For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?

కోడళ్లు తమ అత్తలను ఎందుకు ఇష్టపడరు, ఏయే విషయాల్లో వారి మధ్య గొడవలు జరుగుతుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

|

అత్తాకోడళ్ల మధ్య కలహాలు కామన్. ప్రతి ఇంట్లో జరిగేవే. కొట్టుకునేంత గొడవలు లేకపోయినా మూతీ, ముక్కు తిప్పుకోవడాలు ఉంటాయి. ఏదో ఒక చిన్న అంశంలోనైనా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయి చర్చ జరుగుతుంది. అది కాస్త గొడవకు దారి తీస్తుంది. చాలా ఇళ్లల్లో వేరు కాపురాలు పెట్టుకోవడం చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. మీ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ఒక ఐడియా ఉంటుంది. మరి ప్రతి ఇంట్లో అసలు గొడవలు ఎక్కడ మొదలవుతాయని ఎప్పుడైనా ఆలోచించారా.

Why daughter in laws dont like mother in laws in Telugu

కోడళ్లు తమ అత్తలను ఎందుకు ఇష్టపడరు, ఏయే విషయాల్లో వారి మధ్య గొడవలు జరుగుతుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Why daughter in laws dont like mother in laws in Telugu

1. అడ్జస్ట్ కావడానికి టైం ఇవ్వకపోవడం

కోడళ్లు పూర్తిగా భిన్నమైన వాతావరణం నుండి వస్తారు. వారు పెరిగిన వాతావరణం, కుటుంబ వాతావరణం వేరుగా ఉంటుంది. అలవాట్లు వేరేలా ఉంటాయి. ఆ అలవాట్లు అత్తగారికి నచ్చకపోవచ్చు లేదంటే అత్తగారింట్లో వాళ్లు వేరేగా ఉండొచ్చు. అడ్జస్ట్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. అలవాటు కాకముందే అలా చేయి, ఇలా చేయి అని అత్తలు పోరు పెడుతుంటే వాళ్లు నచ్చకుండా పోతారు.

కోడళ్లు అంటే అత్తలకు ఎందుకు ఇష్టముండదు? కారణాలేంటో తెలుసా? కోడళ్లు అంటే అత్తలకు ఎందుకు ఇష్టముండదు? కారణాలేంటో తెలుసా?

2. భర్తను చిన్నపిల్లాడిలా చూడటం

ప్రతి తల్లి ముందు పిల్లలు చిన్నవారే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే సామెత ఉంటుంది. అయితే పెళ్లైన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని తల్లికి చెప్పాలని కోరుకోవడం కోడళ్లకు నచ్చదు. ఇది దంపతుల మధ్య సంబంధంపై ప్రభావం చూపిస్తుంది.

పెళ్లి అయ్యాక కొన్నింటికి అడ్జస్ట్ కావాల్సిందే.. కాదు, లేదు అంటే కష్టమేపెళ్లి అయ్యాక కొన్నింటికి అడ్జస్ట్ కావాల్సిందే.. కాదు, లేదు అంటే కష్టమే


3. ప్రైవసీ ఇవ్వకపోవడం

దంపతులు ఎవరికైనా ప్రైవసీ చాలా చాలా ముఖ్యం. దంపతుల మధ్యలోకి వెళ్లాలని ఎప్పటికీ అనుకోవద్దు. ఈ విషయాన్ని కొంత మంది అత్తలు పట్టించుకోరు. నా కొడుకే కదా అనే ధోరణితో ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటారు. దీని వల్ల ప్రైవసీ లేదని కోడళ్లకు అనిపిస్తుంది.

4. గర్భవతి కావడానికి ఒత్తిడి చేయడం

పెళ్లి అయ్యేంత వరకు పెళ్లి చేయాలని, పెళ్లి చేశాక పిల్లలు కావాలని అత్తమామలు పోరు పెడుతుంటారు. పెళ్లి అయిన మొదటి నెల నుండే స్టార్ట్ చేస్తుంటారు. ఏదైనా విశేషమా అంటూ వెంట పడుతుంటారు. అయితే పెళ్లి అయ్యాక దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కొంత సమయం అవసరం. అలాగే పిల్లలు కనడానికి మానసికంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా ఏదైనా విశేషమా అని అడుగుతుంటే కోడళ్లకు కోపం వస్తుంది.

5. పెంపకం, కుటుంబం గురించి పదే పదే ప్రస్తావించడం

చాలా మంది కోడళ్లు ఒక మాట చెబుతుంటారు. మా అమ్మానాన్నలను, వారి పెంపకాన్ని నా కంటే మా అత్తగారే ఎక్కువగా గుర్తుచేసుకుంటారని. కొన్ని పనులు అత్తలు చేసినట్లుగానే కోడళ్లు చేయలేకపోవచ్చు, మరికొన్ని పనులు అసలు చేయడమే తెలియకపోవచ్చు.. అలాంటి సందర్భంలో మీ అమ్మానాన్నలు ఇలాగే పెంచారా, పెంపకం అంటే ఇలాగే ఉంటుందా అని అవమానించడం వల్ల కోడళ్లు సహనం కోల్పోతారు.

6. వంటగదే యుద్ధభూమి

రోజూ ఏయే వంటకాలు చేయాలనే విషయంలో, రుచి విషయంలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొందరు ఉప్పు ఎక్కువగా తింటే మరికొందరు తక్కువగా తింటారు. ఇలా మొదలైన గొడవలు ఇతర అంశాలకూ పాకుతుంటాయి.

English summary

Why daughter in laws don't like mother in laws in Telugu

read this to know Why daughter in laws don't like mother in laws in Telugu
Story first published:Wednesday, January 25, 2023, 16:36 [IST]
Desktop Bottom Promotion