For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి తర్వాత ప్రతి వధువు కన్యత్వంతో పాటు వీటిని కచ్చితంగా గుర్తుంచుకుంటుంది...!

|

ఏడడుగుల బంధంతో.. మూడు ముళ్లు వేయించుకుని ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టే పెళ్లికూతురికి... తన భర్త కొత్త జీవితం ప్రారంభమవుతుంది.

ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ప్రతి అమ్మాయి హనీమూన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత వాస్తవ పరిస్థితులు ఆమెను కొంత ఇబ్బందికి గురి చేస్తాయి.

అంతవరకు పుట్టింట్లో ఆడుతూపాడుతూ హాయిగా, స్వేచ్ఛగా ఉన్న తనను ఒక్కసారిగా పంజరంలో పెట్టినట్టు కొందరు భావిస్తుంటారు.

అయితే మరికొంత మంది అమ్మాయిలు అత్తమామల దూరంగా ఎక్కడో సిటీలో నివసిస్తున్నప్పటికీ, కొత్త జీవితంలో తన భర్త తనకు తోడుగా నిలుస్తాడో లేదో అనే ఆందోళనలో కూడా ఉంటారు.

ఈ సందర్భంలోనే చాలా మంది అమ్మాయిలు వివాహం తర్వాత తమ సొంతింటిని పదే పదే గుర్తు చేసుకుంటారు. మీకు కూడా ఈ విషయాలతో సంబంధం ఉందని అనిపిస్తోందా? అయితే ఇలాంటి విషయాలు మరిన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడే చూసేయ్యండి...

సర్వే! కరోనా సమయంలో శృంగార జీవితం గురించి యువత ఏం చెప్పారో తెలుసా?

అమ్మ చేతి వంట..

అమ్మ చేతి వంట..

వివాహం తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి ఎక్కువగా కోల్పోయేది అమ్మ చేతి వంట. మెట్టినింట్లో మంచి ఆహారం దొరికినప్పటికీ, తల్లి చేత్తో చేసిన ఆహారం మిస్సవుతున్నామనే ఫీలింగ్ ఉంటుంది. అయితే గొప్ప విషయం ఏమిటంటే, కొత్త వధువు కావడం వల్ల ఏది తిన్నా కూడా కొంత కారంగా అనిపిస్తుంది. ‘ఉప్పు కూడా తక్కువగా ఉంది లేదా కూరగాయలకు ప్రాధాన్యత ఉండటం లేదు' అని మీరు ఎవ్వరితోనూ చెప్పలేరు. ఈ కారణంగానే మీ కోసం ఎంతో ప్రేమతో చేసిన ఆహారాన్ని మీ అత్తగారిని బాధపెట్టకూడదని మీరు సైలంట్ గా ఉండిపోతారు.

బెడ్ రూమ్..

బెడ్ రూమ్..

పెళ్లి చేస్తున్న తర్వాత చాలా మంది అమ్మాయిలకు కొత్త ప్రపంచం మొదలవుతుంది. వారి కట్టుబాట్లు, సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. అప్పటిదాకా ఆమె చిన్ననాటి నుండి గడిపిన ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. కొత్తగా తన బెడ్ రూమ్ ను తన భర్తతో కలిసి పంచుకోవాలి. ఇలాంటి సమయంలో, ఒక అమ్మాయి తన గది మరియు ప్రైవేట్ స్పేస్ ను కోల్పోతుంది.

దుప్పటి మరియు దిండు..

దుప్పటి మరియు దిండు..

చాలా మంది అమ్మాయిలకు సొంతంగా ఓ మంచం, దుప్పటి, దిండ్లు సపరేటుగా ఉంటాయి. ఏదైనా కొత్త ప్లేసుకు వెళ్లినప్పుడు వారు వాటిని సర్దుబాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా సరైన దిండు లేకపోయినా... లేదా బెడ్ సౌకర్యవంతంగా లేకపోయినా కొంత ఇబ్బందిగా ఉంటుంది.

మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!

అలారంపై ఆధారపడాలి..

అలారంపై ఆధారపడాలి..

పెళ్లికి ముందు ఎప్పుడు లేచినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ తల్లి లేదా తండ్రి నిద్రలేపినా.. ఇంకాసేపు పడుకుంటా అని అలా నిద్రలోకి జారుకుంటారు. అదే పెళ్లి తర్వాత ఉదయాన్నే నిద్ర లేవడానికి అలారంపై ఆధారపడిలి. ఇది తాత్కాలికమే కాబట్టి, దీనిని నిత్యం ఉపయోగించలేరు. కొన్ని సమయాల్లో మీరు భర్తను నిద్రలేపే బాధ్యతను కూడా తీసుకోవాలి. ఇలా ప్రతి అమ్మాయి తన నిద్రను చాలా మిస్ అవుతుంది.

తోబుట్టువులతో పోట్లాట..

తోబుట్టువులతో పోట్లాట..

ఈ విశ్వంలో అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముడు మధ్య ప్రేమ, వారితో గడిపిన క్షణాలు చాలా విలువైనవి. పెళ్లి తర్వాత వారితో గడిపిన క్షణాలు.. పోట్లాటలు గుర్తుకొస్తాయి. టివి రిమోట్ నుండి బట్టలు ఇతర వస్తువల వరకు తోబుట్టువులతో పోట్లాట చాలా సిల్లీగా అనిపింది. అయితే వివాహం అయిన తర్వాత వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడినట్టేనని భావిస్తారు.

సొంతిల్లు మిస్..

సొంతిల్లు మిస్..

పెళ్లి చేసుకున్న తర్వాత భర్త, అత్తమామలు ఎంత బాగా చూసుకుంటున్నప్పటికీ, సొంతింటిని కోల్పోయామనే బాధ ఎక్కడో ఓ చోట ఉంటుంది. అయితే క్రమంగా వీటిని మరిచిపోయేందుకు ప్రయత్నిస్తుంది.

English summary

Things every bride misses after getting married

Here are things every bride misses after the marriage. Take a look