సాగుతున్నాయి.

వీటన్నింటిని పక్కనబెడితే.. పెళ్లి తర్వాత శోభనానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తారు. ఆ ఘట్టం విజయవంతంగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. శోభనం రోజున కొత్త పెళ్లికూతురు పాలగ్లాసు చేతబట్టుకుని వయ్యారంగా శోభనం గదిలోకి రావడం.. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. అంతేకాదు పడకగదిని అందమైన పూలతో, రకరకాల స్వీట్లు, పండ్లతో రాత్రంతా జాగారం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తారు. అంతేకాదు ఆ పాలలో కుంకుమపువ్వును కచ్చితంగా కలుపుతారు. ఇది కేవలం సంప్రదాయమే కాదు. దీని వల్ల మరెన్నో సానుకూల ఫలితాలు ఉంటాయట. అందుకు గల కారణాలేంటో మీరే చూడండి...

పెళ్లైనా ఆ కోరిక తీరలేదా.. ఇవి ట్రై చేయండి.. మీరు కీలుగుర్రంలా రెచ్చిపోవచ్చు...!

ఇద్దరి మధ్య బంధం..

ఇద్దరి మధ్య బంధం..

కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు పడకగదిలో చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ముఖ్యంగా వారిద్దరిలో ఎవరో ఒకరు చాలా సిగ్గు పడుతూ ఉంటారు. వారిద్దరి మధ్య దూరాన్ని తగ్గించి.. ఇద్దరి మధ్య బిడియాన్ని తగ్గించడంలో పాలు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి.

పాలను పంచుకోవడం వల్ల..

పాలను పంచుకోవడం వల్ల..

కొత్త జంటలిద్దరూ పాలను చెరి సగం పంచుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. పాలు తాగినప్పుడు ఇద్దరి బాడీలో హ్యాపీ హార్మోన్స్ వల్ల మనసును రిలాక్స్ గా ఉంచుతాయి. అంతేకాదు ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా పెరిగేలా దోహదపడుతుంది.

పాలతో ఎనర్జీ..

పాలతో ఎనర్జీ..

కొత్తగా పెళ్లైన పెళ్లికూతురు పడకగదిలో తీసుకెళ్లే పాలలో ఎంతో ఎనర్జీ ఉంటుంది. పాలలో ఉండే ఎమినో యాసిడ్ మగవారిలో లైంగిక శక్తిని పెంచుతుంది. పాలలో ఉండే ప్రోటీన్లు కూడా కపుల్స్ ఇద్దరి హార్మోన్లను మెరుగుపరుస్తాయి.

ఆ విషయంలో మోసం జరిగితే ఏ రాశి వారు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా...

వీర్యకణాలు పెరుగుదల..

వీర్యకణాలు పెరుగుదల..

శోభనానికి ముందు మగవారు పాలను తాగడం వల్ల వారిలో వీర్యకణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అంతేకాదు వారు రాత్రంతా చురుగ్గా ఆ కార్యంలో పాల్గొనేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలలో ఉండే విటమిన్-డి అలసట, ఒత్తిడి దూరం చేస్తుంది.

ప్రత్యేకంగా పాల తయారీ..

ప్రత్యేకంగా పాల తయారీ..

కొత్త పెళ్లికూతురు పడకగదిలోకి తీసుకెళ్లే పాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందులో బాదం పప్పు, మిరియాల పొడి, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ పాలు తాగడం వల్ల లిబిడో స్థాయిలు పెరిగి శరీరానికి ప్రోటీన్లు అందుతాయట.

ఉద్రేకం పెరుగుతుంది..

ఉద్రేకం పెరుగుతుంది..

పడకగదిలో కొత్త జంటల బాడీలో హీట్ పెరిగి ఇద్దరిలోనూ ఉద్రేకం పెరుగుతుంది. ఆ వేడిని తగ్గించేందుకు కూడా పాలు సహాయపడతాయి. కామ సూత్రం ప్రకారం కలయికలో పాల్గొనే వారికి శక్తి, సామర్థ్యం పెంచేందుకు అప్పట్లో పాలు తాగేవారు.

ఆషాడ మాసంలో కొత్త జంటల కలయిక ఎందుకు ఉండదో తెలుసా...

ప్రేమ పెరుగుతుందని..

ప్రేమ పెరుగుతుందని..

కామ సూత్రం ప్రకారం.. కొత్త పెళ్లికూతురు తన సుకుమారమైన చేతులతో పాల గ్లాసు పట్టుకుని కొత్త పెళ్లికుమారుడి కళ్లలో చూస్తూ పాలను తాగిస్తే వారిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఒకప్పుడు శోభనం రోజున వధూవరులు సోపు, పసుపు, తేనే, పంచదార, మిరియాలు కలిపిన పాలను ఎక్కువగా తాగేవారట. అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

కలయికలో ఉత్సాహంగా..

కలయికలో ఉత్సాహంగా..

పడకగదిలోకి కొత్త పెళ్లికూతురు తీసుకెళ్లే పాలలో కలిపే మిరియాల పొడి వల్ల రక్తనాళాలను ఉత్తేజపరుస్తాయి. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరిగి రొమాన్స్ లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. అంతేకాదు కేవలం ఫస్ట్ నైట్ రోజు మాత్రమే కాదు.. పాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే.. అంత ఎనర్జీతో ఉంటారు. మీకు వయాగ్రాతో కూడా అస్సలు అవసరముండదట.

English summary

Reasons Why Indian Brides Enter Bedroom With a Glass of Milk

Here are the reasons why indian brides enter bedroom with a glass of milk. Take a look
Story first published: Tuesday, June 29, 2021, 13:47 [IST]