For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు శృంగారంలో ఉన్నపుడు మీ పిల్లలు చూస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసా..

శృంగారం అనేది చెడు విషయం కాదు. అందువల్ల ప్రతికూల భావోద్వేగాలను అస్సలు శృంగారంతో ముడిపెట్టకూడదు. ఆ పరిస్థితిలో మీ పిల్లలు మిమ్మల్ని చూసిన క్షణం, మీరు పరిస్థితిని తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది.

|

మీరు మరియు మీ భాగస్వామి లవ్ మేకింగ్ సెషన్ ను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. మీ పిల్లలు నిద్రపోతున్నారని లేదా వేరే వాటితో చాలా బిజీగా ఉన్నారని మీరు కన్ఫార్మ్ చేసుకున్నారు. మీరు అన్నింటినీ మూసివేశారు. చివరగా, మీరిద్దరు మాత్రమే మీ గదిలో ఉన్నారు. మీ భాగస్వామిని కౌగిలిలో బంధిస్తున్నారు. మీరు మరియు మీ భాగస్వామి ఒకరి తర్వాత ఒకరు రోమాన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మీరింకా ఉద్వేగభరితమైన క్షణాన్ని కలిగి ఉన్నారు.

Tips To Handle If Your Child Walks In While You Are Having Sex

మీరు మీ శృంగార ఆనందాన్ని అనుభవిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా మీకు ఎవరో అంతరాయం కలిగించారు. మీ పిల్లలు మీ గదిలోకి నడుచుకుంటు వచ్చేశారు. అపుడు ఒక్కసారిగా మీకేమీ చేయాలో అర్థం కాదు. మీ మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు. వారేమి అడుగుతారు. మేమేమి చెప్పాలో అని. అప్పుడు మీకు అనిపించొచ్చు. ఇప్పుడు మీ పిల్లలు "మీరు ఏమి చేస్తున్నారు" అనే ప్రశ్న అడిగితే మీ మదిలో మాటలు తక్కువగా ఉండవచ్చు. మీ పిల్లలకు అప్పుడు ఏమి చెప్పాలో తెలియకపోవచ్చు. బాగా ఇబ్బందికరమైన ఈ క్షణాన్ని అధిగమించేందుకు మీరు ఈ కింది సూచనలను పాటిస్తే మార్గం సుగమం కావచ్చు.

1. మీ పిల్లలను తిట్టొద్దు..

1. మీ పిల్లలను తిట్టొద్దు..

మీరు శృంగారంలో ఉన్నప్పుడు మీ పిల్లలు చూసిన వెంటనే వారిని తిట్టాల్సిన అవసరం లేదు. వారిని తిట్టడం లేదా మొరటుగా మాట్లాడటం వంటివి చేస్తే వారు ఏడుపును ప్రారంభిస్తారు. ఇలా మీరే వారి మానసిక స్థితిని డైవర్ట్ చేస్తారు. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండండి. మీరు వెళ్లి ఆడుకోమని వారితో చెప్పండి. తర్వాత మీరు ఆ ఆటలో చేరతామని చెప్పండి.

2. ప్రతికూల భావోద్వేగాలను తొలగించండి..

2. ప్రతికూల భావోద్వేగాలను తొలగించండి..

శృంగారం అనేది చెడు విషయం కాదు. అందువల్ల ప్రతికూల భావోద్వేగాలను అస్సలు శృంగారంతో ముడిపెట్టకూడదు. ఆ పరిస్థితిలో మీ పిల్లలు మిమ్మల్ని చూసిన క్షణం, మీరు పరిస్థితిని తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ప్రతికూల భావోద్వేగాలను చూపితే, మీరు ఏదో తప్పు చేస్తున్నారని లేదా సెక్స్ ఒక చెడ్డ పని అని మీ పిల్లలు అనుకుంటారు. కొత్త తల్లిదండ్రుల సంబంధ సమస్యలు పిల్లల ప్రవర్తనను చాలా ప్రభావితం చేస్తాయి.

3. మిమ్మల్ని మీరు కవర్ చేసుకోండి..

3. మిమ్మల్ని మీరు కవర్ చేసుకోండి..

