For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో పెళ్లిలో కూడా అదే తప్పు జరుగుతుందా? తనతో డేట్ లో ఉండటం తప్పేనా?

భారతదేశంలో రెండో పెళ్లికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

|

మన దేశంలో వివాహ వ్యవస్థలో ప్రస్తుతం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగుల బంధం కేవలం ఒక్కరితోనే పంచుకునేవారు.

Second Marriage Problems in India

కానీ కాలంలో వచ్చిన మార్పుల కారణంగా.. పరిస్థితుల్లో కూడా చాలా వేగంగా మార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే చాలా తొలి భాగస్వామితో రిలేషన్ ఫెయిల్ అయితే..

Second Marriage Problems in India

రెండో పార్ట్ నర్ ను వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం భారత సమాజం ఇలా రెండో వివాహాన్ని కూడా అంగీకరిస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

'నా గర్ల్ ఫ్రెండ్ అప్పటి నుండి అంతా ఫోన్లేనే చేద్దామంటోంది... నాకేమి చేయాలో అర్థం కావట్లేదు''నా గర్ల్ ఫ్రెండ్ అప్పటి నుండి అంతా ఫోన్లేనే చేద్దామంటోంది... నాకేమి చేయాలో అర్థం కావట్లేదు'

Second Marriage Problems in India

'హాయ్! నా పేరు గీత (పేరు మార్చాం). నా వయసు 35 ఏళ్లు. నాకు పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేను మా ఆయనతో చాలా సందర్భాల్లో గొడవ పడుతూ ఉండేదానిని. ఎందుకంటే తను నిత్యం మందు తాగొచ్చి చాలా ఇబ్బంది పెట్టేవాడు. మేమిద్దరం మా పిల్లల ఎదుటే బాగా కొట్టుకునేవాళ్లం. తను నాపై భౌతిక దాడి కూడా చేసేవాడు.

ఎంతో పోరాటం..

ఎంతో పోరాటం..

ఆ సమయంలో నాతో పాటు నా పిల్లలు కూడా చాలా భయపడేవారు. దీంతో నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు విడాకులు తీసుకుంటున్నప్పుడు కూడా ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. ఇప్పుడు నా లైఫ్ లో ఒక మలుపు తిరిగే సంఘటన ఎదురైంది.

నా జూనియర్ తో..

నా జూనియర్ తో..

పిల్లలతో కలిసి జీవిస్తున్న నేను నా ఆఫీసులో పని చేసే జూనియర్ తో డేట్ చేయడం ప్రారంభించాను. తను నా కంటే సుమారు ఆరేళ్లు చిన్నోడు.

మగువల నుండి మగవారు ఎక్కువగా ‘అవే'ఆశిస్తున్నారంట...!మగువల నుండి మగవారు ఎక్కువగా ‘అవే'ఆశిస్తున్నారంట...!

పెళ్లి ప్రపోజల్..

పెళ్లి ప్రపోజల్..

ఇలా డేట్ చేస్తున్న తను, అకస్మాత్తుగా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుని, నాకు కొత్త జీవితాన్ని ఇస్తానని చెబుతున్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. తను వాళ్ల తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు.

నెగిటివ్ గా..

నెగిటివ్ గా..

అయితే ఈ సంఘటన గురించి మా ఇంట్లో చెబితే.. మా పేరేంట్స్ నాపై కోప్పడ్డారు. నువ్వు మీ కంపెనీలో చాలా సీనియర్ ప్లేసులో ఉన్నావు కాబట్టి, తను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడని మా పేరెంట్స్ అంటున్నారు.

నో చెప్పేశారు..

నో చెప్పేశారు..

అందుకే వారు నా రెండో పెళ్లికి ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పేశారు. అంతేకాదు, నేను మొదటి పెళ్లిలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నానని చెబుతున్నారు. ఎందుకంటే నా ఫస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్.

టీనేజీ పిల్లలు..

టీనేజీ పిల్లలు..

ఇక మా పిల్లల విషయానికొస్తే.. వారు ఇప్పుడు టీనేజీలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వారు నాతో మాట్లాడటం కూడా మానేశారు. నేను తనని రెండో పెళ్లి చేసుకుంటే, ఇల్లు వదిలి పోతామని బెదిరిస్తున్నారు.

ఎలా చెప్పాలో..

ఎలా చెప్పాలో..

మా పిల్లలు నన్ను సూటిగా ఒక ప్రశ్న కూడా వేశారు. తను కూడా నాన్నలాగానే ఉంటే ఏం చేయాలంటున్నారు. దీంతో నా పేరేంట్స్ ను, నా పిల్లల్ని ఎలా కన్విన్స్ చేయాలో తెలియట్లేదు. నాకేమో తనంటే ప్రేమ పెరిగిపోయింది. తనతో కలిసి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి' అని ఓ సోదరి నిపుణులను సంప్రదించింది.

ఫ్యామిలీని కన్విన్స్ చేయడంలో..

ఫ్యామిలీని కన్విన్స్ చేయడంలో..

ఇందుకు నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెబుతున్న విషయాలను బట్టి చూస్తుంటే, మీ కుటుంబానికి మీ సుఖ సంతోషాలే ముఖ్యమని తెలుస్తోంది. కాబట్టి వారు గురించి కూడా మీరు ఆలోచించాలి. ఇలాంటి సమయంలో మీ ఫ్యామిలీని కన్విన్స్ చేయడానికి మీ జూనియర్(పార్ట్నర్) సహాయం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నట్టు.. వారు కూడా అర్థం చేసుకోవాలి కదా.

ఒక్కోదాన్ని క్లియర్ చేయండి..

ఒక్కోదాన్ని క్లియర్ చేయండి..

మీతో ఉన్న సంబంధం విషయం గురించి.. అతనికి మీ పట్ల ఉన్న కమిట్మెంట్ గురించి కూడా మీ తల్లిదండ్రులు కన్విన్స్ అవ్వాలి. కాబట్టి మీ ఇద్దరితో ఒకేసారి వారు మాట్లాడటం వల్ల కొంత సానుకూలత రావచ్చు. వారికి ఎలాంటి సందేహాలు ఉన్నాయో.. వాటన్నింటిని ఒక్కోదాన్ని క్లియర్ చేసేయొచ్చు.

English summary

Second Marriage Problems in India

Check out the second marriage problems in India. Read on
Story first published:Saturday, January 2, 2021, 17:22 [IST]
Desktop Bottom Promotion