For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడే పెళ్లి ఎందుకు చేసుకున్నామా అనిపించే సందర్భాలేవో తెలుసా...

మీకు పెళ్లి విషయంలో తొందరపడ్డామని అనిపించిందా... అయితే దానికి గల కారణాలను తెలుసుకోండి.

|

'పెళ్లంటే నూరేళ్ల మంట' అని కొందరు.. 'పెళ్లంటే నూరేళ్ల పంట' అని మరికొందరు అంటూ ఉంటారు. పెళ్లి చేసుకున్నాక జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుందని మన సినిమాల్లో సెటైరికల్ గా చెబుతూనే ఉంటారు.

Reasons why we seem to be bothered about marriage

అంతేకాదు ఇటీవల కొన్ని రియాల్టీ షోలలో కూడా పెళ్లి అంటే వేస్ట్ అని.. పెళ్లి విషయంలో తొందరపడొద్దని కొందరు ఆర్టిస్టులు కామెడీ కూడా చేసేస్తున్నారు. జనాలు కూడా అందుకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంకా కొంత మంది సోలో లైఫే సో బెటర్ అని కూడా చెప్పేస్తున్నారు. సింగిల్ గా పొందే ఆనందం పెళ్లి తర్వాత దక్కుతుందన్న గ్యారంటీ ఏమి లేదని చెబుతున్నారు. అనుభవంతో చెబుతున్నాం.. మీరు ఈ బురదగుంటలో పడకండి సలహాలూ ఇస్తుంటారు.

Reasons why we seem to be bothered about marriage

అయినా ఇలాంటి మాటలను ఏమి పట్టించుకోకుండా చాలా మంది వివాహ బంధంలో తమకు హ్యాపీ ఉంటుందని.. తమ జీవిత భాగస్వామితో ఎంజాయ్ చేయాలని ఏవేవో ఊహించుకుంటారు. అయితే చివరికి అనుభవజ్ణులు చెప్పిన మాదిరిగానే జీవితంలో అనవసరంగా తొందరగా పెళ్లి చేసుకున్నామని తెగ బాధపడిపోతుంటారు.

Reasons why we seem to be bothered about marriage

వైవాహిక జీవితంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా.. భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే మనస్పర్దలు వచ్చినప్పుడు ఇలా ఫీలవుతుంటారు చాలా మంది. అదే సమయంలో ఇతరులపై ఆసక్తి కలిగితే.. అయ్యో.. పెళ్లి విషయంలో అనవసరంగా తొందరపడ్డామా అని ఫీలవుతుంటారు. ఇంతకీ అలాంటి సందర్భాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

దాన్ని రిజెక్ట్ చేస్తే...

దాన్ని రిజెక్ట్ చేస్తే...

పెళ్లి చేసుకున్నాక చాలా మంది హనీమూన్ కు ఎక్కడికైనా మంచి టూరిస్ట్ స్పాట్ లకు వెళ్దామని ఏవేవో కలలు కంటూ ఉంటారు. అంతేకాదు దేశ, విదేశాల్లో ఎంచక్కా జంట పక్షుల్లా మారి విహరించాలనుకుంటారు. కానీ అందుకు భాగస్వామి ఒప్పుకోకపోతే.. అయ్యో అనవసరంగా పెళ్లి విషయంలో తొందరపడ్డామా అనిపిస్తుంది.

ఇతరుల ప్రేమ..

ఇతరుల ప్రేమ..

మీ ఫ్రెండ్ గానీ.. మీ బాస్ గానీ.. లేదా మీ కొలిగ్ ఎవరైనా అందమైన అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు.. కూడా మనలో చాలా మందికి ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అది కూడా వారితో రిలేషన్ సన్నిహితంగా మారితే.. మాత్రం అబ్బా.. మ్యారేజ్ విషయంలో అనవసరంగా తొందరపడ్డామనిపిస్తుంది.

వెరైటీ డిజైర్స్..

వెరైటీ డిజైర్స్..

కొందరికి కోరికలు అనేవి కొంచెం కొత్తగానూ.. లేదా విభిన్నంగానూ ఉంటాయి. ముఖ్యంగా అడవులను ఇష్టపడేవారు.. సాహసయాత్రలు చేయాలనుకునేవారు.. తమ భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్దామనుకున్నప్పుడు ఇంట్లోని పెద్దలు వద్దన్నప్పుడు.. అత్తమామల కోసం అన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో కూడా పెళ్లి విషయంలో తొందరపడ్డామా అనిపిస్తుంది.

ఇంటికెళ్లేందుకు ఇష్టం లేకపోతే..

ఇంటికెళ్లేందుకు ఇష్టం లేకపోతే..

మీ చుట్టూ అందరూ సంతోషంగా ఉన్నప్పుడు.. వారిలోనూ చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఆనందంగా.. ఆసక్తికరంగా ఉన్నప్పుడు మనకు ఇంటికి వెళ్లాలంటేనే కొంత చిరాకు పుడుతుంది. అసలు ఇల్లంటే ఇష్టం తగ్గిపోతుంది. అలాంటి టైములో కూడా పెళ్లి ఎందుకని త్వరగా చేసుకున్నామనిపిస్తుంది.

ఏమి చేయలేకపోతే..

ఏమి చేయలేకపోతే..

పెళ్లి తర్వాత మీ లైఫ్ మొత్తం కేవలం ఇల్లు, ఆఫీసు, పనిగా మారిపోయినప్పుడు.. అందులోనూ మీకు మీరుగా డెసిషన్స్ తీసుకోలేకపోతే.. ఎలాంటి బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నపుడు.. ఏమి చేయలేకపోతున్నామని అనిపించినప్పుడు.. ఇదంతా మీ పెళ్లి త్వరగా చేసుకోవడం వల్లే జరిగిందని.. మీ వైవాహిక జీవితంపై కూడా కొంత విరక్తి అనేది పుడుతుంది.

నైట్ పార్టీలు మిస్సయితే..

నైట్ పార్టీలు మిస్సయితే..

పెళ్లికి ముందు మనలో చాలా మంది నైట్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. రాత్రంతా బాగా ఎంజాయ్ చేసి ఎప్పుడో ఇంటికొచ్చే వారు దాన్ని ఒక్కసారిగా మిస్సయితే.. అదొక్కటే కాకుండా.. ప్రతి పది నిమిషాలకొకసారి ఫోన్ చేసి.. విసిగించే పార్ట్ నర్ దొరికినప్పుడు కూడా ఎందుకని ఇంత త్వరగా పెళ్లి చేసుకున్నామని అనిపిస్తుంది.

ఫ్రీడమ్ లేనప్పుడు..

ఫ్రీడమ్ లేనప్పుడు..

మీ జీవితాన్ని మీరు స్వేచ్ఛగా జీవించలేనప్పుడు.. మీ కుటుంబ సభ్యులు, మీ బాధ్యతలు, మీ పిల్లలు, అత్తమామల గురించి గుర్తు చేసినప్పుడు.. ఇంత త్వరగా పెళ్లి ఎందుకు చేసుకున్నామా అనే ఫీలింగులొస్తుంటాయి...

English summary

Reasons why we seem to be bothered about marriage

Here are these Reasons why we seem to be bothered about marriage. Take a look
Desktop Bottom Promotion