For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలుమగలు ఆ విషయంలో అస్సలు రాజీ పడకూడదట...!

|

ఈ లోకంలో మనుషుల మధ్య ఏ బంధమైనా నమ్మకం అనే పునాదుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీరు ఎంతగానో ప్రేమించిన మనిషైనా.. మీరు ఎంతగా నమ్మినా వ్యక్తి అయినా మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమించకపోయినా.. లేదా నమ్మకపోయినా అలాంటి బంధంలో అనేక ఇబ్బందులు వస్తుంటాయి.

అలాంటి బంధం బలంగా ఉండటం కష్టమే. కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటించే వారితో కలిసి జీవితాంతం ఆనందంగా ఉండటం కష్టమే.

అయితే మీ భాగస్వామితో మీరు కలకాలం హాయిగా జీవించాలంటే కొన్ని విషయాలు రాజీపడాల్సి వస్తుంది. చాలా విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుంది. అయితే మీరు రిలేషన్ షిప్ లో అస్సలు రాజీ పడకూడని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మీరు సరైన వ్యక్తినే సెలెక్ట్ చేసుకున్నారా? ఎలా తెలుసుకోవాలంటే...

పరిమితులు విధిస్తే..

పరిమితులు విధిస్తే..

చాలా మంది పెళ్లయ్యాక పెళ్లాం చాటు కొంగున ఉండిపోతారని చెబుతుంటారు. కొందరు భాగస్వాములు కూడా తమ శ్రీవారికి అనేక విషయాల్లో కండీషన్లు పెడుతుంటారు. ముఖ్యంగా సాయంకాలం ఆరేడు గంటల్లోపు ఇంటికొచ్చేయాలని చెబుతుంటారు. మరికొందరు తమ ప్రియమైన వారు ఎల్లప్పుడూ తమతోనే గడపాలని.. స్నేహితులు, కుటుంబసభ్యులతో సమయాన్ని తగ్గించుకోవాలని చెబుతుంటారు. అయితే స్నేహితులతో మరియు కుటుంబసభ్యులతో సమయాన్ని పరిమితం చేయాలని మీ భాగస్వామి కోరడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి మీరు ఆ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. అందరికీ సమిష్టిగా సమయాన్ని కేటాయించొచ్చు.

పిల్లల గురించి..

పిల్లల గురించి..

చాలా మంది పెళ్లాయ్యాక పిల్లలు కావాలని కోరుకుంటూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. ఇందుకంటే తాము అమ్మ, నాన్న అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి మీకు పిల్లలు కావాలంటే ఆ కార్యంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ భాగస్వామి దీనికి ఒప్పుకోకపోతే.. మీరు తనను ఒప్పించేందుకు ప్రయత్నించాలి. కేవలం ఈ ఒక్క విషయం కోసం మీ భాగస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు. ఒకవేళ మీరు కోప్పడితే.. ఆ బంధంలో చీలికలు రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి రిలేషన్ షిప్ లో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

సంప్రదాయాలు, కట్టుబాట్లు..

సంప్రదాయాలు, కట్టుబాట్లు..

మన దేశంలో పెళ్లి అంటేనే ఏడడుగులు.. పంచభూతాలు.. జీలకర బెల్లం, మాంగళ్యధారణ, కన్యదానం, అరుంధతీ నక్షత్రం వంటి ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఎన్నో ఉంటాయి. అయితే కొందరు వీటిని వ్యతిరేకిస్తుంటారు. అయితే అంతమాత్రాన మిమ్మల్ని కూడా ఇలాంటి వాటిని వదిలేయమంటే.. మీరు రాజీ పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే మీకు ఇష్టమైన ఆచారాలను మీరు పాటిస్తుంటారు. ఇలాంటి సంప్రదాయాలను మీ కుటుంబం అంగీకరిస్తే మరీ మంచిది. ఇలాంటి విషయాల్లో మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు.

‘నేను కన్యను కాదని.. నాకు కాబోయే భర్తకు చెప్పొచ్చా..'

లక్ష్యం మరియు ఆశయాలు..

లక్ష్యం మరియు ఆశయాలు..

ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మరికొందరికీ లక్ష్యంతో పాటు కొన్ని ఆశయాలు కూడా ఉంటాయి. అయితే పెళ్లి తర్వాత కొందరు వీటిని పూర్తిగా మరచిపోతారు. అయితే మీ ఇద్దరు ఆరోగ్యకరమైన సంబంధం కొనసాగించాలంటే.. లక్ష్యాలు మరియు ఆశయాల గురించి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మీ కలలను నిజం చేసుకోవడానికి మీ భాగస్వామి మిమ్మల్ని గౌరవించాలి మరియు ప్రోత్సహించాలి. అంతేగానీ, తను జాబ్ చేస్తున్నారని.. మీరు చేయాల్సిన అవసరం లేదని చెబుతుంటే, మీరు అలాంటి విషయాల్లో అస్సలు రాజీ పడాల్సిన అవసరం లేదు.

సరైన స్థానం..

సరైన స్థానం..

పెళ్లి చేసుకున్న తర్వాత మీ భాగస్వామి మీకు సరైన స్థానం ఇస్తున్నారా లేదా అనే విషయాలను గమనించాలి. ముఖ్యంగా నలుగురిలో మీకు సమాన గౌరవం ఇస్తూ.. మీ అభిప్రాయాలను, ఆలోచనలకు విలువ ఇవ్వాలి. అలా కాకుండా మీరు చెప్పే ప్రతి దానిలో లోపాలు వెతకడం, అనుమానం వ్యక్తం వంటివి వ్యక్తం చేస్తే మీ సంబంధంలో సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు రాజీ పడకండి.

ఆర్థిక పరమైన విషయాల్లో..

ఆర్థిక పరమైన విషయాల్లో..

ప్రస్తుతం ప్రతి ఒక్క మనిషికి ఆర్థికంగా ప్రతిరోజూ అవసరం పడుతోంది. డబ్బు లేనిదే ఏ పనీ జరగడం లేదు. అందుకే ఇప్పటితరం వారిలో చాలా మంది భార్యభర్తలు ఇద్దరూ కలిసి సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడే కొందరి మధ్య తేడాలు వస్తున్నాయి. నేను ఎక్కువ సంపాదిస్తున్నాను.. కాబట్టి నేను ఎక్కువ ఖర్చు చేస్తాను.. నాకు తక్కువ వస్తుంది కాబట్టి నాకు నువ్వే మిగిలినది ఇవ్వాలని చెప్పడం భావ్యం కాదు. ఇద్దరూ కూర్చొని మీ బడ్జెట్ ను సిద్ధం చేసుకోవాలి. అంతేకానీ అంతా నాకే కావాలి అంటే.. మొత్తం నేనే నడుపుతాను అని చెబితే.. అలాంటి విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు.

English summary

Things You Should Not Compromise in a Relationship

Here are these things you should not compromise in a Relationship. Take a look
Story first published: Thursday, May 13, 2021, 15:29 [IST]