Just In
- 11 hrs ago
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- 12 hrs ago
పాదాలు తరచుగా మొద్దుబారిపోతాయా? అయితే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ...
- 14 hrs ago
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలున్నాయి...
- 14 hrs ago
Vastu Shastra Tips : రోజూ సాయంకాలం వేళ ఈ పనులు చేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్టే...!
Don't Miss
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మన దేశంలో వివాహేతర సంబంధాలపై ఆసక్తి పెంచుకుంటున్నది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!
భారతదేశంలో మహిళలు వెస్ట్రన్ కల్చర్ ను బాగా ఇష్టపడుతున్నారు. మన సంప్రదాయాలకు, కట్టుబాట్లకు కాలం చెల్లిందని పరోక్షంగా చెప్పేస్తున్నారు. వీరు ట్రెండింగ్, లేటేస్ట్, ఫ్యాషన్ వంటి పోకడలకు వెళ్తూ చాలా అప్ డేట్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ స్మార్ట్ యుగంలో అత్యంత వేగంగా స్మార్ట్ గా మారుతున్నామని భావిస్తున్నారు.
అది ఎంతలా అంటే కట్టుకున్న భర్తను కాదని వివాహేతర సంబంధాల పట్ల తెగ ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల గురించి తరచూ ఏదో ఒక వార్త మనం వింటూనే ఉన్నాం. అయితే వివాహేతర సంబంధాల కోసం ఒక ప్రత్యేకమైన యాప్ కూడా ఉందంట. ఆ యాప్ లో పెళ్లి చేసుకున్న అమ్మాయిలే ఎక్కువగా మెంబర్ షిప్ తీసుకుంటున్నారట. ఇంతకీ ఆ యాప్ పేరేమిటి? ఎందుకు అమ్మాయిలు ఇలాంటి సంబంధాలపై ఆసక్తి చూపుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

అమ్మాయిలే అధిక్యం...
అసంతృప్తి, అజ్ఞానం, పెళ్లి సంబంధంలో నిర్లక్ష్యం మరియు ఇంటి పనులలో భర్తలు పాల్గొనలేకపోవడం వల్ల ఇలాంటి వాటి నుండి తప్పించుకునేందుకు చాలా మంది భార్యలు ముఖ్యంగా బెంగళూరు, కోల్ కత్తా, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో వివాహేతర సంబంధాలపై అమ్మాయిలు ఆసక్తి పెంచుకున్నారట.

ప్రతి పది మందిలో ఏడుగురు..
మన దేశంలో ప్రతి మంది మహిళల్లో ఏడుగురు మహిళలు తమ భర్తలను మోసం చేస్తున్నారంట. ఎందుకంటే తమ భర్తలు తమను సరిగా చూసుకోవడం లేదని.. తమను రాత్రి పూట సుఖపెట్టడం లేదని.. ఇంకా ఇతర కారణాలను చెబుతున్నారట.

‘గ్లీడెన్‘ యాప్..
‘గ్లీడెన్‘ అనే ఆండ్రాయిడ్ యాప్ నిర్వహించిన సర్వేలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యాప్ ప్రత్యేకంగా వివాహేతర సంబంధాలు కోరుకునే వారి కోసం రూపొందించింది. ఈ యాప్ లో తమకు నచ్చిన అబ్బాయితో ఇష్టం వచ్చినంత సేపు మహిళలు మాట్లాడుకోవచ్చట. వీడియో ఛాటింగ్ కూడా చేయొచ్చట.

లక్షల మంది వినియోగం..
ఈ యాప్ లో రిజిస్టర్ అయిన లక్షలాది మహిళలు వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకుంటారో ఆ కంపెనీ నిర్వహించిన సర్వేలో నిర్మోహమాటంగా తెలిపారట. వీరిలో మెట్రో సిటీల్లో నివసించే వారే ఎక్కువగా ఉండటం గమనార్హం.

కొత్త ఆనందాల కోసం..
తమ భర్తలు సంసార జీవితం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్లే తాము ఈ చర్యలకు పాల్పడుతున్నామని, ఇంటి పనులలో కూడా ఎలాంటి సహాయం చేయడం లేదని చెప్పారట. ఈ యాప్ వాడుతున్న వారిలో పది మందిలో నలుగురు మహిళలు తెలియని వ్యక్తులతో ఆ విషయాల గురించి చాట్ చేస్తూ కొత్త ఆనందాలను వెతుక్కుంటున్నట్లు అంగీకరించారట.

మధ్య వయస్కులే అధికం...
ఈ యాప్ వాడుతున్న యూజర్లలో 20 శాతం మంది పురుషులు, 13 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరంతా తమ జీవిత భాగస్వామిని మోసం చేసి, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నామని ఒప్పుకున్నారు. ఈ యాప్ ను వాడుతున్న వారిలో ఎక్కువ మంది 34 నుండి 49 ఏళ్ల వారే ఉండటం గమనార్హం.

మరోసారి సరసాలాడటంలో..
‘గ్లీడెన్ లోని ప్రతి పది మంది మహిళల్లో నలుగురు మహిళలు సరసాలాడటంతో వారి జీవిత భాగస్వాములతో ఎక్కువ సాన్నిహిత్యానికి దారి తీసిందని, అంటే అవిశ్వాసం పోయిందని భావించినా, వివాహా సంబంధం తిరిగి తెప్పించడంలో ఇది సహాయపడుతుంది‘ అని గ్లీడెన్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ సోలీన్ పైలెట్ చెప్పారు.

మార్పు లేనిదిగా మారిందని..
భారతీయ మహిళల్లో దాదాపు 77 శాతం మంది తమ వివాహంలో ఎలాంటి మార్పు లేదని, వివాహేతర సంబంధం వల్ల తమ జీవితాలకు కొత్త ఉత్సాహం వచ్చినట్టు అవుతుందని, తమ భర్తలను మోసం చేయడానికి ఇది ఒక కారణమని చాలా మంది చెప్పడం గమనార్హం.