For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్ని బాధలున్నా బతుకు జట్కా బండిని భారంగా ఎందుకు కొనసాగిస్తున్నారంటే...

|

మన దేశంలో వివాహ బంధం అంటే చాలా పవిత్రంగా భావిస్తారు. అది ప్రేమ పెళ్లి అయినా... పెద్దలు కుదిర్చినా పెళ్లి అయినా కొద్దిరోజులు చాలా ఆనందంగా గడుపుతారు. అయితే రాను రాను చాలా మంది జంటలు తమ వివాహ బంధాన్ని బలంగా మార్చుకోవడం పోయి బలహీనంగా మార్చుకుంటున్నారు. కొందరు చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు.

అయితే అలాంటి చిన్న గొడవలే చిలికి చిలికి గాలి వాన.. జడివానలా మారిపోయి.. ఏకంగా విడిపోయేంత వరకు తెచ్చుకుంటారు. మరికొందరు మాత్రం తమ రిలేషన్ షిప్ లో హ్యాపీ అనే పదం లేకపోయినా కూడా టాక్సిక్ రిలేషన్ షిప్ లోనే కొనసాగుతూ కాలం గడిపేస్తూ ఉంటారు.

అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది. చాలా మంది అమ్మాయిలు తమ సంబంధం గురించి తమ దారం అక్కడి వరకే అన్న విధంగా పరిమితంగా ఉండిపోతున్నారు?

తమకు నరకప్రాయంగా ఉన్న సంబంధం నుండి బయట రాలేకపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో అనే ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ కచ్చితంగా దొరుకుతాయని మేము ఆశిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం ఆ సమాధానాలేంటో చూసేయండి మరి.

పిల్లల వల్లే...

పిల్లల వల్లే...

చాలా మంది జంటలు తమ రిలేషన్ విషయంలో సంతోషంగా లేకపోయినప్పటికీ, అదే సంబంధంలో కొనసాగేందుకు ప్రధానం కారణం తమ పిల్లలు. తమకు మగతోడు లేదా భర్త దూరంగా ఉండటం వల్ల తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న అనుమానమే వారిని ఇంకా అలాంటి రిలేషన్ షిప్ లో కొనసాగేలా చేస్తుంది.

ఈ కారణం వల్లనే..

ఈ కారణం వల్లనే..

భర్త నుండి విడిపోవడం వల్ల తమకు ప్రయోజనాలు కలిగినప్పటికీ.. తమ పిల్లలకు ఎలాంటి మేలు కలగదని భావిస్తుంటారు. అందుకే సంబంధంలో ఎంత నరకప్రాయంగా ఉన్నప్పటికీ చాలా మంది మహిళలు టాక్సిక్ రిలేషన్ షిప్ నుంచి బయటకు రాలేకపోతున్నారు.

ఎగతాళి చేస్తారని..

ఎగతాళి చేస్తారని..

తాము విడాకులు తీసుకోవడం వల్ల తోటి పిల్లలు తమ చిన్నారులను ఎగతాళి చేస్తారేమో అనే కారణం వల్ల కూడా వీరు ఇలాంటి రిలేషన్ షిప్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారట.

అమ్మాయిల తప్పునే..

అమ్మాయిల తప్పునే..

మన దేశంలో ఆనాటి నుండి నేటి ఆధునిక యుగం వరకు మనం అమ్మాయిల గురించి అనేక విషయాలను వింటూనే ఉంటాం. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి పని చేయకూడదు.. కేవలం ఇంటి పని వంటివే చేయాలి అని చెబుతూ ఉంటారు. దీని వల్లనే మీరు చాలా మంది శారీరక, మానసిక హింసను ఎదుర్కొంటున్నప్పటికీ ఆ బంధం నుండి బయటకు రాలేకపోతున్నారు. ఒకవేళ విడాకులు తీసుకుంటే తనదే తప్పు అని వేలెత్తి చూపుతారు.. అంతేకాదు నలుగురిలో తనను తక్కువ చేసి మాట్లాడతారని భావన చాలా మందిలో ఉంది.

విడాకులిస్తే విలువ తగ్గిపోతుందని..

