For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కావాల్సినంత ఏకాంతం దొరికినా ఎంజాయ్ చేయలేకపోతున్న కపుల్స్... కారణం కరోనా భూతమేనా...!

వీటన్నింటి సంగతి పక్కనపెడితే కరోనా దెబ్బకు ఊడిపోయిన ఉద్యోగాలు.. ఆర్థిక సమస్యలతో చాలా మంది జంటలు సతమతమవుతూ, వారి శృంగారం విషయంలో కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారట.

|

కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది కపుల్స్ కు కావాల్సినంత ఏకాంతం దొరికింది. అయితే ఎంచక్కా ఎంజాయ్ చేయాల్సిన జంటల మధ్య మెల్లగా దూరం పెరుగుతోంది. దంపతుల కలయికతో బలపడాల్సిన బంధం కాస్తా లేనిపోని లైంగిక సమస్యలకు కారణమైంది. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్.

Sex Problems between husband and wife during lockdown

కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు.. ఇది వరకు పెళ్లయిన జంటలు తమ జీవితంలో ఎదిగేందుకు ఎన్నో కలలు, ప్లాన్లు, లక్ష్యాలు, కోరికలతో ఉత్సాహంగా ఉన్న సమయంలో కరోనా మహమ్మారి వారి ఆశలపై నీళ్లు చల్లేసింది.

Sex Problems between husband and wife during lockdown

కరోనా దెబ్బకు ఉరుకుల పరుగుల జీవితం కాస్త ఇంటికే పరిమితమవ్వడం.. కుటుంబంతో కలిసి జీవించే సమయం దొరికినా.. అది మరీ ఎక్కువైపోవడం.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో చాలా మంది జంటలు లైంగిక కోరికలను చంపేసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి కష్టకాలంలోనూ రొమాన్స్ ను ఆస్వాదించేందుకు ఏమి చేయాలో.. నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

మానసిక సమస్యలు..

మానసిక సమస్యలు..

కరోనా వైరస్ కారణంగా మన దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా లాక్ డౌన్ విధించారు. దీంతో అకస్మాత్తుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళితే, ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయం.. ఇంట్లో తిని కూర్చుంటే కొండైనా కరిగిపోతుందనే కారణాలతో మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది కాస్త దంపతుల అన్యోన్యత మధ్య బంధాన్ని బలపరచాల్సింది పోయి దూరం పెంచుతోంది.

ఒత్తిడి రెట్టింపు..

ఒత్తిడి రెట్టింపు..

అసలే లాక్ డౌన్... కొత్తగా లైంగిక సమస్య తలెత్తితే ఒత్తిడి మరింత రెట్టింపు అవుతుంది. దీని ఫలితంగా మానసిక కుంగుబాటు కూడా పెరుగుతోంది. ఈ సమయంలో వైద్యులను కలిసే వీలు కూడా లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది.

భార్యల ఆశ..

భార్యల ఆశ..

లాక్ డౌన్ పొడిగింపు లైంగిక సమస్యలకు ఒక కారణమని కచ్చితంగా చెప్పొచ్చు. ఇంతకుముందు దంపతులకు కేవలం వారాంతాల్లో మాత్రమే సన్నిహితంగా గడిపే వీలు చిక్కేది. మిగిలిన రోజుల్లో పని అలసట కారణంగా శారీరకంగా దగ్గరయ్యే ఓపిక, తీరిక ఉండేవి కావు. కానీ ఆఫీసు పనులతో, వ్యాపార పనులతో బిజీగా గడిపే వారు లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టానే ఉండిపోవడంతో.. భర్తల దగ్గర నుండి రెట్టింపు సాన్నిహిత్యాన్ని, రెట్టింపు అన్యోన్యతనూ భార్యలు ఆశిస్తున్నారు.

శరీరం తట్టుకోలేదు..

శరీరం తట్టుకోలేదు..

సాధారణంగా పరిమిత సెక్స్ సామర్థ్యానికి అలవాటు పడి, ఆ మేరకే తోడ్పడే హార్మోన్లు, అకస్మాత్తుగా పరిమితికి మించిన అవసరం పడితే ఆ పరిస్థితిని శరీరం తట్టుకోలేదు. దీంతో లైంగిక సామర్థ్యం కూడా కొంత సన్నగిల్లుతుంది. నిజానికి అదే హార్మోన్ స్థాయి లాక్ డౌన్ కు ముందు సరిపోయి ఉండొచ్చు. అయితే లాక్ డౌన్ ఫలితంగా కొత్త లైంగిక సమస్యలు మగాళ్లను వేధించే అవకాశం ఉంది.

ఎక్కువ విశ్రాంతి దొరకడం..

