For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పార్ట్నర్ ఇతరుల మాయలో పడకూడదంటే... ఇలా ట్రై చేయండి...

|

మనలో పెళ్లయిన తొలి రోజుల్లో భార్యభర్తల మధ్య బంధంలో చాలా ఉత్తేజం, ఉత్సాహం ఉంటాయి. ముఖ్యంగా శోభనం గురించి ప్రతి ఒక్కరికీ ఎన్నో కలలు, ఊహాలు ఇంకా ఎన్నో ఉంటాయి. అన్నింటికంటే ముందు ఎక్కువగా కంగారు కూడా ఉంటుంది.

అయితే మెల్లమెల్లగా అన్ని అలవాటైపోతాయి. ఇదే సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగిపోతుంది. ఇలా తమ భాగస్వామి మీద ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. అది ఎంతలా అంటే.. తమ పార్ట్నర్ తో ఎవరైనా అమ్మాయి కాస్త క్లోజ్ గా మాట్లాడితే చాలు వారు ఏ మాత్రం తట్టుకోలేరు. ఎందుకంటే తమ పార్ట్నర్ కేవలం తమకు మాత్రమే సొంతం అనుకుంటారట. అందుకే ఇతర స్త్రీలు తమ శ్రీవారితో ఏమాత్రం చనువుగా నడుచుకున్నా అస్సలు సహించలేరట.

ఇలాంటి సమయంలో మీతో ఎవరైనా సరదాగా ఉండటం.. వారు మీకు సైట్ కొట్టడాన్ని చూస్తే ఇక అంతే సంగతులు.. మీ పార్ట్నర్ ను ఎవరైనా టెంప్ట్ చేసినా లేదా మీ శ్రీవారే తప్పటడుగు వేసే అవకాశం ఉందని తెలిస్తే.. ఆ బంధంలో చీలికలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యిందా? ఈ పరిస్థితులు మీకు రాకుండా ఉండాలంటే.. మీరు ఇలా ప్రయత్నించండి.. మీ పార్ట్నర్ ను ఇతరుల నుండి కాపాడుకోండి...

మన దేశంలో పెద్దలు చేసే పెళ్లి కంటే.. ప్రేమ పెళ్లిళ్లే సక్సెస్ అయ్యేందుకు గల ప్రధాన కారణాలివే...!

రెగ్యులర్ రొమాన్స్..

రెగ్యులర్ రొమాన్స్..

మీ పార్ట్నర్ కు ఇతరులపై మోజు పెరగకుండా ఉండాలంటే.. మీరు రెగ్యులర్ గా రొమాన్స్ చేయండి. అదే సమయంలో ఇలా మాట్లాడండి చాలు తను మీకు ఫిదా అయిపోతారు. తనని దగ్గరకు తీసుకుని కిస్ చేయమని అడిగేందుకు ఏమాత్రం సిగ్గుపడొద్దు. ‘నాకు ఎంతో సుఖాన్నిచ్చావ్.. ఇది కేవలం నీ వల్లే అవుతుంది' అనే మాటలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. అప్పుడు వారికి తమపై నమ్మకం లేకపోయినా మీ మాటలు విని మరింత రొమాంటిక్ మారే వీలుంటుంది.

మంచిగా ఉంటే..

మంచిగా ఉంటే..

ఇప్పటితరం మహిళల్లో చాలా మంది అమ్మాయిలు తమ పార్ట్నర్ పై ఎవరి కన్ను అయినా పడిందని తెలియగానే.. వెంటనే వారితో వాగ్వివాదానికి దిగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వారు మీపై ద్వేషాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అప్పుడు మీకు ఏదైనా కీడు చేయాలని భావించొచ్చు. కాబట్టి అలా చేయకండి. అలాంటి వ్యక్తులతో మంచిగా ఉండండి.. వారితో ఫ్రెండ్ షిప్ చేసి.. మీ పార్ట్నర్ పై మీకెంత ప్రేమ ఉందో తెలియజేయండి. మీరు మీ భాగస్వామిపై చూపే ప్రేమను బట్టి.. తను ఫీలింగ్స్ పెంచుకోవడం తప్పనే భావన కలిగించే ప్రయత్నం చేయండి. ఇలా మీరు వారితో క్లోజ్ గా ఉండటం వల్ల.. వారికి తప్పు చేస్తున్నామన్న విషయం గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా మంది తమ మనసు మార్చుకునే అవకాశం ఉంది.

ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా..

ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా..

మీ పార్ట్నర్ పై వేరే అమ్మాయిలు క్లోజ్ గా ఉండటం.. వారు మీ వారిపై అట్రాక్ట్ అవుతున్నారని.. మీ పార్ట్నర్ కూడా అందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిస్తే..మీరు వెంటనే ఆ విషయం గురించి అస్సలు ప్రస్తావించకండి. దాని వల్ల పరిస్థితులు చాలా క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు తనతో ఫైటింగ్ చేయడానికి బదులు.. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడేందుకు ప్రయత్నించాలి. మీ పార్ట్నర్ మనసులో ఇతరుల గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

స్త్రీ, పురుషులిద్దరూ పెళ్లికి ముందే ఈ విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతురాట...!

దూరం పెరగకుండా..

దూరం పెరగకుండా..

అదే సందర్భంలో మీ ఇద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. మీ రిలేషన్ షిప్ లో దూరం అనేది పెరగకుండా.. మీ బంధంలో ఎలాంటి చీలికలు రాకుండా ఉండాలంటే.. మీరు ప్రతి విషయాన్ని కూల్ గా డీల్ చేయాలి. ఇందుకోసం మీ పార్ట్నర్ తో కలిసి రెగ్యులర్ గా బయటకు వెళ్లడం వంటివి చేయాలి. అలా వీలు కాకపోతే కనీసం వారానికోసారి లేదా నెలకోసారైనా బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. అదే సందర్భంలో మీ ఇద్దరి మధ్య ఎవ్వరు రాకుండా జాగ్రత్త పడాలి.

నమ్మకం కోల్పోవద్దు..

నమ్మకం కోల్పోవద్దు..

తమ భాగస్వామి ఇతరులపై మోజు పెంచుకుంటున్నారని తెలిసిన వెంటనే చాలా మంది బంధం విషయంలో నమ్మకం కోల్పోతుంటారు. అయితే అలా చేస్తే.. మీకు మరింత నష్టం ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మీ పార్ట్నర్ ఇతరులను నిజంగానే ఇష్టపడుతున్నాడా? లేదా వారే బలవంతం చేస్తున్నారా అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ విషయంలో మీ భాగస్వామి తప్పు లేదని తెలిస్తే.. వారిపై నమ్మకంతో ఉండాలి.

హ్యాపీగా ఉండేలా..

హ్యాపీగా ఉండేలా..

మీ భాగస్వామిపై ఇతరుల విషయంలో అనుమానాలు, కోపం పెంచుకునే బదులు.. వారితో హ్యాపీగా గడిపేందుకు ఏం చేయాలనే విషయాలపై ఫోకస్ పెట్టాలి. వారితో కలిసి ఎలా గడిపితే.. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందో వారికి తెలిసేలా చేయాలి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి మిమ్మల్ని వదిలి ఉండలేరు. ఇతరుల మాయలోనూ పడరు.

English summary

What To Do If Someone Is Flirting With Your Partner in Telugu

Here we are talking about the what to do if someone is flirting with your partner in Telugu. Have a look
Story first published: Wednesday, December 8, 2021, 17:03 [IST]
Desktop Bottom Promotion