Latest Updates
-
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.!
కరోనా ఎఫెక్ట్ : యువ వైద్య జంట పెళ్లయిన కొన్ని గంటల్లోనే డ్యూటీలోకి...
అనుకున్న ముహుర్తానికే అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో పెళ్లి తంతును ముగించేశారు. అదే రోజు పెళ్లికూతురు ఇంట్లో కలిసి వేడుకలు కూడా ఘనంగా జరుపుకున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా విస్తరిస్తోందో అందరికీ తెలిసిందే. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కరోనా వైరస్ మరణాల పెరుగుదల మరియు పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోవడం అనే వార్తలను వింటూనే ఉన్నాం. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అంతేకాదు 70 వేల మందికి చనిపోయారంట. అయితే మన దేశంలో కూడా ఈ కరోనా వైరస్ మూడో స్టేజీలోకి ఎంటరైనట్లు తాజాగా ఎయిమ్స్ ప్రకటించింది. మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు చాప కింద నీరులా పెరిగిపోతున్నాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఇటీవలే పెళ్లి చేసుకున్న ఓ వైద్యుల జంట.. పెళ్లి పూర్తయి 24 గంటలు కూడా గడవక ముందే వారి డ్యూటీలోకి జాయిన్ అయిపోయారట. ఈ ఆదర్శ జంట ఎవరు? ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కొత్త జంట కానీ..
అమెరికాలో నివసించే యువ అమెరికన్ వైద్యులు కాశీఫ్ చౌదరి మరియు నైలా షెరీఫ్ ఇద్దరు తమ పెళ్లి కోసం ఎన్నో కలలుగన్నారు. అందుకు తగ్గట్టే కొన్ని రోజుల క్రితమే వారి పెళ్లి కోసం మంచి బట్టలను, జ్యువెలరీతో పాటు అన్నింటిని సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు పెళ్లైన వెంటనే హనీమూన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. టికెట్లను కూడా బుక్ చేసుకున్నారు. కానీ కరోనా వైరస్ వాని వ్యూహాలన్నింటినీ దెబ్బ తీసింది. దీంతో అన్నింటినీ వాయిదా వేసుకున్నారు.

యువ దంపతులకు ప్రశంసలు..
బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుందామనుకున్న వారి ఆశలకు కరోనా వైరస్ గండి కొట్టింది. అయితే వారు ఈ కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా పెద్దలు కుదిర్చిన ముహుర్తానికే, అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిఖా జరుపుకున్నారు. అదే రోజు వధువు ఇంట్లో వేడుకలు కూడా జరుపుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఆస్పత్రి నుండి ఫోన్ రావడంతో రాత్రికి రాత్రే డ్యూటీలో జాయిన్ అయిపోయారు. దీంతో ఈ యువ దంపతులను అందరూ ప్రశంసిస్తున్నారు.

డియో కాన్ఫరెన్సింగ్ ద్వారా..
37 ఏళ్ల వయసు ఉన్న కాశీఫ్ చౌదరి అయోవాలోని సెడార్ రాపిడ్స్ లోని మెర్సీ మెడికల్ సెంటర్లో కార్డియా ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. ప్రస్తుతం అతను డియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కరోనా రోగులను పరీక్షిస్తున్నాడు.

రెడ్ రోజ్..
ఈ విషయం గురించి వారు అతను ఇలా అన్నారు. ‘‘మేము పెళ్లి అయిన కొద్ది గంటల్లోనే విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పుకున్నాం. ఈ సమయంలో కొంచెం బాధపడ్డాం. విచారంగా ఉన్నాము. నేను ఆమెకు ఎర్రటి గులాబీని ఇచ్చాను‘ అని చెప్పాడు. ఆ తర్వాత తాను కూడా డ్యూటీలోకి జాయిన్ అయినట్టు చెప్పాడు.

మెడిసిన్ చీఫ్ రెసిడెంట్ గా..
అయితే నైలా షెరీఫ్ మాత్రం నివాసితుల సమూహాన్ని పర్యవేక్షించే ఇంటర్నల్ మెడిసిన్ చీఫ్ రెసిడెంట్ గా, ఆమె న్యూయార్క్ లోని వివిధ ఆస్పత్రుల ద్వారా తిరుగుతుంది. ఇది అమెరికా యొక్క కరోనా వైరస్ యొక్క వ్యాప్తికి కేంద్రంగా ఉంది. దీంతో ఆమె అప్పటి నుండి ఇప్పటి వరకు తీరిక క్షణం లేక పని చేస్తోంది.

గర్వపడుతున్నాం..
వీరిద్దరూ పెళ్లి చేసుకున్న కొద్ది గంటలకే తూర్పు, పడమరలా విడిపోయి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా యువ వైద్యుడు మాట్లాడుతూ ‘‘నేను ఆమె గురించి ఆందోళన చెందుతున్నాను.. అయితే ఆమె చేస్తున్న సేవ పట్ల నేను నిజంగా గర్వపడుతున్నాను‘‘ అని భావోద్వేగానికి గురౌతు చెప్పాడు.

ఇతరులకు ప్రేరణగా..
ఈ ఇద్దరు యువ వైద్యులు ప్రతిరోజూ సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాటింగ్ చేసుకుంటున్నారు. దీని వల్ల వీరు విడిపోయినట్లు అనిపించడం లేదట. కొంత అయినా తమకు ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో వీరు ఇలా చేసి ఇతరులకు ప్రేరణగా నిలిచారు.



Click it and Unblock the Notifications
