For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...

|

ఒకప్పుడు శృంగారం గురించి బయటకు మాట్లాడాలంటే చాలా భయపడేవారు. అదంతా నాలుగు గోడల మధ్య జరిగే పవిత్రమైన కార్యం అని భావించేవాళ్లు. అసలు ఆ విషయం గురించి బహిరంగంగా మాట్లాడాలంటే పెద్ద తప్పుగా భావించేవారు.

అయితే ఇప్పుడు మాత్రం శృంగారం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటున్నారు. చాలా మంది పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొని తెగ ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ ఉంటారు. అయితే పెళ్లి జరిగి కొన్ని నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా కొందరు మాత్రం ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతారు.

ఎందుకంటే పెళ్లైన కొత్తలో శృంగారంపై ఎక్కువ మోజు ఉంటుంది. ఎప్పుడు టైమ్ దొరుకుతుందామా.. ఎప్పుడు పార్ట్ నర్ తో ఎంజాయ్ చేద్దామా అని తెగ ఆరాటపడుతూ ఉంటారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఆ కార్యంపై చాలా మందికి ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది.

దీంతో కపుల్స్ మధ్య కలహాలు పెరిగి దూరం పెరుగుతుంది. అయితే అలా జరగకుండా మీ రిలేషన్ లో శృంగారంలో కాస్త స్పైసీ యాడ్ చేసుకుంటే మీ రొమాంటిక్ లైఫ్ అద్భుతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలంట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ ప్రత్యేక పద్ధతులు పాటిస్తే... మీ పార్ట్ నర్ ను ఈజీగా మూడ్ లోకి తీసుకురావొచ్చు...!ఈ ప్రత్యేక పద్ధతులు పాటిస్తే... మీ పార్ట్ నర్ ను ఈజీగా మూడ్ లోకి తీసుకురావొచ్చు...!

కోరికలు పెరగాలంటే..

కోరికలు పెరగాలంటే..

సాధారణంగా పెళ్లైన కొత్తలో భార్యభర్తలిద్దరూ కిస్ చేసుకోవాలని.. తమ భాగస్వామి ప్రైవేట్ పార్ట్ లు టచ్ చేయాలని.. దాని ద్వారా ఆనందం పొందాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఇదే సూత్రాన్ని నిరంతరం వాడుతూ ఉండాలట. మీకు టైం దొరికినప్పుడల్లా ప్రేమగా కిస్ చేయడం, భుజాలు, మెడ, చెవి వెనుకభాగంలో సుకుమారంగా తాకడం వంటివి చేస్తే ఎన్ని రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిచినా మీ ఇద్దరి మధ్య శృంగార బంధం బలంగా ఉంటుందట. అదే విధంగా కలయికలో పాల్గొనాలనే కోరికలు కూడా ఎక్కువగా కలుగుతాయట.

కొంచెం కొత్తగా..

కొంచెం కొత్తగా..

చాలా మంది కపుల్స్ కొన్ని సంవత్సరాల పాటు ఒకే యాంగిల్ లో శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. దీని వల్ల మీరు ఎన్ని రోజులు గడిచినా ఆ కార్యంలోని మజాను పొందలేరు. పైగా మీకు రొమాన్స్ అంటే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. దీని వల్ల మీ ఇద్దరి మధ్య ఆటోమేటిక్ గా దూరం పెరుగుతుంది. అయితే మీరు కొంచెం కొత్తగా, వినూత్నంగా అంటే డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేస్తే మీరు ఆ కార్యాన్ని బాగా ఆస్వాదిస్తారట.

రొమాంటిక్ డేట్..

రొమాంటిక్ డేట్..

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నుండి మినహాయింపులు దొరకడంతో చాలా మంది ఆఫీసులకు వెళ్లడం ప్రారంభించారు. దీంతో చాలా మందికి ఇంట్లో తమ భాగస్వామితో సరదాగా గడిపేందుకు సమయం దొరకడం లేదు. ఇలాంటి సమయంలో మీకెప్పుడైనా సెలవు దొరికితే.. లేదా మీరే సెలవు పెట్టి.. మీ భాగస్వామితో కలిసి సరదాగా రొమాంటిక్ డేట్ కు వెళ్లండి. అప్పుడు మీరంటే మీ పార్ట్ నర్ కు ఆటోమేటిక్ గా ప్రేమ పెరుగుతుంది. మీకు ఆ కార్యంలో పాల్గొనేందుకు పూర్తిగా సహకరిస్తుంది.

పెళ్లి తర్వాత సెక్స్ లైఫ్ గురించి ఎక్కువమంది అబద్ధాలే చెబుతారని మీకు తెలుసా...!పెళ్లి తర్వాత సెక్స్ లైఫ్ గురించి ఎక్కువమంది అబద్ధాలే చెబుతారని మీకు తెలుసా...!

ఎన్నో ఊహలు..

ఎన్నో ఊహలు..

మనలో చాలా మందికి శృంగారం గురించి ఎన్నో ఊహలు ఉంటాయి. వాటన్నింటినీ తమ భాగస్వామితో పూర్తి చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి వాటిని మీ పార్ట్ నర్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు చెప్పేసి వారితో ఆ కార్యంలో పాల్గొంటే, మీ ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాంటి టైమ్ లో మీ ఇద్దరూ ఆ కార్యాన్ని ఎక్కువగా ఆస్వాదించే ఛాన్స్ ఉంటుంది.

కలిసి చూడటం..

కలిసి చూడటం..

ఇటీవల కాలంలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ అలాంటి వీడియోలు చూడటం సర్వసాధారణమైపోయింది. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే.. మీరిద్దరూ కలిసి ఆ వీడియోలను చూడండి.. దీని వల్ల మీ ఇద్దరిలో కోరికలు పెరుగుతాయని ఓ సర్వేలో కూడా వెల్లడైంది. దీని వల్ల మీరు శృంగారంలో కావాల్సినంత మజా పొందుతారని ఆ అధ్యయనం స్పష్టం చేసింది.

English summary

Ways to Spice Up the Sex in Your Relationship in Telugu

Here are the ways to spice up the sex in your relationship in Telugu. Take a look