For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Marriage Tips: మీ మ్యారేజ్ లైఫ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే.. ఈ పదాలను రెగ్యులర్ గా చెప్పాలంట...!

మీ వివాహ జీవితం బలోపేతమయ్యేందుకు మీ భాగస్వామితో మాట్లాడాల్సిన మాటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో చాలా మంది జీవితాల్లో అనేక బంధాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికీ వివాహ బంధం ముఖ్యమైనది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు.

Words to say to your partner to strengthen your marriage in Telugu

ఇద్దరు వ్యక్తులు వివాహం అనే బంధంతో ఏడడుగులు వేస్తూ కొత్త జర్నీని ప్రారంభిస్తారు. వారిద్దరూ కలిసి ఈ సొసైటీకి ఒక కుటుంబాన్ని అందివ్వడం అనేది చాలా గొప్ప అంశం. అందుకే మన దేశంలో చాలా మందికి వివాహ బంధంపై మనకు ఉన్న నమ్మకం పెరుగుతూ ఉంటుంది.

Words to say to your partner to strengthen your marriage in Telugu

ఇప్పటికీ మన దేశంలో 90 శాతం మంది ప్రజలు వివాహ వ్యవస్థను బలంగా నమ్ముతారట. అంతేకాదు అలా విశ్వసించే వారంతా వాటిని తూ.చ తప్పకుండా పాటిస్తున్నారట. అయితే ఈ ఇటీవలి కాలంలో విడాకుల శాతం కూడా పెరుగుతోంది.

Words to say to your partner to strengthen your marriage in Telugu

ఈ నేపథ్యంలో మీ మ్యారేజ్ లైఫ్ ను బలంగా మార్చుకునేందుకు మీరు రెగ్యులర్ గా ఈ పదాలను వాడాలట. మీ భాగస్వామికి మీ మాటలతో కమ్యూనికేట్ చేయడం మరియు మీ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలేంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చూసేయ్యండి...

సర్వే! పెళ్లికాని ప్రసాదుల గురించి లోకం ఏమనుకుంటుందో తెలుసా...సర్వే! పెళ్లికాని ప్రసాదుల గురించి లోకం ఏమనుకుంటుందో తెలుసా...

‘దయచేసి’..

‘దయచేసి’..

ఈ పదాన్ని మన నిత్య జీవితంలో ఎన్నో చోట్ల వాడుతూ ఉంటాం. ఈ పదం మీరు మీ భాగస్వామికి ఎంత గౌరవం ఇస్తున్నారో తెలియజేస్తుంది. అంతేకాదు మీరు ఏది డిమాండ్ చేయడం లేదని సూచిస్తుంది. దీని వల్ల మీ ఇద్దరి మధ్య ఆప్యాయత భావాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

థ్యాంక్స్..

థ్యాంక్స్..

మీరు వివాహ జీవితాన్ని మంచిగా కొనసాగించాలంటే.. మీ పార్ట్ నర్ తో థ్యాంక్స్ అనే పదాన్ని రెగ్యులర్ గా వాడాలి. మీరు మీ భాగస్వామిని ఎంత ప్రోత్సహిస్తున్నారో అని తెలియజేందుకు ఈ ‘థ్యాంక్స్' అనే పదం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని మీ పార్ట్ నర్ కచ్చితంగా ప్రత్యేకమైన మరియు విలువైనదిగా భావిస్తారు.

‘నన్ను క్షమించు’

‘నన్ను క్షమించు’

మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు మీ భాగస్వామిపై ఆ నెపం నెట్టివేయకుండా.. మీరు నిజాయితీగా ‘నన్ను క్షమించండి' అంటే.. మీ భాగస్వామి కచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. క్షమించమని అడిగేందుకు ఏ మాత్రం మొహమాటపడొద్దు. మీ వినయ పూర్వక స్వభావం మీ భాగస్వామిని శాంత పరుస్తుంది.

‘అందంగా కనిపిస్తున్నావ్’..

‘అందంగా కనిపిస్తున్నావ్’..

ఈ లోకంలో పొగడ్తలకు పడిపోని వారు ఎవరూ ఉంటారు చెప్పండి. అందులోనూ అమ్మాయిలు అయితే మరీ సులభంగా పడిపోతారు. మీరు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచాలని భావిస్తే, వారిని అందంగా ఉన్నావంటూ పొగడండి చాలు.. ఇది వారిలో ఉత్సాహాన్ని పెంచి మీకు కావాల్సినవన్నీ చేసి పెడతారు. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

‘నువ్వు చేయగలవు’..

‘నువ్వు చేయగలవు’..

మీ వివాహ జీవితంలో ఇలాంటి పదాలు మీ వివాహ బంధాన్ని కచ్చితంగా బలోపేతం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు వారికిచ్చే ప్రేరణ వల్ల వారిలో విశ్వాసం చాలా సులభంగా పెరుగుతుంది. ముఖ్యంగా వారు ఏదైనా విషయంలో కష్టపడుతుంటే.. వారిని ప్రోత్సహించండి. ‘నువ్వు కచ్చితంగా చేయగలవు' అని వారిని ప్రేరేపించండి. వారు గెలిచిన తర్వాత వారిని అభినందించండి. దీంతో మీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగుతుంది.

మీ భాగస్వామి అభిప్రాయం..

మీ భాగస్వామి అభిప్రాయం..

మీ భాగస్వామిని ప్రతి విషయంలో అభిప్రాయం అడిగితే.. వారు దాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. మీరు దాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. తీసుకోకపోయినా అనవసరం. మీరు ఏదైనా విషయంపై ‘నీ అభిప్రాయం కావాలి' అని అడిగితే చాలు... మీతో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. కాబట్టి ఎల్లప్పుడూ మీ పార్ట్ నర్ ను అన్ని విషయాల్లో అభిప్రాయాలను అడగడం మరచిపోవద్దు.

నీకు గుర్తుంటే చాలు..

నీకు గుర్తుంటే చాలు..

‘నేను నీకు గుర్తుంటే చాలు. నువ్వు తప్ప నన్ను ఎవరు మరచిపోయినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే కొన్నిసార్లు నేను మిస్ అవుతున్నాను అని చెబితే చాలు వారు మీకు ఫిదా అయిపోతారు.

‘నిన్ను క్షమిస్తున్నాను’

‘నిన్ను క్షమిస్తున్నాను’

మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పొరపాటు అనేది చేస్తూ ఉంటారు. అయితే అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటే బెటర్. అలాగే మీ వివాహ జీవితంలో సర్దుకుపోవడం అనేది చాలా కీలకం. మీ పార్ట్ నర్ ఏదైనా పొరపాటు చేస్తే.. మీరు మనస్పూర్తిగా ‘నేను నిన్ను క్షమిస్తున్నాను' అని ఒక మాట చెబితే చాలు.. వారు మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తారు. అందుకే ఏదైనా చిన్న గొడవ జరిగితే వారు మిమ్మల్ని క్షమించమని అడిగితే మీరు తప్పకుండా దానిని అంగీకరించండి

English summary

Words to say to your partner to strengthen your marriage in Telugu

Here we are talking about the Words to say to your partner to strengthen your marriage in Telugu. Read on
Desktop Bottom Promotion