For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లికి ముందు అప్సరసలా... కానీ పెళ్లి తర్వాతే.. తనపై ఫీలింగ్సే రావట్లేదు...! మొత్తం మేకప్ వల్లేనా...!

|

మన దేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరికీ లైఫ్ లో ఒకే ఒక్కసారి వచ్చే అద్భుతమైన అవకాశం. అలాంటిది పెళ్లికి ముందు తనకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నెన్నో కలలు కంటూ ఉంటారు.

పెళ్లి తర్వాత తన పార్ట్ నర్ తో కలిసి ఏవేవో చేయాలని ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అందుకే తమ పర్సనాలిటీకి తగ్గ జోడిని వెతుక్కుంటారు. అందులో భాగంగానే పెళ్లిచూపులు.. ఫొటో, బయోడేటా షేరింగులు చేసుకుంటారు.

అన్నీ కుదిరితేనే పెళ్లికి ఓకే అనుకుంటారు. అయితే ఓ యువకుడు పెళ్లికి ముందు మేకప్ వేసుకుని తన భార్య మోసం చేసిందని వాపోతున్నాడు.. ఆమెతో ఇప్పటివరకు శారీరకంగా కలవలేదని.. వాపోతున్నాడు.. ఇంతకీ ఆ కుర్రాడి బాధేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'నా భర్త అస్తమానం పాస్ వర్డ్ మారుస్తున్నాడు.. అలా చేస్తే నాకెందుకో...''నా భర్త అస్తమానం పాస్ వర్డ్ మారుస్తున్నాడు.. అలా చేస్తే నాకెందుకో...'

అప్సరసలా..

అప్సరసలా..

హాయ్ ‘నా పేరు రమేష్(పేరు మార్చాం). నాకు పెళ్లయ్యి ఆరు నెలలు కావస్తోంది. పెళ్లికి ముందు నాకు కాబోయే భార్య ఫొటోలను మా అమ్మ చూపించింది. ఆ ఫొటోలో తను అచ్చం అప్సరసలా అనిపించింది. ఈ భూమి మీద తన కంటే అందగత్తె మరొకరు లేరనేంత అద్భుతంగా కనిపించింది.

మేకప్ లేకుండా..

మేకప్ లేకుండా..

అయితే పెళ్లి చూపుల సమయంలో మాత్రం ఫొటోలో ఉన్నంత అందంగా కనిపించలేదు. అదేంటని అడిగితే.. ఆ ఫొటోలు ఎడిట్ చేశారని, తాను మేకప్ లేకుండా ఇలాగే ఉంటానని నిజాయితీగా చెప్పింది. కానీ అప్పుడు కూడా మేకప్ వేసుకునే రావడంతో.. నేను మళ్లీ బోల్తా పడ్డాను.

పెళ్లికి ఓకే..

పెళ్లికి ఓకే..

తన నిజాయతీని చూసి అందంగానే ఉందనే అపొహలో తనతో కలిసి ఏడడుగులు వేసి.. మూడు ముళ్లు వేసేందుకు అంగీకరించాను. అయితే పెళ్లి తర్వాత సీన్ మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. పెళ్లి చేసుకున్న నాటి నుండి ఇప్పటివరకు తన ఫేసు గుర్తుపట్టలేనంతలా మారిపోయింది.

‘నా ప్రియురాలితో నా మిత్రులు ఇలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది...!'‘నా ప్రియురాలితో నా మిత్రులు ఇలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది...!'

అందంగా లేదు..

అందంగా లేదు..

పెళ్లి తర్వాత ఆమె అసలు రంగు బయటపడింది. పెళ్లికి ముందు నాతో కలిసినప్పుడల్లా మేకప్ వేసుకునే కనిపించేది. పెళ్లి తర్వాత నాకు జ్ణానోదయం కలిగింది. పెళ్లికి ముందు తన ఫేసుపై కొంచెం మేకప్ వేసుకుని నన్ను కలిసిందని పూర్తిగా అర్థమైంది. అప్పటి నుండి తన మేకప్ విషయంలో నేను మోసపోయానని తెలిసిపోయింది.

ఫీలింగ్స్ రావడం లేదు..

ఫీలింగ్స్ రావడం లేదు..

ఒకవైపు నేను తన అందం విషయంలో మోసపోయాననే భావన నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇంకోవైపు ఆమెను చూసినప్పుడల్లా నాలో ఫీలింగ్స్ ఏ మాత్రం కలగడం లేదు. నా కోరికలు కూడా చచ్చిపోతున్నాయి.

కలయిక లేదు..

కలయిక లేదు..

అందుకే పెళ్లి జరిగి ఇన్ని రోజులైనా మేమిద్దరం శారీరకంగా కలుసుకోలేదు. పైగా తను చాలా విషయాల్లో నాకన్నా వెనుకబడి ఉంది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండదు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.. నాకొక మంచి సలహా ఇవ్వగలరు' అని ఓ యువకుడు తన గోడును వెళ్లబోసుకున్నాడు.

