For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సంకేతాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. తను ఇంకొకరితో...!

|

ఆలుమగలు అన్నాక ఏదో ఒక సందర్భంలో లేదా ఏదో ఒక విషయంలో అప్పుడప్పుడు అనుమానం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తమ రిలేషన్ షిప్ లో తమకు ఏదైనా అన్యాయం జరుగుతుందా? తమ భాగస్వామి ఎవ్వరికీ తెలియకుండా ఇంకొకరితో ఏవైనా సంబంధాలు పెట్టుకున్నాడా?

అనే అనుమానాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి నలుగురు జంటలలో ఒకరు తమ భాగస్వామిని మోసం చేస్తున్నారని ఓ సర్వేలో తేలిందట. అయితే.. అందరి విషయంలో ఇలానే జరగాలని రూల్ ఏమి లేదు.

ఈ నేపథ్యంలో మీ పార్ట్ నర్ కూడా ఇంకొకరితో రిలేషన్ లో ఉన్నారని ఏదైనా అనుమానం ఉందా? అలాంటప్పుడు మీ అనుమానాలను చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ సంకేతాలతో ఈజీగా గుర్తించొచ్చు. అవేంటో మీరే చూడండి...

మగువలు అలాంటి మగాళ్లతోనే ఎందుకని ఎక్కువగా గడపాలనుకుంటారో తెలుసా...

అలా చేస్తే అనుమానించాల్సిందే..

అలా చేస్తే అనుమానించాల్సిందే..

సాధారణంగా పెళ్లి అయిన వారు ప్రతిరోజూ స్నానం చేయడానికి చాలా బద్ధకిస్తూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి మీ భాగస్వామి తమ బాడీ శుభ్రత మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటే.. రోజూ కొత్త డ్రస్సులు వేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటే.. బయటకు వెళ్లేటప్పుడు అదే పనిగా పర్ఫ్యూమ్ వాడుతూ ఉంటే మీ అనుమానం కావొచ్చు.

కంపేర్ చేయడం..

కంపేర్ చేయడం..

ఏ జంట అయినా తమ గురించి.. ఇతరుల గురించి పోల్చి చూసుకుంటారు. అయితే మీరు ఏ విషయం చెప్పినా.. ప్రతి దానికి ఇంకొకరితో పోల్చి చూసి.. మిమ్మల్ని తక్కువ చేయడం.. ఆ వ్యక్తి పేరు చెప్పకుండా.. తన గురించి మీ వద్ద పొగుడుతూ ఉంటే.. తన గురించి ఏదైనా టాపిక్ వస్తే.. తనలో ఉప్పొంగే ఉత్సాహం వంటి సంకేతాలు కనిపిస్తే, మీ భాగస్వామిని అనుమానించొచ్చు.

సీక్రెట్ మెసెజ్..

సీక్రెట్ మెసెజ్..

మీరు మీ భాగస్వామి పక్కన ఉన్నప్పుడు.. తను ఫోన్లో మాట్లాడటానికి లేదా ఏదైనా మెసెజ్ రిప్లై ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారంటే కూడా మీ అనుమానం నిజం కావొచ్చు. అలాంటి వ్యక్తులపై మీరు కచ్చితంగా ఓ కన్ను వేసి ఉంచాల్సిందే. అది కూడా ఒక మహిళకు సీక్రెట్ గా మెసెజ్ చేస్తున్నారంటే.. అదేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి.

దూరంగా ఉంటే..

దూరంగా ఉంటే..

ఎల్లప్పుడూ మీ భాగస్వామి మీకు అందుబాటులో ఉంటూ.. అకస్మాత్తుగా మిమ్మల్ని దూరం పెట్టినా.. మీ నుండి దూరంగా వెళ్తుంటే.. మీరు డౌట్ పడాల్సిందే. అంతేకాకుండా బయటకు వెళ్లిన ప్రతిసారీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం వంటివి చేస్తుంటే.. అలాంటి వారిపై మీరు నిఘా పెట్టాల్సిందే.

ఆడవారిని ఆకర్షించడానికి ప్రతి ఒక్క మగాడు పెంచుకోవాల్సిన నైపుణ్యాలివే...

అనవసరంగా నిందించడం..

అనవసరంగా నిందించడం..

అంతవరకు ఏ చిన్న పని చేసినా మిమ్మల్ని పొగిడే మీ భాగస్వామి తప్పు తనదే అయినప్పటికీ.. అనవసరంగా మిమ్మల్ని నిందించడం వంటివి చేయడం.. చీటికి మాటికి చిరాకు పడటం.. మీరు ఏది చెప్పినా వినకుండా.. చిన్న విషయాలకే అరవడం వంటివి చేస్తుంటే.. మీ మీద ప్రేమ తగ్గిందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అదే సమయంలో ప్రేమ వేరేవరివైపు అయినా షిఫ్ట్ అయ్యిందేమో చూసుకోవాలి.

రొమాన్స్ పట్ల..

రొమాన్స్ పట్ల..

మీతో రొమాన్స్ చేయడం పట్ల ఇంట్రస్ట్ చూపకపోవడం.. కనీసం కౌగిలించుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం.. మీరు ముద్దు వంటివి పెట్టుకున్నా.. తను ఆసక్తి చూపడం లేదంటే.. తను ఇంకొకరితో బెడ్ రూమ్ రిలేషన్ కోరుకుంటున్నారమో ఆలోచించాల్సిందే.

వెడ్డింగ్ డేని పట్టించుకోకపోవడం..

వెడ్డింగ్ డేని పట్టించుకోకపోవడం..

సాధారణంగా పెళ్లి చేసుకున్న చాలా మంది జంటలు తమ వివాహ వార్షికోత్సవ తేదీ గుర్తుపెట్టుకుంటారు. ఇందుకోసం కనీసం నెల లేదా వారం రోజుల ముందుగానే ఏవేవో ప్లాన్లు వేస్తుంటారు. తమ వెడ్డింగ్ డేని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే మీ వివాహ వార్షికోత్సవ తేదీని పట్టించుకోకపోవడం.. వంటివి చేస్తుంటే.. అలాంటి వారిపై మీరు ఓ లుక్కేయాల్సిందే.

ఎక్కువ ప్రైవసీ..

ఎక్కువ ప్రైవసీ..

ఎప్పుడూ మీ వెంటే ఉంటూ.. మీతో ఉంటే సమయమే తెలీదంటూ.. పొగిడే మీ భాగస్వామి ఉన్నట్టుండి.. మీ నుండి ప్రైవసీ కావాలని కోరుకోవడం.. మీకు ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు పట్టించుకోకుండా.. కేవలం తన స్వార్థం చూసుకోవడం వంటివి చేస్తుంటే.. అలాంటి వారిని మీరు నిస్సందేహంగా అనుమానించొచ్చు.

English summary

Signs Your Partner Is Falling For Someone Else Right In Front Of Your Eyes

Here are the signs your partner is falling for someone else right in front of your eyes. Have a look
Story first published: Monday, June 7, 2021, 16:59 [IST]