For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పద్ధతుల్లో పార్ట్నర్ తో రొమాన్స్ చేస్తే... ఎక్కువ టైమ్ ఎంజాయ్ చేయొచ్చట...!

|

ప్రేమ గురించి.. పెళ్లి గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా నిర్వచనం ఇస్తుంటారు. అయితే వివాహ బంధమైనా.. ప్రేమ బంధమైన ఇద్దరి వ్యక్తుల మధ్య అభిప్రాయాలు, అభిరుచులు మాత్రమే కాదు..

రొమాన్స్ కూడా ఉంటేనే వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. అయితే పెళ్లైన కొత్తలో లేదా ప్రేమలో ఉన్న ఉత్సాహం, కోరిక పిల్లలు పుట్టాక, కాలం మారుతున్న కొద్దీ ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది.

ఉద్యోగం, వ్యాపారం, పని ఒత్తిడి ఇంకా అనేక కారణాల వల్ల వైవాహిక బంధం నిరుత్సాహంగా మారిపోతూ ఉంటుంది. అయితే మీ రొమాంటిక్ లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.. అవేంటో మీరే చూడండి...

ఇలాంటి వ్యక్తులతో మీరు కలిసి జీవించడం అసాధ్యమని తెలుసా...ఇలాంటి వ్యక్తులతో మీరు కలిసి జీవించడం అసాధ్యమని తెలుసా...

టైం కేటాయించుకోండి..

టైం కేటాయించుకోండి..

మీరిద్దరూ ఎలాంటి రిలేషన్ షిప్ లో ఉన్నా.. మీ ఇద్దరి కోసం కొంత టైం కేటాయించుకోండి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి పడకగదిలో సరదాగా గడపడం వంటివి చేస్తే మీకు బోర్ కొడుతుంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు బయటకు వెళ్లడం చేయాలి. అలా చేస్తేనే మీ ఇద్దరి మధ్య ఆకర్షణ మరింత పెరుగుతుంది.

వారంలో ఒక్కసారైనా..

వారంలో ఒక్కసారైనా..

వారమంతా ఏదో పనుల్లో ఉండి ఇద్దరికీ ఏకాంతంగా గడిపే అవకాశం రాకపోవచ్చు. కానీ వారంలో కనీసం ఒకరోజైనా మీరిద్దరూ కలవాలి. ఒకరినొకరు గాఢంగా హత్తుకుని రోజంతా నిద్రపోయేలా ప్లాన్ చేసుకుంటే.. మీ పని ఒత్తిడి అంతా వెంటనే మాయమైపోతుంది. ఆరు రోజుల వరకు ఉన్న దూరం మీ ఇద్దరికీ ఆ ఒక్కరోజు మానసికంగా, శారీరకంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది.

లీవ్ పెట్టండి..

లీవ్ పెట్టండి..

మీకు మరీ బిజీ షెడ్యూల్ ఉంటే.. మీరిద్దరూ ఆనందంగా గడపాలని భావిస్తుంటే.. లీవ్ పెట్టేయండి. లీవ్ తీసుకున్న సమయంలో మీరిద్దరూ కలిసి బాగా రొమాన్స్ చేయాలని గుర్తు పెట్టుకోండి. అదే లక్ష్యంగా పెట్టుకోండి. అందుకే సిటీ కాలుష్యానికి దూరంగా ఎక్కడికైనా వెళ్లాలని ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్లి ఏకాంతంగా గడపండి.

సినిమాల్లో చూపే శోభనానికి.. నిజ జీవితంలో తొలిరాత్రికి మధ్య ఉండే తేడాలేంటో తెలుసా...సినిమాల్లో చూపే శోభనానికి.. నిజ జీవితంలో తొలిరాత్రికి మధ్య ఉండే తేడాలేంటో తెలుసా...

కోరికలు, అభిరుచులు..

కోరికలు, అభిరుచులు..

