For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వావ్..! విమానం గాల్లో తేలుతుండగానే లిప్ లా‘కింగ్‘.. వైరల్ అవుతున్న వెరైటీ వెడ్డింగ్ వేదిక..

వీరిద్దరూ ‘ఎయిర్ పోర్ట్ సిటీ‘ అనే ఓ ఆన్ లైన్ గేమ్ ద్వారా 2011లో మొదటిసారిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం సిడ్నీ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షంగా తొలిసారిగా కలుసుకున్నారు.

|

'ఆకాశమంత వేదిక.. భూదేవి అంత పందిరి' వేసి ఘనంగా జరిపించాలి వివాహం అని మనం సినిమాల్లో డైలాగ్ లను వింటూ ఉంటాం. తమ పెళ్లి గురించి పది తరాల వారు పది కాలాల పాటు గుర్తుండేలా ఓ మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కలల గంటున్నారు. ఒకప్పుడు మన పాత తరం పెళ్లి అంటే కనీసం ఐదు రోజుల పాటు జరిపేవారు.

ఇలాంటి సీన్లను సైతం వరుడు వంటి సినిమాలో చూసేశాం. కానీ గగన విహారం చేస్తూ.. భూమి, ఆకాశం మధ్య నల్లని మబ్బుల మధ్య గాల్లో తేలుతూ జరిగే వివాహం గురించి ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 34 వేల అడుగుల ఎత్తులో విమానమే వేదికగా ఒక్కటైన జంట గురించి విన్నారా? అయితే ఈ వీడియోలో చూడండి.. ఆ వివరాలన్నీ నిజమేనని మీరు కూడా నమ్ముతారు. ఇలాంటి వివాహం ప్రపంచంలోని ప్రప్రథమమని అందరూ నోరెళ్లబెడుతున్నారు. అలాగే వధూవరులు కూడా ఇద్దరు వేర్వేరు దేశాలకు చెందిన వారు. ఇంతకీ వారి దేశాలేంటి? వారి పేర్లేంటి అనే వివరాలను తెలుసుకునేందుకు ఈ స్టోరీని చూడండి...

ఆసీస్ - కివీస్..

ఆసీస్ - కివీస్..

curtosy

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన కాథీ మరియు డేవిడ్ తాము రెండు దేశాల మధ్య వివాహం చేసుకోవాలి అనుకుంటున్నామని ఎయిర్ లైన్స్ కు చెప్పారట. అది వారి కల అని, వారికి సహాయం చేయమని కోరారట. ప్రపంచంలోనే ఇలాంటి వివాహం మొట్టమొదటిది అని నమ్మిన ఎయిర్ లైన్స్ వారి కలను నిజం చేసేందుకు సహాయపడ్డారు.

34,000 అడుగుల ఎత్తులో..

34,000 అడుగుల ఎత్తులో..

వీరిద్దరూ ఏకమయ్యేందుకు ఎంచుకున్న వేదికకు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, విమానయాన సిబ్బంది చేరుకున్నారు. అలా అందరూ విమానంలో చేరుకున్నాక విమానం గాల్లోకి ఎగిరింది. అది అలా భూమి నుండి 34 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న సమయంలో.. అది కూడా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ దేశాలకు సరిగ్గా మధ్యలో చేరుకున్నాక వారందరి సాక్షిగా వారు రింగులు మార్చుకున్నారు.

PC : FB

ఇలా కలిశారు ఈ ఇద్దరు..

వీరిద్దరు ఎలా కలిశారో తెలిస్తే మనకు తెలుగులో ప్రభాస్ నటించిన ఓ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్. అందులో ప్రభాస్, తాప్సీలు కూడా ఇలాగే కలుస్తారు. ప్రేమించుకుంటారు. కానీ వారు చివరివరకు కలిసి ఉండలేకపోతారు. కానీ కివీస్ కు చెందిన క్యాథీ, ఆసీస్ కు చెందిన డేవిడ్ తొలిసారిగా ఓ గేమ్ ద్వారా కలుసుకున్నారు.

ఎయిర్ పోర్ట్ సిటీ..

ఎయిర్ పోర్ట్ సిటీ..

వీరిద్దరూ ‘ఎయిర్ పోర్ట్ సిటీ‘ అనే ఓ ఆన్ లైన్ గేమ్ ద్వారా 2011లో మొదటిసారిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం సిడ్నీ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షంగా తొలిసారిగా కలుసుకున్నారు. అలా వీరిద్దరిది ‘లవ్ ఫర్ ఏవియేషన్‘ గా మారిపోయింది.

ప్రపంచమే గుర్తుంచుకునేలా..

ప్రపంచమే గుర్తుంచుకునేలా..

ఈ క్రమంలోనే వీరి పెళ్లిని ప్రపంచమంతా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ తొలి పరిచయానికి కారణమైన ‘ఏవియేషన్‘నే వివాహ వేడుకలో భాగస్వాములుగా చేయాలని భావించారు. ఇందుకోసం జెట్ స్టార్ ఎయిర్ వేస్ అనుమతి సైతం తీసేసుకున్నారు. ఆ తర్వాత సిడ్నీ నుండి ఆక్లాండుకు బయలుదేరిన సమయంలో అందరి సమక్షంలో పెళ్లి ప్రమాణం చేసుకున్నారు.

ముద్దులు సైతం..

ముద్దులు సైతం..

ఈ జంట విమానంలో రింగులు మార్చుకున్నాక.. తదుపరి ముఖ్యమైన ఘట్టాన్ని కూడా అక్కడే కానిచ్చేశారు. అందరి మధ్యనే ముద్దుల్లో మునిగిపోయారు. లిప్ టు లిప్ కిస్ లిచ్చుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను ఫేస్ బుక్ పేజీలో జెట్ స్టార్ ఎయిర్ వేస్ పోస్ట్ చేసింది. ఇది కాస్త బాగా వైరల్ అయిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ ప్రేమ పక్షుల కల నిజమైనందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని శుభాకాంక్షలు చెబుతున్నారు.

English summary

Love In the Air : This couple with love for aviation ties knot 37,000 feet in the air

Here we talking about couple with love for aviation ties knot 37,000 feet in the air. Read on
Desktop Bottom Promotion