మీ పిల్లలు మీ గదిలోకి వచ్చిన క్షణం మీరు ఇబ్బంది పడితే మీరు తర్వాత ఏమి చేయాలో లేదా ఏమి చెప్పాలో ఆలోచించకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా చేసే ముందు లేదా ఏదైనా చెప్పే ముందు మీరు మీ నగ్న శరీరాన్ని రహస్యంగా ఉంచాలి. అంటే ఏవైనా కప్పి ఉంచాలి. ఇది చాలా వరకు ఇబ్బందిని తగ్గిస్తుంది. ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి నగ్న శరీరాన్ని దాచడం వాస్తవానికి మంచి ప్రారంభం. దీని తర్వాత మీరు, మీ పిల్లలతో ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన ఉండదు.

4. ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉందని వారికి చెప్పండి..

4. ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉందని వారికి చెప్పండి..

అమ్మ, నాన్న ఒకరినొకరు ప్రేమను చూపించే మార్గం ఇది అని మీ పిల్లలకు మీరు చెప్పొచ్చు. "అమ్మ మరియు నాన్న ఒక ఆట ఆడుతున్నారు" అని చెప్పే బదులు, "ఇది తల్లి మరియు తండ్రి మధ్య మాత్రమే ఉండాలి అని మరియు మేము తప్పు చేయడం లేదు" అని మీరు మీ పిల్లలకు చెప్పవచ్చు.

5. అపరాధ భావన వద్దు..

5. అపరాధ భావన వద్దు..

దీని గురించి అపరాధ భావన అస్సలు వద్దు. మీరు ఒక క్షణం ప్రేమను కలిగి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మీ పిల్లలు మీ గదిలో నడిచారు. కాబట్టి, మీరు దాని అపరాధ భావంతో ఉండాల్సిన పని లేదు. మీ పిల్లలు మిమ్మలి్న ఈ విధంగా చూస్తారు. మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ అపరాధ భావంతో ఉండటం పరిష్కారం కాదు. ఇది మీ పిల్లల్ని నమ్మించేలా చేస్తుంది. మీరు నిజంగా ఏదైనా చేయరాని తప్పు లేదా తీవ్రమైన పని చేస్తున్నారనే అనుమానాలను రేకెత్తిస్తుంది.

6. చిన్న తీపి జ్ఞాపకంగా ఉండనివ్వండి..

6. చిన్న తీపి జ్ఞాపకంగా ఉండనివ్వండి..

ఆ సమయాన్ని చిన్న తీపి జ్ఞాపకంగా ఉండనివ్వండి. మీరు మీ పిల్లలకు ఏది వివరించినా దాన్ని చిన్నగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఇది ఒక ఆట లేదా అలాంటిదే అని చెప్పి వారిని కంగారు పెట్టొద్దు. ‘మనం ఐస్ క్రీమ్ తీసుకుందాం‘ లేదా ‘స్పాంజ్ బాజ్ చూద్దాం‘ అని చెప్పడం ద్వారా కూడా మీ పిల్లలను మీరు డైవర్ట్ చేయవచ్చు.

7. మీ తదుపరి సెషన్ గురించి జాగ్రత్తగా ఉండండి..

7. మీ తదుపరి సెషన్ గురించి జాగ్రత్తగా ఉండండి..

ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి సెషన్ కు మీరు మరియు మీ భాగస్వామి శృంగారంలో పాల్గొనేందుకు మీ తలుపును సరిగ్గా లాక్ చేశారో లేదో నిర్ధారించుకోండి. మీరు తలుపు లాక్ చేసి, మీ పిల్లలకు మీకు అవసరమని భావిస్తే, మీరు వారి వద్దకు వెళ్లే ముందు మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోవద్దు. లేదా మీ పిల్లలు పాఠశాలకు వెళ్లినప్పుడు లేదా ఇతర ప్రదేశాల్లో మీరు ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు.

English summary

Tips To Handle If Your Child Walks In While You Are Having Sex

If you are embarrassed the moment your children come into your room, you may not think about what to do or say next. So you have to keep your naked body a secret before you do anything or say anything. That means covering up any. This will greatly reduce the difficulty. Hiding a naked body to deal with this awkward situation is actually a good start. After this you will not have any problems with your children.
Story first published:Tuesday, August 27, 2019, 16:37 [IST]
Desktop Bottom Promotion