విడాకులిస్తే విలువ తగ్గిపోతుందని..

అంతే కాదు చాలా మంది మహిళలు తమ భర్తకు విడాకులిస్తే సొంత తల్లిదండ్రులే తమకు విలువను ఇవ్వరని, తమ విలువ సమాజంలో తగ్గిపోతుందని, భర్తను వదిలేస్తే తమ తల్లి దండ్రుల పరువు ఏమవుతుందని అనే భావన వల్ల వారు టాక్సిక్ రిలేషన్ షిప్ నుండి స్వేచ్ఛ ప్రపంచంలో కి రాలేకపోతున్నారు.

ఒంటరిగా ఉండటం కంటే..

ఒంటరిగా ఉండటం కంటే..

చాలా మంది మహిళల్లో ఇలాంటి ఆలోచనలు రావడానికి మన భారత సమాజమే కారణం. భర్త నుండి విడిపోయి ఒంటరిగా ఉన్న మహిళను నేరుగా కామెంట్లు చేయడం.. సూటిపోటి మాటలతో వేధించడం అనేది మన చుట్టుపక్కల సాధారణంగా జరిగే అంశమే. ఆ అవమానాన్ని తట్టుకునే కంటే తమ భర్తతో నరకాన్ని అనుభవించడమే మేలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

అనుమానమే పెనుభూతంగా..

అనుమానమే పెనుభూతంగా..

నేటి ఆధునిక సమాజంలో కూడా మహిళలంగా చాలా మంది పురుషులకు చిన్నచూపు ఉంది. ఆ ప్రభావం ఎక్కువగా తాళి కట్టిన భార్యపైనే ఉంటుంది. అందుకే చీటికి.. మాటికి భార్యను అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారు తమ భార్యను నాలుగు గోడల మధ్యన అవమానించడమే కాకుండా.. నలుగురిలోనూ ఇలాగే ప్రవర్తిస్తారు.

భర్త మారతాడనే ఆశతో..

భర్త మారతాడనే ఆశతో..

అయితే ఇలాంటి సందర్భాల్లో చాలా మంది మహిళలు ఎంతో ఓపికగా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు వారికి ఇలాంటి సంబంధం నుండి బయట పడితే బాగుండనిపిస్తుంది. కానీ ''ఈరోజు కాకపోయినా.. రేపు అయినా నా భర్తలో మార్పు వస్తుంది. నన్ను అర్థం చేసుకుంటాడు‘‘ అనే ఆలోచనలతో వారు తమ వైవాహిక జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ఏదైనా అద్భుతం జరిగి తన భర్తలో మార్పు వస్తుందేమో అనే ఆశతో ఉంటారు.

సర్దుకుపోవడం..

సర్దుకుపోవడం..

ఇప్పటికీ మన భారతదేశంలో వివాహ బంధం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కాకుండా.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధంగానే భావిస్తారు. అందుకే ఆలుమగల పట్ల ఏవైనా గొడవలు వస్తే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారి గొడవల వల్ల ఎక్కువ ప్రభావం పడేది వారి పిల్లలు, తల్లిదండ్రులకే. అందుకే చాలా మంది సర్దుకుపోయే భావనతో ఉంటారు.

ఒంటరిగా ఉండేందుకు..

ఒంటరిగా ఉండేందుకు..

కొన్ని సంస్థలు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం అప్పటివరకూ అల్లారుముద్దుగా కలిసి ఉన్న పార్ట్ నర్ ను చిన్న గొడవతో విడిపోయి జీవితాన్ని కొనసాగించాలంటే చాలా మంది మహిళలకు భయం వేస్తుందట. అయితే ఇది పురుషుల్లోనూ వర్తిస్తుందట. ఆ భయం నుండి బయటపడటానికి తాము సంతోషంగా ఉండమని తెలిసినప్పటికీ తిరిగి తమ భాగస్వామితో కలిసి బతికేందుకు సుముఖత చూపుతున్నారట.

English summary

Why dont women get out of unhappy relationship

Here we talking about why don't women get out of unhappy relationship. Read on
Story first published: Friday, March 20, 2020, 16:07 [IST]