For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన దేశంలో విడాకులు మావిడాకులుగా మారిపోయాయా? కరోనా కేసుల్లాగా విడాకులు పెరుగుతున్నాయా?

|

మన దేశంతో పాటు ప్రపంచంలో ఏ జంట అయినా వివాహం చేసుకునే దంపతులందరూ కలకాలం కలసిమెలసి జీవించాలనే కోరుకుంటారు. ఎవ్వరూ కూడా కావాలని తాము విడిపోవాలని మాత్రం అనుకోరు. అయితే అందరూ జంటలు అనుకున్నట్టు మాత్రం జరగదు కదా. చాలా మంది దంపతులు అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు.

అయితే ఒకప్పుడు విదేశాలలో ఇలాంటి వ్యవహారాలు సాధారణంగా ఉండేవి. కానీ ప్రస్తుతం క్రమంగా మన దేశంలో కూడా ఈ కల్చర్ బాగా పెరిగిపోతోంది. ఈ మధ్య కాలంలో చాలా మంది జంటల తీరు మారుతోంది. అయితే విడాకుల విషయానికి వస్తే ఏ జంట అయినా అవి తీసుకునేందుకు మాత్రం పలు నిర్దిష్టమైన కారణాలున్నాయి. అయితే మీరు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటే, మీరు మీ భాగస్వామితో కలిసి జీవించాలనుకుంటే మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. అవేంటో మీరే చూడండి...

నమ్మకం కోల్పోయినప్పుడు..

నమ్మకం కోల్పోయినప్పుడు..

భార్యభర్తల సంబంధంలో నమ్మకం అనేది కోల్పోయినప్పుడే.. ఆ వివాహ బంధం విడాకులకు దారి తీస్తుంది. ఇలాంటి సమయంలో తమ భాగస్వామి గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే మీరు దీనికి బదులుగా మీ పార్ట్ నర్ బలాల గురించి ఇతరులకు చెప్పండి.. వారిని ప్రశంసించండి.. ఇలాంటి మీ గుణాన్ని చూసి వారు మీతో జీవితాంతం గడపాలని నిర్ణయించుకుంటారు. అయితే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చేస్తున్నాడని, మీకు కచ్చితంగా స్పష్టమైతే మాత్రం అది విడాకులకే దారి తీస్తుంది.

రొమాన్స్ లేకపోతే..

రొమాన్స్ లేకపోతే..

పెళ్లి చేసుకున్న వారిలో మెజార్టీ శాతం జంటలు వారి రొమాంటిక్ లైఫ్ గురించి ఎన్నో కలలు కంటారు. వాటిని నిజం చేసుకుందామని భావిస్తారు. అయితే, మీరు ఇలాంటి విషయాల్లో ఎప్పటికీ తగ్గకండి. మీరు రొమాన్స్ విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం మీకు సమస్యలు తప్పవు.

ఈ గ్యాప్ పెరిగితే...

ఈ గ్యాప్ పెరిగితే...

భార్యభర్తల మధ్య ఎలాంటి విషయంలో కూడా దాపరికాలు ఉండకూడదు. ప్రతి చిన్న విషయాన్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి. లేదంటే దంపతుల మధ్య మనస్పర్దలు, కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతుంది. దీంతో విడాకుల విషయం మీ ముందుకు వస్తుంది.

సంబంధంలో ప్రేమ, గౌరవం మరియు సానుభూతి

సంబంధంలో ప్రేమ, గౌరవం మరియు సానుభూతి

వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఉండటం గొప్ప విషయం. కానీ దీనితో, మీరిద్దరూ ఒకరికొకరు సానుభూతి పొందడం చాలా ముఖ్యం. ఒక రోజు పని తర్వాత, మీరిద్దరూ అలసిపోతారు లేదా అతిథులు ఇంటిని విడిచిపెట్టిన తర్వాత ఇద్దరూ విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ఒకరు ఎక్కువ అలసిపోతే అతన్ని విశ్రాంతి తీసుకోండి, మరొకరు ఇంటి మిగిలిన పనిని పూర్తి చేయాలి.

