For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెలబ్రెటీలు రెండో పెళ్లిని చేసుకునేందుకు గల కారణాలేంటో తెలుసా...

|

పెళ్లి(Marriage) అనే తంతు వల్ల ఇద్దరు వ్యక్తులు ఒక్కటవుతారు. ఇండియాలో ఇలా పెళ్లి చేసుకున్న జంటలు జీవితాంతం కలిసి ఉంటారు. అందుకే ప్రతిఒక్కరి జీవితంలో పెళ్లి అనే తంతు చాలా ముఖ్యమైంది.

చాలా మంది లైఫ్ లో ఒకే ఒక్కసారి వచ్చే ముఖ్యమైన ఘట్టం అని చెప్పుకోవాల్సిందే. అందుకే పెళ్లి చేసే ముందు చాలా మంది పెద్దలు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటూ ఉంటారు. అన్ని చూసినా కొన్ని సందర్భాల్లో మనల్ని అన్ని విధాలుగా అర్థం చేసుకునే భాగస్వామి దొరక్కపోవచ్చు.

అందుకే చాలా మంది మొదటి పెళ్లి చేసుకుని, అనుకోని కారణాలతో మత భాగస్వామితో విడిపోతూ ఉంటారు. అయితే ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు. తమ లైఫ్ లో ఒకసారే పెళ్లికి ఛాన్స్ ఉంటుందని అనుకుంటారు. కానీ కొందరికి మాత్రం ఇలాంటి అవకాశాలు రెండోసారి కూడా దక్కుతుంటాయి. అందులో మన సినీ ప్రముఖులు అందరికంటే రెండడుగులు ముందే ఉంటాయి.

ఇటీవల కరోనా లాక్ డౌన్ టైమ్ లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోగా.. తాజాగా సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇండియాలో రెండో పెళ్లిపై ఎందుకని ఆసక్తి చూపుతారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రెండో పెళ్లి గురించి..

రెండో పెళ్లి గురించి..

తన రెండో పెళ్లి గురించి ప్రముఖ గాయని సునీత సోషల్ మీడియా ద్వారా కొన్ని వివరాలను అందరితో షేర్ చేసుకున్నారు. ‘నాకు అద్భుతమైన పిల్లలు, తల్లిదండ్రులను దేవుడు ప్రసాదించాడు. నన్ను వాళ్లంతా జీవితంలో సెటిల్ కావాలని ఎప్పుడూ కోరుకునే వారు.

వివాహ బంధంతో..

వివాహ బంధంతో..

వాళ్లు కోరుకున్న విధంగానే ఆ రోజు రానే వచ్చింది. ఒక స్నేహితుడిగా రామ్ అనే వ్యక్తి నా జీవితంలోకి ప్రవేశించాడు. అతను అద్భుతమైన జీవిత భాగస్వామి. మేమిద్దరం వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకుంటున్నాం.' అని సునీత సోషల్ మీడియా ద్వారా వివరించారు.

జనవరి 9న ..

జనవరి 9న ..

తన పెళ్లి గురించి సునీత ఇంకా ఏమన్నారంటే.. ‘నాకు ఇప్పుడు కొంత గర్వంగా ఉంది. ఎల్లప్పుడూ అండగా నిలిచిన నా ఫ్యామిలీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. రామ్ తో నా పెళ్లి జనవరి 9వ తేదీన జరిగింది. నా స్నేహితులు, కుటుంబసభ్యుల మధ్య సింపుల్ గా తన పెళ్లి జరగనుందని, ఇది తనకు స్పెషల్ ఫీలింగ్ అని' సునీత చెప్పారు.

మొదటి వివాహంలో గొడవలు..

మొదటి వివాహంలో గొడవలు..

సునీత తన మొదటి వివాహం కిరణ్ కుమార్ గోపరాజుతో జరిగింది. ఆ పెళ్లి తర్వాత తమకు ఆకాష్ గోపరాజు, శ్రియా గోపరాజు పుట్టారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు రావడంతో వారి బంధం విడాకుల వరకు వెళ్లింది. అయితే అప్పటినుండి ఆమె తన పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగానే ఉంటున్నారు.

ఒంటరితనాన్ని భరించలేక..

ఒంటరితనాన్ని భరించలేక..

ఇక చాలా మంది మొదటిసారి వివాహం చేసుకున్నాక.. రెండో పెళ్లి చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొందరికి భార్య చనిపోవడం లేదా భార్య విడిచిపెట్టి పోవడం వంటి కారణాలతో ఒంటరిగా బతుకుతూ ఉంటారు. ఆ ఒంటరితనాన్ని భరించలేక, తమకంటూ ఓ తోడు, నీడ కావాలని ఆశిస్తూ రెండో పెళ్లికి సిద్ధమవుతారు.

పిల్లల కోసం..

పిల్లల కోసం..

మొదటిసారి పెళ్లి చేసుకుని తమ భాగస్వామితో విడిపోయిన తర్వాత పిల్లల ఆలనా, పాలనా చూసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే చాలా మంది రెండో పెళ్లి వైపు మొగ్గు చూపుతూ ఉంటారు.

ప్రముఖులే ఎక్కువగా..

ప్రముఖులే ఎక్కువగా..

అయితే ఇలా రెండో పెళ్లి చేసుకోవడంలో ప్రముఖులు అందరికంటే రెండడుగులు ముందే ఉన్నారు. ఆ జాబితాలో ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చేరగా.. ఇప్పుడు సింగర్ సునీత, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు కూడా చేరబోతున్నారు. ఇదివరకే నాగార్జున, పవన్ కళ్యాణ్ తో పాటు మరెందరో ఉన్నారు. కాకపోతే వీరి రెండో పెళ్లి చాలా పాపులర్ అయ్యింది.

English summary

Singer Sunitha 2nd Marriage : Reasons why getting second marriage popular in India

Here we talking about the singer sunita 2nd marriage : reasons why getting second marriage popular in India. Read on