For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే మీ దాంపత్య జీవితం వేరే లెవెల్ లో ఉంటుదట...!

ఎలాంటి విషయాలు మీ వివాహ జీవితాన్ని కాపాడతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

పెళ్లి అంటేనే ఇద్దరు వ్యక్తులు కలిసి తమ బంధాన్ని కొత్తగా మొదలెట్టడం.. వీరి బంధంలో బాధ్యతలు మరియు బరువు మరింత ఎక్కువగా ఉంటాయి.

The Most Important Lessons That Can Save Your Marriage in Telugu

పెళ్లైన కొత్తలో చాలా మంది హ్యాపీగా ఉంటారు. అయితే కాలం గడిచేకొద్దీ చాలా మంది జంటలు సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే కొంతకాలం తర్వాత భార్యభర్తల మధ్య కొన్ని సందర్భాల్లో తగాదాలు మరియు ఘర్షణలు వంటివి ఎదురవుతాయి.

The Most Important Lessons That Can Save Your Marriage in Telugu

మరి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలే చిలికి చిలికి గాలి వానలా మారతాయి. అవి ఎంతలా అంటే.. ఇద్దరూ కలిసి విడిపోయేంతలా ఉంటాయి. అయితే మీ మ్యారేజ్ లైఫ్ సాఫీగా సాగాలంటే..మీరు మీ భాగస్వామి ఇష్టయిష్టాలను తెలుసుకోవాలి. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది దాంపత్య జీవితంలో నమ్మకం మరియు ప్రేమ.

The Most Important Lessons That Can Save Your Marriage in Telugu

దంపతులిద్దరూ కోపంగా ఉండకుండా.. చిరాకు పడకుండా ఉండాలంటే వాస్తవ జీవితంలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ వైవాహిక సంబంధాన్ని కొనసాగించడం ప్రాధాన్యతగా మారినప్పుడు, చాలా మంది జంటలు దానిని కోల్పోతారు. ఇలాంటి సమస్యల వల్లే ఎక్కువగా విడిపోయేందుకు దారి తీస్తుంది. ఈ సందర్భంగా మీ వివాహ బంధాన్ని కాపాడుకునేందుకు మీరు కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. అలా చేయడం వల్ల మీ బంధం బలంగా మారుతుంది... ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

రొమాన్స్ విషయంలో ఏ రాశి వారు ఏం తెలుసుకోవాలంటే..రొమాన్స్ విషయంలో ఏ రాశి వారు ఏం తెలుసుకోవాలంటే..

వ్యక్తిగతంగా భావించొద్దు..

వ్యక్తిగతంగా భావించొద్దు..

వివాహం జరగక ముందు మీది వ్యక్తిగత జీవితం. అయితే పెళ్లయ్యాక మాత్రం మీ జీవితంలో మీరు జీవిత భాగస్వామితో కలిసి జీవించాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితాన్ని వ్యక్తిగతంగా భావించొద్దు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యభర్తలిద్దరూ కలిసి పని చేయాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. మీరిద్దరూ కలిసి పనులను షేర్ చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ బాధ్యతగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పార్ట్నర్ ను ప్రత్యర్థిగా చూడకండి. మిమ్మల్ని ప్రోత్సహించే వారిని, మీకు మద్దతుగా ఉండే వారిని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు.

బంధం బలంగా ఉండాలంటే..

బంధం బలంగా ఉండాలంటే..

మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడాలంటే.. ప్రతి ఒక్క జంట తమలో స్పార్క్ ను సజీవంగా ఉంచాలంటే.. అప్పుడప్పుడు కనీసం ఒకట్రెండు రోజులు లేదా వారం నుండి 10 రోజుల వరకు విహార యాత్రల వంటి వాటికి వెళ్లాలి. మరికొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్ తో కలిసి ఆకస్మిక ప్రయాణాలు చేయాలి. మీ ఇద్దరి మధ్య ఏదైనా అపార్థం వచ్చినప్పుడు మీరు సడెన్ టూర్ ప్లాన్ చేస్తే.. మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ప్రేమగా మాట్లాడండి..

ప్రేమగా మాట్లాడండి..

మీ వివాహ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటే.. మీ భాగస్వామితో ప్రేమగా వ్యవహరించండి. ఇలా చేయడం వల్ల వారికి కచ్చితంగా నచ్చుతుంది. మీరు వారిపై శ్రద్ధ వహించడాన్ని మీ భాగస్వామి బాగా ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ కచ్చితంగా పెరుగుతుంది. అప్పుడప్పుడు మీ భాగస్వామికి పువ్వులు ఇవ్వండి. మీ జీవితంలో మీరు వారిని ఎంతగా అభినందిస్తున్నారో చూపించడానికి ఏదైనా మంచి బహుమతులను కూడా ఇవ్వొచ్చు.

ఆ కార్యాన్ని వేగంగా చేస్తే.. అద్భుతమైన అనుభూతి కలుగుతుందట...!ఆ కార్యాన్ని వేగంగా చేస్తే.. అద్భుతమైన అనుభూతి కలుగుతుందట...!

ఇతరులతో పోల్చద్దు..

ఇతరులతో పోల్చద్దు..

మనలో చాలా మందికి ఏ విషయమైనా ఏదో ఒక దానితో పోల్చి చూస్తుంటారు. ముఖ్యంగా భార్యభర్తలు తమ రిలేషన్ కు సంబంధించి ఎదురింటి వారితో లేదా పక్కింటి వారితో పోల్చి చూసుకుంటూ ఉంటారు. అయితే మీ వివాహ జీవితంలో ఆనందంగా ఉండాలంటే, ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. మీరు ఇతరులతో పోల్చడం వల్ల కొందరు అభద్రతా భావానికి గురౌతారు. అలాంటప్పుడే భార్యభర్తల మధ్య గొడవలు వంటివి జరుగుతాయి.

సారీ చెప్పడం..

సారీ చెప్పడం..

వివాహ జీవితంలో భాగస్వాములు క్షమాపణ చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇది చాలా సందర్భాల్లో సరైన విషయమే. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య మీ అహం రానివ్వకండి. 'క్షమించండి' అని చెప్పడం మరియు మీరు చెప్పేదానిని అర్థం చేసుకోవడం మీ వివాహంపై చాలా ప్రభావం చూపుతుంది. మీ వివాహ జీవితంలో సరైన సఖ్యత లేకపోతే, నిరాశ చెందొద్దు. మంచి సమయం కోసం ఎదురుచూడండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో క్షమాపణ అడగడం వల్ల మీ సంబంధం బలపడే అవకాశం ఉంది. అలాగే దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది

English summary

The Most Important Lessons That Can Save Your Marriage in Telugu

Here are the most important lessons that can save your marriage in Telugu. Have a look
Desktop Bottom Promotion