For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీవిత భాగస్వామితో ఇలా జరిగితే మీ బంధానికి భారీ ఇబ్బందులు తప్పవు..

|

ఒకప్పుడు నువ్వు లేక నేనులేను, నిన్నే ప్రేమిస్తా, నువ్వు లేకపోతే నేను లేను అని భావించిన జంటలు ప్రస్తుతం తమ భావాలను మార్చుకుంటున్నారు. చాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నారు. వివాహ బంధం ద్వారా ఒక్కటైన ఎన్నో జంటలు ఎక్కువ కాలం కలసి కాపురం చేయలేకపోతున్నారు.

కలసి ఉన్న రోజుల్లోనూ కలహాల కాపురం సాగించినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ గొడవల వల్ల వారి అందమైన జీవితాలను మరియు సంబంధాలను దూరం చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణాలేంటంటే వారికి చెడు అభిరుచులు ఉండటం,విభేదాలు, చెడు అలవాట్లు ఉన్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. దీంతో వారు జంటగా ఉండటం మానేసి ఏకాంత జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటున్నారు.

వివాహ జీవితం నాశనం..

వివాహ జీవితం నాశనం..

భార్య, భర్తలు అన్నాక గొడవలు రావడం అత్యంత సహజం. అయితే అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు భార్య, మరికొన్ని సార్లు భర్త సర్దుకుపోవాలి. లేదంటే మీ ఇద్దరి మధ్య చాలా విభేదాలు, ఆలోచనలు మరియు వైఖరులు మీ సంబంధాన్ని చెడగొడతాయి. మీ బంధంపై విసుగు తెప్పిస్తుంది. ఇది ఏకంగా మానసిక ఒత్తిడిలా మారి మీ వివాహ జీవితాన్ని నాశనం చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మీ జీవిత భాగస్వామి బాధపడుతున్నప్పుడు మన ప్రవర్తనలను లేదా అలవాట్లను నియంత్రించగలగాలి. ఇది మీ జీవిత భాగస్వామి యొక్క భావాలకు కూడా విలువైనది.

భిన్నమైన అభిరుచులు..

భిన్నమైన అభిరుచులు..

మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి భిన్నమైన వైఖరి, అభిరుచులు ఉంటాయి. కానీ వీటిని మీ భాగస్వామితో నేరుగా వ్యక్తం చేయకూడదు. అలా చేయడం వల్ల మీ భాగస్వామి బాధపడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ మాటలు, ప్రవర్తన ఇతరులను అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. చాలా సందర్భాల్లో మీరు ఇతరుల మాదిరిగానే క్రమశిక్షణను కలిగి ఉండాలి. అలాగే మీలో గాని మీ భాగస్వామిలో గాని మార్పు రావాలంటే చాలా సమయం నిరీక్షించాలి. అప్పటికీ మార్పు కనిపించకపోతే విసుగు తెప్పిస్తుంది. అలాగే ప్రతిసారీ మీ భాగస్వామి తప్పులనే ఎత్తి చూపితే వారు విసుగు చెందుతారు. చాలా బాధపడతారు. కాబట్టి అలాంటి అలవాటు, అభిరుచిని సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి.

విభేదాలు వచ్చినప్పుడు..

విభేదాలు వచ్చినప్పుడు..

విభేదాలు వచ్చినప్పుడల్లా జంటలలో సాధారణంగా వాదన ఉంటుంది. అనవసరమైన పదాలు లేదా వాదనలు మీ రిలేషన్ షిప్ లో విసుగు మరియు ఉద్రిక్తతను కలిగిస్తుంటే, అలాంటి వాటిని అక్కడే వదిలేయటం మంచిది. ఏది మాట్లాడుతున్న మళ్లీ మళ్లీ పాత విషయాల గురించే మాట్లాడితే రిలేషన్ షిప్ నాశనం అవ్వడం ఖాయం. మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా ఒక్కటే. మీ రిలేషన్ షిప్ కంటే సంతోషమైనది ఏదీ లేదు. కాబట్టి వాదన యొక్క ధోరణి మీలో ఉంటే వెంటనే వాటిని వదిలేయండి.

మూడో వ్యక్తికి అవకాశమిచ్చినప్పుడు..

మూడో వ్యక్తికి అవకాశమిచ్చినప్పుడు..

జంటల మధ్య మూడో వ్యక్తికి అవకాశమిచ్చినప్పుడు, వారి మాటలు మీకు విసుగు, విచారం కలిగిస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి అస్సలు ఆస్కారమివ్వకండి. అలాగే మీ భాగస్వామి ప్రవర్తన గురించి మీరు గందరగోళం చెందితే, అలాంటి విషయాలను దాచకండి. మీకు ఏ విషయంలో అయినా గందరగోళంగా అనిపిస్తే వెంటనే వారితో చర్చించండి. వాస్తవాలను తెలుసుకోండి. అప్పుడు మీ గందరగోళం కూడా దూరమవుతుంది.

ఇతరులతో పోల్చడం..

ఇతరులతో పోల్చడం..

మీరు మీ జీవిత భాగస్వామిని ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో పోల్చకూడదు. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి ఇలాంటి పోలికలను ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ మీరు ఇతరులతో పోలిస్తే అప్పుడు మీ సంబంధంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి యొక్క మంచి లక్షణాలను చూసి సంతోషించండి. అప్పుడు రిలేషన్ షిప్ రిలాక్స్ గా అనిపిస్తుంది.

వ్యక్తిగత విషయాలను గౌరవించకపోవడం..

వ్యక్తిగత విషయాలను గౌరవించకపోవడం..

ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విషయాలు ఉంటాయి. మీరు వాటిని అగౌరపరచకూడదు. వారిని తక్కువ చేసి చూడకూడదు. జీవిత భాగస్వామి తల్లిదండ్రులు మరియు బంధువుల పట్ల గౌరవంగా లేకపోతే మీ జీవిత భాగస్వామి విసుగు చెందుతారు. అలాగే మీరు కోపంగా ఉంటే మీ భాగస్వామిని హింసించకూడదు. లేదా తమకు నచ్చని పని చేయమని బలవంతం చేయకూడదు. ఇలాంటి వైఖరులు సంబంధాలలో ఉద్రిక్తతను తెప్పించగలవు.

English summary

These Bad Habits May Ruin Even the Happiest Marriage

Here we talking about some of bad habits in happiest relationship may ruin relationship. Read on
Story first published: Saturday, November 16, 2019, 17:37 [IST]