For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహ జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తే.. విడిపోవడానికి సిద్ధమైనట్టే...!

ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీ భాగస్వామితో బంధానికి బ్రేకులు పడినట్టే. ఆ సంకేతాలేంటో మీరే చూడండి.

|

ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా బంధం బలపడాలంటే, వారిలో ఒకరికి ఒకరికి నమ్మకం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సాన్నిహిత్యం అనేవి కచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ప్రేమ బంధంలో లేదా వివాహ బంధంలో మనకు కనిపిస్తుంటాయి.

Signs Your Marriage Is Over For Men in Telugu

అయితే పెళ్లయిన ప్రతి ఒక్కరికీ కొత్తలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తమ బంధం బలంగా ఉండాలనుకున్న వారు కొన్ని విషయాల్లో సర్దుకుపోతారు.. మరి కొందరు మాట్లాడుకుని క్లియర్ చేసుకుంటారు. అయితే ఇంకా కొందరు మాత్రం చిన్న చిన్న విషయాలను సైతం భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. ఇలా చీటికి మాటికి పడి గొడవ పడి విడాకులు తీసుకుని విడిపోయేంత వైరాన్ని పెంచుకుంటారు.

Signs Your Marriage Is Over For Men in Telugu

కాబట్టి పెళ్లి చేసుకున్న వారందరికీ జీవితాలు హ్యాపీగా ఉండవు. అంతేకాదు ప్రతి చిన్న గొడవకు విడిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. అయితే ఎవరి మనసులో అయితే గాయం బలంగా అవుతుందో.. అలాంటి వారు తమ బంధం ఎంత బలంగా దాన్ని తెంచుకోవడానికి ఆలోచిస్తుంటారు.

Signs Your Marriage Is Over For Men in Telugu

అలాంటి వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ఇవి కనబడితే వివాహ బంధానికి వీడ్కోలు పలకడం ఖాయమైనట్టే అని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆ సంకేతాలేంటో మీరూ చూడండి...

సెక్స్ పట్ల భాగస్వామిలో ఉండే భయాన్ని ఇలా పోగొట్టేయండి..సెక్స్ పట్ల భాగస్వామిలో ఉండే భయాన్ని ఇలా పోగొట్టేయండి..

అర్థం చేసుకోకపోవడం..

అర్థం చేసుకోకపోవడం..

మనలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారు మొదట్లో చాలా సంతోషంగా ఉంటారు. ఆలుమగలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అయితే ఇలా వివాహం చేసుకున్న వారిలో కొందరు పురుషులు పెళ్లి కాని వారిలా ఉండటం వంటివి చేస్తుంటారట. అంతేకాదు ఎలాంటి బాధ్యతలను పట్టించుకోరు.. ఇక పార్ట్నర్ తో ఏ విషయాన్ని షేర్ చేసుకోరట. అంతేకాదు కనీసం వారి మాట కూడా వినడం వంటివి చేయరట. ఇలాంటి వారితో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా జీవించాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి భాగస్వాములతో బంధాన్ని లాంగ్ లైఫ్ కొనసాగించడం కంటే.. వారికి విడాకులు ఇచ్చి.. విడిపోయి బతకాలని అనిపిస్తుందట. అందుకే ఇలాంటి సంకేతాలు ఉండే వ్యక్తులతో వివాహ బంధాన్ని మధ్యలో తెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఏక పక్ష నిర్ణయాలు..

ఏక పక్ష నిర్ణయాలు..

పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. ఏమి చేసినా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. అయితే పెళ్లి తర్వాత మాత్రం చాలా శ్రద్ధగా ఉండాలి. ప్రతిదీ భాగస్వామితో షేర్ చేసుకోవాల్సి ఉంటుది. ముఖ్యంగా ఫ్యూచర్ గురించి అనేక ప్లాన్లు చేసుకోవాలి. చేస్తుంటారు కూడా. అయితే ఇలాంటి విషయాల్లో మీ భాగస్వామి మిమ్మల్ని ఏమాత్రం సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలా చేస్తే తను మీతో దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారని సంకేతమట. ఇక మీ కలలు, ఆశయాలు, అభిరుచులు, ఆలోచనలకు ఏ మాత్రం విలువ ఇవ్వని వారనిపిస్తే కూడా వివాహ బంధానికి మధ్యలోనే వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతారట.

కొంచెం క్లోస్ గా ఉన్నా..

కొంచెం క్లోస్ గా ఉన్నా..

సాధారణంగా తమ భాగస్వామి ఎవరితో అయినా కొద్దిగా క్లోజ్ గా ఉన్నారని భావిస్తే.. చాలు మనలో చాలా మందికి కోపం వస్తుంది. అయితే మీకు అలా ఏమి అనిపించడం లేదనిపిస్తే.. మీకు మీ భాగస్వామి పట్ల ఇప్పటిదాకా ఎలాంటి ఫీలింగ్స్ లేనట్టేనని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు వారు మీతో కాకుండా ఇంకొకరితో కలిసి హ్యాపీగా ఉన్నా కూడా మీరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటే.. మీరు ఇప్పటికే తనతో బంధానికి బ్రేకులు వేసేందుకు రెడీ అయ్యారని అర్థం.

ప్రేమలో పురుషులు చేసే అతి పెద్ద తప్పులు ఏంటో తెలుసా?ప్రేమలో పురుషులు చేసే అతి పెద్ద తప్పులు ఏంటో తెలుసా?

మనీ మ్యాటర్లో..

మనీ మ్యాటర్లో..

పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరికీ మనీ అవసరమవుతుంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేంత డబ్బుతో ఏదో ఒక సమయంలో అవసరం పడుతుంది. అంత ముఖ్యమైన మనీ మ్యాటర్ విషయాల్లో పార్ట్నర్ ను ఇన్వాల్వ్ చేయకపోతే, అది అనేక సమస్యలకు దారి తీస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భార్యభర్తల్లో చాలా మంది విడిపోయేందుకు ముఖ్యమైన కారణాల్లో మనీ ప్రాబ్లమ్ ఒకటి. మీతో మీ పార్ట్నర్ మనీ గురించి చెప్పకుండా.. ప్రతిసారీ ఏదైనా సాకులు చెబుతున్నారంటే, వారు అప్పటికే మీతో దాని గురించి మాట్లాడకూడదని డిసైడ్ అయినట్టే.

ఇంట్రస్ట్ చూపరు..

ఇంట్రస్ట్ చూపరు..

ఆలుమగల జీవితం అన్నాక అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ, అవి సరదాగా ఉంటే బాగుంటుంది. అయితే అవి పెరిగి పెద్దవైతేనే అనవసర ఇబ్బందులు. ఇక తమ భాగస్వామి పట్ల ఇష్టం ఉండేవారు ఎన్ని గొడవలు జరిగినా.. సర్దుకుపోవడం లేదా ఇంకేదైనా పరిష్కారం కోసమో ప్రత్యామ్నాయం గురించి చూస్తారు. అదే మీతో కలిసి బతకడమే ఇష్టం లేకపోతే, వారు వివాహ జీవితం గురించి పెద్దగా ఇంట్రస్ట్ చూపరు.

English summary

Signs Your Marriage Is Over For Men in Telugu

Here are these signs your marriage is over for men in Telugu. Have a look
Story first published:Friday, February 18, 2022, 19:54 [IST]
Desktop Bottom Promotion