For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!

వివాహం అనేది ఒక అందమైన, సంతృప్తికరమైన అనుభవం. అయితే వివాహ బంధాలు అందరికీ ఒకేలా ఉండవు. కొన్ని జంటలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటాయి. అందుకే పెళ్లి చేసుకునే ముందు ఈ విషయాలు పరిశీలించండి. వాటి ద్వారా కాబోయే వారితో బంధం ఎలాగుంటు

|

పెళ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అంటే వారి కుటుంబ నేపథ్యం, వారి గుణగణాలు, వారి వ్యక్తిత్వం, వ్యవహారశైలి ఇలాంటివి ఎన్నో చూడాలని దానర్థం. పెళ్లి అంటే మూడు ముళ్ల బంధంతో ఒక్కటై జీవితాంతం కలిసి మెలిసి ఇద్దరూ కలిసి ఒక్కరిగా జీవించడం. వివాహం అనేది ఒక అందమైన, సంతృప్తికరమైన అనుభవం. అయితే వివాహ బంధాలు అందరికీ ఒకేలా ఉండవు. కొన్ని జంటలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటాయి. అందుకే పెళ్లి చేసుకునే ముందు ఈ విషయాలు పరిశీలించండి. వాటి ద్వారా కాబోయే వారితో బంధం ఎలాగుంటుందో తెలుస్తుంది.

d

అనుకూలంగా ఉండటం కీలకం:

మీరు, మీ భాగస్వామి నిజంగా అనుకూలంగా ఉన్నారా లేదా అనేది ముందుగు పరిగణించాలి. మీరు ఒకే విధమైన విలువలు, లక్ష్యాలు, ఆకాంక్షలను పంచుకోవడం, ఒకరితో ఒకరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీమధ్య తరచూ గొడవలు, వాగ్వాదాలు జరుగుతుంటే మీరు ఒకరికి ఒకరు అనుకూలంగా లేరని సంకేతం.

మానసికంగా స్థిరత్వం:

మానసికంగా స్థిరత్వం:

మీ భాగస్వామి మానసికంగా స్థిరంగా ఉన్నారా, వివాహానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది పరిగణించవలసిన కీలకాంశం. మీ భాగస్వామి గతంలో కొన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటే వాటి నుండి ఇంకా బయటపడలేకపోతే వారు వివాహానికి సిద్ధంగా లేరని అర్థం చేసుకోవాలి. అలాంటి వారితో వివాహం చేసుకోకపోవడమే మంచిది.

కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?

ఆర్థిక బాధ్యత:

ఆర్థిక బాధ్యత:

భాగస్వామి ఆర్థికంగా స్థిరంగా, బాధ్యతగా ఉన్నారో లేదో తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం. వివాహం అనేది ఆర్థిక భారం కావొచ్చు. భాగస్వామి ఇద్దరూ మానసికంగా, ఆర్థికంగా ఒకరికొకరు మద్దతు ఇచ్చే మార్గాలను కలిగి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..

రాజీ పడటం:

రాజీ పడటం:

సంబంధంలో ఉండటం అంటే చాలా విషయాలు నేర్చుకోవాలి. అందులో మొదటిది, అతి కీలకమైనది రాజీ పడటం. ఒకరికి నచ్చిన విషయాలు మరొకరికి నచ్చకపోవచ్చు. అలాంటి సమయంలో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ కాకపోతే సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన వివాహానికి భాగస్వాములు ఇద్దరూ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇద్దరిలో ఒకరు ఎప్పుడూ అడ్జస్ట్ కావడానికి సిద్ధంగా లేకపోతే అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది.

మీ భర్త మీతో కంటే ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ టైం గడుపుతున్నారా?మీ భర్త మీతో కంటే ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ టైం గడుపుతున్నారా?

సెల్ఫ్ అవేర్‌నెస్‌:

సెల్ఫ్ అవేర్‌నెస్‌:

స్వీయ అవగాహన కలిగి ఉండాలి. మీ నిర్ణయంపై మీకు నమ్మకం ఉండాలి. ప్రేమలో ఉండటం మాత్రమే సరిపోదు. వివాహంతో వచ్చే నిబద్ధత, బాధ్యత కోసం సిద్ధంగా ఉన్నారని కూడా నిర్ధారించుకోవాలి.

వివాహం చేసుకునే ముందు అనుకూలత, భావోద్వేగ స్థిరత్వం, ఆర్థిక బాధ్యత, అడ్జస్ట్ కావడం, స్వీయ అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. వివాహం ఒక అందమైన మరియు సంతృప్తికరమైన అనుభవం అయినప్పటికీ ఇది అందరికీ సరైనది కాదు. మీ కోసం భవిష్యత్తు భాగస్వామి కోసం మీరు సరైన నిర్ణయం తీసుకుంటున్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

అందుకే పెళ్లి చేసుకోబోయే ముందు కాబోయే వారి గుణగణాలు ఏమిటో తెలుసుకోవాలి. వ్యక్తిత్వం, బంధంలో ఇమడగలరో లేదో అంచనా వేయాలి. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అలాంటి వారితో జీవితం పంచుకోవడానికి సిద్ధపడాలి. లేకపోతే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

కలలో జంతువులు కనిపిస్తున్నాయా? దానర్థం ఏంటో తెలుసా?కలలో జంతువులు కనిపిస్తున్నాయా? దానర్థం ఏంటో తెలుసా?

English summary

Red flags to consider before getting marry in Telugu

read this to know Red flags to consider before getting marry in Telugu
Story first published:Friday, January 27, 2023, 13:02 [IST]
Desktop Bottom Promotion