ఎక్కువ విశ్రాంతి దొరకడం..

సాధారణంగా రతి క్రీడకు తోడ్పడే హార్మోన్లు సమంగా ఉండాలంటే శరీరం, మనసు చురుకుగా ఉండాలి. లాక్ డౌన్ కారణంగా కావాల్సినంత విశ్రాంతి దొరకడం, సరైన సమయానికి నిద్రపోకపోవడం వల్ల హార్మోన్ల స్థాయి తగ్గిపోతోంది. కొందరు మగాళ్లలో లైంగిక సామర్థ్యంతో నేరుగా సంబంధం ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గుతుంది.

హార్మోన్ స్థాయిల తారుమారు..

హార్మోన్ స్థాయిల తారుమారు..

అయితే మరి కొందరు పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయి సక్రమంగానే ఉన్నా.. పరిమితంగా ఉండాల్సిన ఈస్ట్రోజెన్, ప్రొలాక్టిన్ హార్మోన్లు పెరిగిపోతాయి. దీని ఫలితంగా టెస్టోస్టెరాన్ పని చేయకపోవచ్చు. లాక్ డౌన్ కారణంగా వీటికి ఆటంకం ఏర్పడిన మూలంగా హార్మోన్ల స్థాయిలు తారుమారై కొందరిలో లైంగిక సమస్యలు పెరిగిపోవచ్చు.

పిల్లలు లేని లోటు..

పిల్లలు లేని లోటు..

ఫెర్టిలిటీ సమస్యలతో చికిత్స చేయించుకుంటున్న దంపతుల మీద లాక్ డౌన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు ట్రీట్ మెంట్ చేయించుకుంటూ, పనులకు వెళ్లే దంపతులు.. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో పిల్లలు లేని లోటు స్పష్టంగా తెలిసివస్తోంది. ఇక పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వంటే నువ్వుంటూ గొడవలు పడుతున్న కేసులు బయటపడుతున్నాయి.

వైద్యులను కలిస్తే మంచిది..

వైద్యులను కలిస్తే మంచిది..

అయితే లాక్ డౌన్ కారణంగా తలెత్తిన ప్రతి లైంగిక సమస్య మానసికమైనది కాకపోవచ్చు. మీరు ఎలాంటి ఒత్తిళ్లూ, ఆందోళనలూ లేకపోయినా సామర్థ్యం తగ్గినట్టు అనిపిస్తే, ప్రత్యక్షంగా వైద్యులను కలవడం మంచిది. సామర్థ్యానికి సంబంధించిన ప్రతి సమస్యకూ మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు.

మానసిక సమస్యలు..

మానసిక సమస్యలు..

ఎవ్వరికైనా లైంగిక జీవితం సక్రమంగా, సజావుగా సాగాలంటే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. మీ మనసు హుషారుగా ఉండి, ఎటువంటి ఒత్తిళ్లూ, ఆందోళనలు లేకుండా ఉన్నప్పుడే ఆ ఘట్టం పట్ల చురుగ్గా ఉండగలం. అయితే చురుకుదనం తగ్గిపోయి, కుంగుబాటుకు లోనైతే ఆ ప్రభావం కచ్చితంగా లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా కోరికలు, పటుత్వం వంటి వాటిపై ఆసక్తి తగ్గిపోతుంది. ఉద్యోగ అభద్రత, ఆర్థిక పరిస్థితి దిగజారడం గురించి వంటి మానసిక సమస్యలకు కారణాలు.

ఒకరినొకరు అర్థం చేసుకుంటూ..

ఒకరినొకరు అర్థం చేసుకుంటూ..

లాక్ డౌన్ వంటి క్లిష్ట సమయాల్లో భార్యభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. భర్త మానసిక పరిస్థితిని గమనించి, అర్థం చేసుకుని, లోపించిన లైంగిక ఆసక్తికి తగ్గట్టుగా భార్యలు నడుచుకోవాలి. పరిస్థితులు త్వరగా మెరుగవుతాయని ధైర్యం చెబుతూ ముందుకు వెళ్లాలి. లాక్ డౌన్ కారణంగా పెరిగిన పని ఒత్తిడి, అలసట దూరం జరిగే భార్యల పరిస్థితిని భర్తలు అర్థం చేసుకుని నడుచుకోవాలి. వీలైతే వారికి ఇంటి పనుల్లో సహాయం చేయాలి. ఇలా ఒకరినొకరు మనసెరిగి మసలుకుంటే మీ లైంగిక జీవితం సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

English summary

Sex Problems between husband and wife during lockdown

Here are the sex Problems between husband and wife during lockdown. Take a look.
Story first published:Thursday, May 28, 2020, 12:30 [IST]
Desktop Bottom Promotion