For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమ పెళ్లిలో అవి కలిస్తేనే... కాపురం కలహాలు లేకుండా సాగుతుందా?

ప్రేమ పెళ్లిళ్లకు జాతకాలు అవసరమా లేదా అనే విషయాలను తెలుసుకోండి.

|

ఒకప్పుడు ఒక అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి చేయాలంటే వారి జన్మ నక్షత్రం, కుండలి, రాశి, గ్రహం.. అనుగ్రహంతో పాటు జాతకం మొత్తాన్ని చూసేవారు. ఇద్దరి జాతకాలను పొంతన కుదిరితేనే పెళ్లి ఫిక్స్ చేసేవారు. వాటి మధ్య పొంతన కుదరకపోతే ఏకంగా పెళ్లిళ్లనే క్యాన్సిల్ చేసేవారు. అయితే క్రమంగా ఇలాంటి పరిస్థితులలో మార్పు వచ్చేసింది. చాలా మంది జాతకాలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుత సమాజంలో ప్రేమ వివాహాలు చాలా కామన్ అయిపోతున్నాయి. కానీ ఇప్పటికీ చాలా చోట్ల ప్రేమ వివాహాలకు ఎదురుదెబ్బే తగులుతోంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో ముందుగా కులాల పట్టింపు ఎక్కువగా ఉంటోంది.

Reasons why love marriages dont need horoscope

అయితే ప్రస్తుతం కాలానికి అనుగుణంగా పరిస్థితులు మారుతున్న తరుణంలో పెద్దలు కూడా ప్రేమ వివాహాలకే ఓకే చెప్పేస్తున్నారు. కానీ జాతకాల విషయంలో మాత్రం వారు పట్టు విడవటం లేదు.

Reasons why love marriages dont need horoscope

ప్రపంచంలో ఎక్కడా పెళ్లికి సంబంధించి ఎక్కడా కూడా జాతకాలను అంతగా పట్టించుకోవడం లేదు. మరి మన దేశంలోనే పెళ్లిళ్లకు జాతకాలను ఎందుకు చూస్తన్నారు. ఏయే జాతకాలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. ఎవరెవరికి ప్రేమ వివాహం వద్దని శాస్త్రం చెబుతోంది? పెళ్లి, గ్రహాలు, రాశులు ఏమంటున్నాయో? జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

జ్యోతిష్యమే సరైన మార్గం..!

జ్యోతిష్యమే సరైన మార్గం..!

ఈ విశ్వంలో ఎవ్వరికైనా మంచి జీవితం కావాలంటే జ్యోతిష్యమే మంచి మార్గమని చెబుతారు పండితులు. ఇక అందమైన జీవితం కావాలంటే జాతకాలు కచ్చితంగా చూసుకోవాలని కూడా చెబుతున్నారు. వివాహానికి ముందు అమ్మాయి, అబ్బాయి జీవితాలలో పొంతన కచ్చితంగా కలవాల్సిందేనన్నారు.

జాతకాలు కలిస్తేనే..

జాతకాలు కలిస్తేనే..

ఎవ్వరికైనా జాతకాలు కలిస్తేనే వారు జీవితంలో కలిసిమెలసి ఉంటారని కరాఖండిగా చెబుతున్నారు. భూమి మీద ఉన్న మనషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం కచ్చితంగా ఉంటుందని, శాస్త్రాలు, సైన్స్ కూడా చెబుతుందంటున్నారు.

ఇతర దేశాల్లో..

ఇతర దేశాల్లో..

ఇతర దేశాల్లో జాతకాలు చూడకుండా వివాహాలు జరుగుతున్నప్పటికీ, చిన్న వయసులోనే విడాకులు, కొట్లాటలు, మరణాలకు కూడా జాతక దోషాలే కారణమని చెబుతున్నారు.

గతంలో 12 ఏళ్లకే..

గతంలో 12 ఏళ్లకే..

గతంలో 12 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసేవారు. ఈ ప్రక్రియ దోష రహితం కాబట్టి అప్పుడే నక్షత్రాలు చూసే వారు కాదట. మఖ మామగారికి, జ్యేష్ఠ బావగారికి, అశ్లేష అత్తగారికి గండం అనేవారు. అయితే ఇప్పుడు చాలా మంది 25 దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ నక్షత్రాల ప్రస్తావన అవసరం. దీనికి గ్రహాలకు సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు.

అన్నీ చూసుకుంటేనే..

అన్నీ చూసుకుంటేనే..

ముహుర్తాలు, జాతకాలు, గ్రహాలు, రాశులు చూసుకుని పెళ్లి చేసుకున్న వారే అన్యోన్యంగా ఉంటారని, అలా కాదనీ ప్రేమ వివాహాలు చేసుకున్న వారు అలా ఉండటం చాలా కష్టమని చెబుతున్నారు పండితులు.

జాతకాలను పట్టించుకోకపోతే..

జాతకాలను పట్టించుకోకపోతే..

అయితే ప్రేమించని వారు పెద్దల మాట వింటున్నారు కానీ.. ప్రేమించుకున్న వారు జాతకాలను అస్సలు పట్టించుకోవడం లేదు. మా ఇద్దరి మనసులు కలిశాయి. ‘నాకు నచ్చింది లేదా నాకు నచ్చాడు. నా పెళ్లి విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను' అనే మాటలతో పాటు మాకు జాతకాలతో పని లేదని కొందరు వాదిస్తూ వేరే కాపురం సైతం పెట్టేస్తున్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా అనర్థాలు జరుగుతాయంటున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు.

అన్నింట్లో సర్దుకుపోవాల్సిందే..

అన్నింట్లో సర్దుకుపోవాల్సిందే..

ప్రేమ వివాహానికొచ్చేసరికి ఇద్దరి కులాలు దాదాపు వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు మతాలు కూడా వేరుగా ఉంటాయి. ఇక వారి సంప్రదాయాలు, కట్టుబాట్లు గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆహారపు అలవాట్లు కూడా వేరుగా ఉంటాయి. ఆచారాలు, కార్యక్రమాలు కూడా సపరేటుగా ఉంటాయి. దీంతో ప్రేమ కారణంగా అన్నింటికీ సర్దుకుపోవాల్సి వస్తుంది.

తల్లిదండ్రుల బాధ..

తల్లిదండ్రుల బాధ..

అయితే ఎటొచ్చి తల్లిదండ్రుల బాధ ఏంటంటే.. చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగి.. ఇష్టమైన ఆహారాన్ని తింటూ.. ఒక్కసారిగా అలాంటి వాటికి దూరమై ఎలా నెట్టుకొస్తారనే. ఆవేశంలో తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారు సరే జాతకాలు కలవకపోతే ఆ పెళ్లి కొంతకాలానికే పెటాకులైపోతుందని బాధపడుతున్నారు.

English summary

Reasons why love marriages don't need horoscope

Here are these reasons why love marriages don't need horoscope. Take a look
Story first published:Wednesday, June 10, 2020, 11:55 [IST]
Desktop Bottom Promotion