Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
మీ పార్ట్‌నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
సంబంధంలో మూడీ వ్యక్తితో వ్యవహరించడం సవాలుగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికీ వారి సొంత భావోద్వేగ ప్రయాణం, పోరాటాలు ఉన్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. మూడీ భాగస్వామిని ఎదుర్కోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
సంబంధం అంటే ఇద్దరూ కలిసి మెలిసి ఒకేమాటపై నిలబడాలి. ఒకేలాంటి కోరికలు, ఆశలు, ఇష్టాలు ఉండాలి. ఒకవేళ లేకపోయినా ఒకరి కోసం మరొకరు వాటిని ఇష్టపడగలగాలి. లేదా అడ్జస్ట్ అయినా చేసుకోవాలి. అలా కాకుండా ఒకరు ఎప్పుడూ మూడీగా ఉంటే మరొకరికి మూడ్ ఆఫ్ అయిపోతుంది. మూడీగా ఉండే వ్యక్తులతో సంబంధం కొనసాగించడం కూడా చాలా కష్టం. అప్పుడప్పుడు మూడీగా ఉండటం సాధారణమే కానీ ఎప్పుడూ అలాగే ఉండటం మరో జీవిత భాగస్వామిని అసంతృప్తికి గురి చేస్తుంది.

సంబంధంలో మూడీ వ్యక్తితో వ్యవహరించడం సవాలుగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికీ వారి సొంత భావోద్వేగ ప్రయాణం, పోరాటాలు ఉన్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. మూడీ భాగస్వామిని ఎదుర్కోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. మానసిక స్థితిని ప్రభావితం చేసేదేంటో తెలుసుకోవాలి
సమస్య ఏంటో తెలిస్తే దానికి పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. దంపతుల్లో ఒకరు మూడీ ఉంటే వారు అలా ఉండటానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. వారి మానసిక స్థితిని ఇబ్బంది పెడుతున్నదేమిటో గుర్తించాలి. భాగస్వామికి చికాకు తెప్పించే లేదా మానసిక స్థితిని చెడగొట్టే అంశం ఏమిటో కనిపెడితే దానిని పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు.

2. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు
మూడీ వ్యక్తితో సంబంధంలో ఉన్నట్లయితే దానికి మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి మానసిక స్థితికి మీరు అస్సలు బాధ్యులు కారు. మీరు ఏమీ చేయకపోయినా ఒక వ్యక్తి చెడు మానసిక స్థితిని కలిగి ఉండొచ్చు. అందువల్ల మీరు అపరాధం, చేదు అనుభూతిని ఆపాలి. మీ భాగస్వామి యొక్క చెడు మానసిక స్థితికి మీరే బాధ్యత వహించే బదులు మీ భాగస్వామికి మంచి అనుభూతిని కలిగించడానికి ఇతర పనులు ప్రయత్నించాలి.

3. మీ పార్ట్‌నర్ చెడు మానసిక స్థితిలోకి వెళ్లకుండా చూడాలి
మూడీ ఉండకుండా ఉండాలంటే అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. సాధారణంగా ఉండటానికి ప్రయత్నించాలి. దంపతుల్లో ఒకరు మూడీగా ఉంటే మరొకరు ఉత్సాహం నింపడానికి ప్రయత్నం చేయాలి. ఇద్దరూ మూడీగా ఉండటం వల్ల ఓనగూరె ప్రయోజనం ఏదీ లేదని గుర్తుంచుకోవాలి.

4. సరిహద్దులను సెట్ చేయాలి
మీ భాగస్వామి తరచుగా చెడు మానసిక స్థితిలో ఉన్నప్పుడు కూడా సరిహద్దులను నిర్వహించడం అవసరం. మీకు, మీ భాగస్వామికి మధ్య సరిహద్దులు అవసరమని గుర్తించండి. వాటి వల్ల ఎంతో ప్రయోజనం ఉందని తెలుసుకోవడం ముఖ్యం. దంపతుల్లో ఒకరు మూడీగా ఉంటే వారిని కొద్ది సమయం పాటు వదిలేస్తే వారు సెట్ అయిపోతారు. అలాంటి సమయాల్లో బౌండరీస్ విలువ అర్థం అవుతుంది.

5. ప్రేమ చూపించండి
మీ పార్ట్‌నర్ మూడీగా ఉంటే వారిని ఉత్సాహపరచడానికి చేయాల్సిందంతా చేశారు. అయినా వారు అలాగే మూడీగానే ఉన్నారనుకోండి. ఇంకేం చేస్తామని అనుకోకూడదు. చివరి ప్రయత్నంగా మీరెప్పుడూ చేసేది చేస్తే చాలు. అదే ప్రేమించడం. మీ భాగస్వామిని మీరెంతగా ప్రేమిస్తున్నారో చూపించండి. దాని ద్వారా అయినా వారు మారడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని బాధపెట్టకూడదన్న ఉద్దేశంతోనైనా ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

6. మీరెలా ఫీలవుతున్నారో చెప్పండి
మీ లైఫ్ పార్ట్‌నర్ మూడీగా ఉండటం వల్ల మీరెంతగా ఫీల్ అవుతున్నారో చెప్పాలి. వారి వల్ల మీరెంతగా బాధ పడుతున్నారో అర్థమయ్యేలా వివరించాలి. ఇద్దరూ కలిసి కూర్చుని సమస్య గురించి చర్చించాలి. దాని కారణం ఏమిటో తెలుసుకోవాలి. పరిష్కారమేమిటో చర్చించాలి.



Click it and Unblock the Notifications