‘ఆ కార్యం'లో కుర్రాళ్లే ఎక్కువ ఎంజాయ్ చేస్తారట...! ఎందుకో తెలుసా...‘ఆ కార్యం'లో కుర్రాళ్లే ఎక్కువ ఎంజాయ్ చేస్తారట...! ఎందుకో తెలుసా...

అందం ఒక్కటే..

అందం ఒక్కటే..

దీనికి నిపుణులు ఏమి సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. అందం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. కేవలం మేకప్ తో మాత్రమే కొంత అందాన్ని పెంచుకోగలం. అయితే మనసును అలా చేయలేం. ప్రస్తుత జనరేషన్ వాళ్లు పెళ్లికి ముందు, పెళ్లి సమయంలో అంతా మేకప్ వేసుకునే ఫొటోలు తీసుకుంటారు.

మేకప్ తోనే బయటకు..

మేకప్ తోనే బయటకు..

ఎక్కడికైనా బయటికి వెళ్లే సమయంలో కూడా మేకప్ తోనే బయటకు వెళ్తారు. అలాగే మిమ్మల్ని కూడా పెళ్లికి ముందు మేకప్ వేసుకునే కళివారు. పైగా తను ఫొటోలో ఉన్నంత అందంగా ఉండనని ముందుగానే నిజాయితీగా చెప్పింది.. ఫొటోల్లో ఎడిట్ చేశారని చెప్పాక కూడా మీరు పెళ్లికి అంగీకరించారు.

ఇప్పుడు నచ్చలేదంటే..

ఇప్పుడు నచ్చలేదంటే..

పెళ్లి జరిగిన ఇన్ని రోజుల తర్వాత తను నచ్చలేదంటే పొరపాటు ఎవరిదో మీరే గ్రహించాలి. ఇక అందం విషయానికొస్తే.. అందంగా ఉండేవారినే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు కూడా అనుకుంటే.. అబ్బాయిలకు అస్సలు పెళ్లిళ్లు అనేవే జరగవు. అమ్మాయిలు అబ్బాయిల్లో ఎప్పటికీ అందాన్ని చూడరు.

భవిష్యత్తులో బాగా చూసుకుంటారా?

భవిష్యత్తులో బాగా చూసుకుంటారా?

మగవారు లైఫ్ లో సెటిలయ్యారా? భవిష్యత్తులో తనని బాగా చూసుకుంటారా లేదా అనే ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే, చాలా మంది అమ్మాయిలు పురుషుల అందం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా వివాహం చేసుకుంటారు.

అందంగా ఉన్నవారే..

అందంగా ఉన్నవారే..

ఈ మధ్య కాలంలో టివి ప్రకటనల్లో, సోషల్ మీడియాలో సైజ్ జిరో, వైట్ స్కిన్, చక్కని రూపం అంటూ ఏవేవో చూపిస్తున్నారు. అందంగా ఉన్నవారే మనషులనే ఫీలింగ్ కలిగిస్తున్నారు. తమ ప్రాడక్ట్స్ ను విక్రయించేందుకు అందాన్ని ఎరగా వాడుతున్నారు. దీంతో చాలా మంది అమ్మాయిలు తమ సహజసిద్ధమైన అందాలను వదిలి.. అలాంటి ప్రాడక్ట్స్ పై ఆధారపడుతున్నారు.

ప్రత్యేకతలు తెలుసుకోండి..

ప్రత్యేకతలు తెలుసుకోండి..

ప్రకటనల్లో చూపించినట్టే అమ్మాయిలు ఉండాలనే భావన మీ మనసులో ఉంది. కాబట్టి మీకు అలా అనిపిస్తుండొచ్చు. మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ముందుగా ప్రకటనల్లో వచ్చే ప్రచారాలను అస్సలు నమ్మకండి. ముందు మీ భార్య గురించి ప్రత్యేకతలు తెలుసుకోండి. ఆమె మనసులో ఏముందో తెలుసుకోండి. తనలో మీకు నచ్చే క్వాలిటీస్ బోలెడన్నీ ఉండొచ్చు.

మనసును చూడండి..

మనసును చూడండి..

కేవలం అందాన్నే కాకుండా.. తన మనసును చూడండి.. కేవలం తాత్కాలికంగా ఉండే సౌందర్యాన్ని చూసి తనని వదులుకోవద్దు. ఆమె తన కుటుంబాన్ని వదిలి మిమ్మల్ని నమ్మి వివాహం చేసుకుంది. మీరు ఓకే అన్నాకే పెళ్లికి అంగీకరించింది. అంటే తనకు మీ మీద మంచి ఫీలింగే ఉంది. కాబట్టి అందం పేరిట ఆమెను ఇబ్బంది పెట్టి మీ పచ్చని సంసారాన్ని పాడు చేసుకోవద్దు. కళ్లతో కాకుండా మనసుతో చూసి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

English summary

Should I Leave My Wife If I Feel That She Is Not Pretty Any More?

Here we are taking about the should i leave my wife if i feel that she is not pretty any more? Read on