సంపాదన విషయంలో..

సంపాదన విషయంలో..

ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లోన పని చేస్తున్నారు. కొన్ని చోట్ల వారి కంటే ఎక్కువ వేతనాలను కూడా అందుకుంటున్నారు. అయితే భార్య తన కంటే ఎక్కువ సంపాదించడాన్ని మాత్రం కొందరు భర్తలు చూసి భరించలేకపోతున్నారు. దీంతో వీరి మధ్య చీటికిమాటికీ గొడవలు పెరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య ఈగోలు పెరిగిపోతున్నాయి. దీని ఫలితం విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారు.

కాపురంలో కలహాలతో..

కాపురంలో కలహాలతో..

ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొందరు పెద్దలు వారి ప్రేమను కాదని, పెద్దలు కుదిర్చిన సంబంధాలనే బలవంతంగా చేసుకోవడంతో కాపురంలో కలహాలు వస్తున్నాయి. ఇలాంటి కష్టసుఖాలను పంచుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి సందర్భాలలో కలిసి ఉండటం కంటే విడిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

అంచనాలను చేరుకోకపోతే..

అంచనాలను చేరుకోకపోతే..

చాలా మంది వివాహం చేసుకున్న జంటలు చాలా విషయాల్లో ఎన్నో అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ అంచనాలన్నీ ఎవరైతే చేరలేకపోతారో.. అవన్నీ అబద్ధాలని తేలిన నాడు వారిద్దరి మధ్య సఖ్యత అనేది తగ్గిపోతుంది. ఈ కారణాల వల్ల కూడా విడాకులు తీసుకోవాలని అనుకుంటారు.

అత్తా కోడలి గొడవలు..

అత్తా కోడలి గొడవలు..

పూర్వకాలం నుండి ప్రస్తున ఆధునిక కాలం వరకు అత్తాకోడలి గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే చాలా అరుదైన సందర్భాల్లో అత్తాకోడళ్లు అనే వారు కలసి మెలసి ఉంటారు. వారిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే ఇలాకాకుండా, చీటికిమాటికి ఒకరినొకరు ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే, కోడలిపై అత్తలు, ఆడపడుచుల పెత్తనం ఎక్కువైనప్పుడు కూడా.. ఆమె భర్త నుండి విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకుంటుంది.

ఆధిపత్యం భరించలేక..

ఆధిపత్యం భరించలేక..

భర్త కుటుంబంలోని ఉండే సభ్యులు ఎవరైనా సాధారణంగా అతని భార్య తరపు కుటుంబ సభ్యుల ఆధిపత్యాన్ని అస్సలు భరించలేరు. ఇలాంటి విషయాలు చాలా పెద్ద గొడవలకు దారి తీస్తాయి. దీని వల్ల కూడా విడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఏకాభిప్రాయం కుదరనప్పుడు..

ఏకాభిప్రాయం కుదరనప్పుడు..

ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా అభిప్రాయభేదాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. అయితే దంపతుల విషయంలో మాత్రం నిత్య జీవితంలో ఏకాభిప్రాయం కుదరడమంటే అది కత్తి మీద సామే. ఎందుకో ప్రతి ఒక్క అంశంలోనూ ఇద్దరికీ భేదాలు ఉంటాయి. అయితే ఇవి కామన్ గా ఉంటే ఏమీ కాదు. ఇవి ఎప్పుడైతే తీవ్రంగా మారతాయో అప్పుడే విడాకుల అంశం తెరపైకి వస్తుంది.

English summary

Think on these before taking divorce decision

If there are still feelings of love and affection then you should work on the relationship before deciding on divorce.
Story first published: Tuesday, May 26, 2020, 11:55 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more