For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కారణాల వల్లే మగవారు వర్కింగ్ ఉమెన్స్ ను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారని మీకు తెలుసా..

|

మారుతున్న కాలానికి అనుగుణంగా మగవారి ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు మగవారు పెళ్లి చేసుకుంటే ఆడవారిని వంటింటికే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి ఒక్క మగాడు తమ అందమైన కుటుంబాన్ని పోషించేందుకు ఉద్యోగం చేసే అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. కొంతమంది మాత్రం చాలా అడ్వాన్స్ గా ఉంటున్నారు. తాము పని చేసే కార్యాలయాల్లోనే వారికి తగ్గ జోడిని వారే ఎంచుకుంటున్నారు.

తల్లిదండ్రులకు తలకు మించిన పనిని తగ్గించేస్తున్నారు. అంతే కాదండోయ్ అబ్బాయిలు తాము వివాహం చేసుకునే అమ్మాయిలో కొన్ని లక్షణాలను కోరుకుంటున్నారు. అందులో మొదటి లక్షణమే ఉద్యోగం చేసే మహిళను ఎన్నుకోవడం. మగవారు దీనికే ఎందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము పెళ్లి చేసుకునే అమ్మాయిల్లో ఇంకా ఏమేమి లక్షణాలు కోరుకుంటున్నారో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి. మీకు నచ్చితే మీరు వీటిని ఫాలో అవ్వండి. మీ నిండు నూరేళ్ల వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపండి. మీకు కింది కారణాలు నచ్చితే కామెంట్స్ చేయండి.

1) మీ పనిని బాగా అర్థం చేసుకుంటారు..

1) మీ పనిని బాగా అర్థం చేసుకుంటారు..

ఒక వేళ మీ భార్య కూడా పనికి లేదా ఉద్యోగానికి వెళ్తుంటే ఆమె మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. ఆఫీసులో ఉండే పని ఒత్తిడిని తట్టుకుని, మీరు ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని వారు అస్సలు విసిగించరు. సూటి పోటి మాటలతో మిమ్మల్ని వేధించరు. అది తేలేదే ఇది తేలేదే అని అలాంటివేమీ అడగరు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. అంతే కాదు ఆలస్యంగా వచ్చినా, ఇంటి పనులకు సహకరించలేక పోయినా వాటిపై గొడవలు పడకుండా లేదా కోపం తెచ్చుకోకుండా మీ మానసిక స్థితిని ఎలా పరిష్కరించుకోవాలో ఆమె చూసుకుంటుంది. ఇదే కాకుండా బ్యాంకులు, ఇంట్లో బిల్లులకు సంబంధించిన వంటి పనులను కూడా ఆమెనే పూర్తి చేస్తారు. మీకు పూర్తిగా శ్రమను తగ్గిస్తారు. ఎక్కువ బాధ్యత తానే తీసుకుంటారు.

2) బడ్జెట్ కు తగ్గట్టుగా..

2) బడ్జెట్ కు తగ్గట్టుగా..

ప్రస్తుతం మీ కుటుంబం మెట్రో సిటీలో నివసిస్తున్నా లేదా చిన్న పట్టణంలో నివసిస్తున్నా సరే పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా మీ ఖర్చులు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని తట్టుకునేందుకు అబ్బాయి లేదా అమ్మాయి వివాహం తర్వాత అద్భుతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటారు. అదే సమయంలో వారు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును సైతం కోరుకుంటారు. కుటుంబంలో ఒక్క సభ్యుడు మాత్రమే సంపాదిస్తూ అందరికీ అన్ని అవసరాలను తీర్చడం కొంచెం కష్టమవుతుంది. ఈ కారణంగా, అబ్బాయిలు తమ జీవిత భాగస్వామి పని చేస్తుంటే తమ ఇంటి బడ్జెట్ కు భారీ ఊరట లభిస్తుందని వారు ఆశిస్తున్నారు.

3) భవిష్యత్తు కోసం పొదుపు..

3) భవిష్యత్తు కోసం పొదుపు..

ప్రస్తుత కాలంలో ఆలుమగలు కలిసి పని చేస్తుంటేనే వారు తమ అవసరాలను తీర్చుకుంటారు. వారికి కావాల్సినవన్నీ అవలీలగా చేజిక్కుంచుకుంటారు. ఆ తర్వాత పిల్లల్ని కనడం, వారిని పెంచడంపైనా పొదుపు చేయడం ప్రారంభిస్తారు. దీని కోసం పెళ్లి అయిన కొద్దిరోజులకే దీని కోసం మంచి ప్రణాళిక వేసుకుంటారు. చాలా మంది అబ్బాయిలు పని చేసే అమ్మాయిలను వెతికేందుకు ఇదొక ముఖ్య కారణం అని చెప్పొచ్చు.

4) బయటి ప్రపంచంపై అవగాహన..

4) బయటి ప్రపంచంపై అవగాహన..

ఉద్యోగం చేసే చాలా మంది మహిళలు బయటి ప్రపంచంపై మంచి అవగాహన కలిగి ఉంటారు. వారిలో ఎక్కువ మంది ఓపెన్ మైండెడ్ తో ఉంటారు. వారు పని ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకుంటారు. దీంతో వారికి బయటి ప్రపంచంపై అవగాహన వస్తుంది. కాబట్టి వారికి పని చేసే చోట ఒక వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో వారికి తెలుసు. ఈ కారణంగా, ఆమె లేదా అతను తమ జీవిత భాగస్వామి కాల్స్ ను అనుమానించరు. లేదా వారు పనిచేసే వారితో కూడా మాట్లాడరు. భర్త లేదా భార్య ఏదైనా గందరగోళంలో ఉంటే, వారు వృత్తిపరంగా కూడా పరిష్కరించగలడు.

5) ఇద్దరికీ చాలా మంచిది..

5) ఇద్దరికీ చాలా మంచిది..

ఒక అమ్మాయి లేదా అబ్బాయి పని చేసే వారే అయితే వారి వివాహా సంబంధానికి అది చాలా మంచిదని వారు భావిస్తారు. ఎందుకంటే ప్రతి చిన్న దానికీ లేదా పెద్ద వాటికి సంబంధించిన ఖర్చులకు వారు భర్తపైనా లేదా భార్యపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. వారు తమ ఖర్చులకు సంబంధించి ఆందోళన కూడా చెందరు. ఆనందంగా జీవించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఒకవేళ తమకు కాబోయే భార్య ఉద్యోగం చేయకపోతే ఇంటికి సంబంధించినంత వరకు మాత్రమే కాకుండా వ్యక్తిగత ఖర్చుల కోసం కూడా ఆమె తన భర్తపై ఆధారపడాల్సి వస్తుంది. ఇదే మాదిరిగా భర్తల పరిస్థితి అలాగే ఉంటుంది.

English summary

Why Boys Prefer working Women For Marriage

With the dimension of family economics going through a sea change, a majority of men today prefer a working wife. Check out the other reasons why boys prefer working women.