మీతో జీవితాన్ని పంచుకున్న వారి కోరికలు, అభిరుచులు, అలవాట్ల గురించి తెలుసుకోండి. మీకేమి ఇష్టమో వారికి తెలియజేయండి. మీరిద్దరూ ఇలాంటి ఆలోచనలను షేర్ చేసుకోవడంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదు. అయితే బ్లేమ్ గేమ్స్ వంటివి చేయొద్దు. మీ ఇష్టాలలో కొన్ని మీ భాగస్వామికి నచ్చకపోతే మీరు నిరాశపడొద్దు. అలాంటి విషయాలను నెమ్మదిగా చెప్పాలి.

ఇవి షేర్ చేసుకోండి..

ఇవి షేర్ చేసుకోండి..

మనం ఏ పని చేస్తున్నా ప్రతిదీ ప్రణాళిక బద్ధంగా చేస్తుంటాం. ప్రతి దానికీ ఓ టైమ్ టేబుల్ ఉంటుంది. అలాగే మీరిద్దరూ కలిసి ఆనందంగా గడిపేందుకు ఓ షెడ్యూల్ వేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదంటున్నారు నిపుణులు. మీరిద్దరూ ఇలా ప్లాన్ చేసుకుని ఆ కార్యంలో పాల్గొంటే అందులోని మాధుర్యమే వేరు. ముఖ్యంగా మీరు ప్లాన్ చేసుకున్న రోజున పొద్దున్న నుండే చాట్స్, ఎమోజీలు, మెయిల్స్ ద్వారా ఇద్దరూ మంచి ఎగ్జైట్మెంట్ పొందొచ్చు.

పర్సనల్ కేర్..

పర్సనల్ కేర్..

మీరిద్దరూ ఆ కార్యంలో ఆనందంగా గడపాలంటే.. ముందుగా మీరు పర్సనల్ కేర్ పై ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా మీరిద్దరూ ఆరోగ్యకరంగా ఉండేందుకు మీ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్ బాగుండాలి. హ్యాపీగా హెల్దీగా ఉండేవారి లైఫ్ కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటుంద. ప్రతిరోజూ మీరు వ్యాయామం చేస్తూ..మంచి పోషకాహారం తింటూ ఉండాలి. అప్పుడే మీ కోరికలు కూడా పెరుగుతాయి.

‘నా ప్రేయసి అందరితో అలా చేస్తోంటే అనుమానం కలుగుతోంది...'‘నా ప్రేయసి అందరితో అలా చేస్తోంటే అనుమానం కలుగుతోంది...'

ఈ పద్ధతుల్లో..

ఈ పద్ధతుల్లో..

భార్యభర్తలు లేదా ప్రేమికులు ఇద్దరిలో ఎవరికైనా కొన్నిసార్లు కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. అయితే నచ్చని విషయాల గురించి ఇద్దరూ కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మీరు మీ భాగస్వామికి నచ్చని పద్ధతిలో మీరు ప్రయత్నాలను చేయకపోవచ్చు. అయితే వారికి ఇష్టమైన పద్ధతిలో మీరు రొమాన్స్ చేసేందుకు ప్రయత్నించాలి.

ఒత్తిడిని తగ్గిస్తుంది..

ఒత్తిడిని తగ్గిస్తుంది..

మీరు ప్రతిరోజూ ఆ కార్యంలో పాల్గొంటే.. మీ బిజీ లైఫ్ లో ఎదురయ్యే ఒత్తిడిని కూడా తగ్గిపోతుంది. అంతేకాదు మీ గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇక మహిళల్లో అయితే పీరియడ్స్ సమయంలో పెద్దగా నొప్పి రాకుండా చేస్తుంది. మీకు యాంగ్జైటి వంటి సమస్యలు తగ్గించి మీకు ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేస్తుంది. ఇంకా మీ స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. మీ ఇద్దరికీ మొటిమలు కూడా తగ్గుతాయి. అంతేకాదు చర్మ సమస్యలన్నీ దూరమవుతాయి.

ఇలా హ్యాపీగా సెక్స్ లో పాల్గొనడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం.. అనుబంధం అనేది కచ్చితంగా బలపడుతుంది.

English summary

Ways to Be More Romantic in a Relationship

Here are the ways to be more romantic in a relationship. Take a look
Story first published: Wednesday, July 14, 2021, 15:30 [IST]