For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Grandparents: పిల్లలకు తాత, నానమ్మలు ఎందుకు కావాలి?

గ్రాండ్ పేరెంట్స్ అలాగే పిల్లల మధ్య ఎమోషనల్ బంధం ఉంటుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ఇది పిల్లలు అన్ని రకాలుగా ఎదగడానికి ఉపకరిస్తుందని తేల్చాయి.

|

Grandparents: తాతలు, అమ్మమ్మలు, నానమ్మలకు.. పిల్లలకు ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి మధ్య ఉండే అనుబంధం ముచ్చట గొలుపుతుంది. మనవళ్లు, మనవరాళ్లను వారు చూసుకునే విధానం ముచ్చటేస్తుంది.వారు అల్లరి చేస్తే చాలా ఆనందపడతారు. వారితో కబుర్లు చెబుతారు. వారు చెప్పేది మొత్తం వింటారు. వారికి చిన్న గాయమైనా వారికే తగిలినంత బాధ పడిపోతుంటారు. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ తప్పక ఉండాలని చాలా మంది చెబుతుంటారు. తల్లిదండ్రుల నుండి చిన్న దెబ్బ కూడా పడనివ్వకుండా అడ్డుకుంటారు.

ఎమోషనల్ బంధం

ఎమోషనల్ బంధం

గ్రాండ్ పేరెంట్స్ అలాగే పిల్లల మధ్య ఎమోషనల్ బంధం ఉంటుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ఇది పిల్లలు అన్ని రకాలుగా ఎదగడానికి ఉపకరిస్తుందని తేల్చాయి. వారి మధ్య ఉండే బాండింగ్ వల్ల ఇద్దరికీ ఎంతో ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. చిన్న పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ, ఆడుకునే వృద్ధుల్లో వృద్ధాప్యం వల్ల వచ్చే కొన్ని సమస్యలు ఆలస్యంగా కనిపిస్తాయట. పిల్లలు కొత్త విషయాలను నేర్చుకునేందుకు వృద్ధులు ఎంతో సాయం చేస్తారట. అలాగే మనవళ్లకు వృద్ధులు మానసిక మద్దతు అందించడానికి తాతలు, నానమ్మలు సహాయం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. వారు పెరిగి పెద్దయ్యే వరకు వారికి అవసరమైన సాంగత్యాన్ని అందిస్తారు.

పిల్లలకు తాతలు, నానమ్మలు ఎందుకు అంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలకు తాతలు, నానమ్మలు ఎందుకు అంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సురక్షితంగా ఉన్నామన్న భావన కలిగిస్తారు

* కష్ట సమయాల్లో తాతలు, నానమ్మలు అదనపు మద్దతునిస్తారు. దీని వల్ల పిల్లల జీవితం గణనీయంగా ప్రభావితం అవుతుంది.

* రీసెర్చ్‌గేట్ జర్నల్ ప్రకారం.. యుక్తవయసులో గ్రాండ్ పేరెంట్స్, మనవళ్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నట్లు తేలింది. వీరిలో ప్రవర్తన, భావోద్వేగాలు, తోటి-సంబంధాల సమస్యలు తక్కువగా ఉంటాయి.

* పిల్లలు తమ తాతముత్తాతలతో సులభంగా మాట్లాడగలుగుతారు. వారి పోరాటాలు మరియు సమస్యలను చర్చించడం దీనికి కారణం కావచ్చు.

2. మంచి సలహాలు ఇస్తారు

2. మంచి సలహాలు ఇస్తారు

* తాతలకు ఎంతో అనుభవం ఉంటుంది. వారు ఎన్నో అనుభవించి ఆ స్థాయికి చేరుకుని ఉంటారు. జీవితంలో ఎత్తుపల్లాలు తెలిసిన వ్యక్తులు. కష్టనష్టాలు అనుభవించి ఉంటారు. వాటి నుండి వారికి ఎంతో అనుభవం వస్తుంది. జీవితంలో ఎలా పోరాడాలో తెలిసి ఉంటుంది. వారి అనుభవాన్ని మనవళ్లకు అందిస్తారు. ఏదైనా సమస్య ఎదురైతే ఎలా ఎదుర్కోవాలా చెబుతారు. కష్టం వస్తే దానిని దాటడం ఎలాగో వివరిస్తారు.

* తల్లిదండ్రులు తమ పిల్లలకు సలహాలు అవసరమైనప్పుడు వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ వారు ఉండే బిజీ వల్ల పిల్లలను పట్టించుకోకపోవడం చూసే ఉంటాం.

* అలాంటి సందర్భాల్లో నానమ్మలు, తాతలు సాయం చేస్తారు. తమ అనుభవాన్ని రంగరించి వారికి సలహాలు ఇస్తారు.

3. పిల్లల సంరక్షణలో సహాయం చేస్తారు

3. పిల్లల సంరక్షణలో సహాయం చేస్తారు

* పిల్లల సంరక్షణ గురించి తల్లిదండ్రులకు పెద్దగా తెలిసి ఉండదు. అలాంటి సమయాల్లో నానమ్మలు సాయం చేస్తారు. జలుబు, దగ్గు వస్తే ఆస్పత్రికి పరుగెత్తకుండా.. ఇంట్లోనే కషాయం ఎలా తయారు చేయాలో చెబుతారు. అలసటగా ఉంటే ఎలా ఉత్సాహపరచాలో వారికి తెలిసి ఉంటుంది. ఇలా చాలా సందర్భాల్లో గ్రాండ్ పేరెంట్స్ ఎంతో సాయం చేస్తారు.

* తాతలు, నానమ్మలతో పిల్లలు వినోదాన్ని పొందుతారు. ఆటలు నేర్చుకుంటారు. పాటలు పాడతారు. కథలు చదువుతారు. డ్రాయింగ్ వేస్తారు. ఇలా మనవళ్లు ఏది చేసినా వారు చాలా మద్దతుగా ఉంటారు. ఎక్కడా నిరుత్సాహానికి గురి కాకుండా చూసుకుంటారు.

* జీవితాంతం అవసరం అయ్యేలా చాలా విషయాలు వారు పిల్లలకు చెబుతుంటారు.

4. పిల్లలు చెప్పేది శ్రద్ధగా వింటారు

4. పిల్లలు చెప్పేది శ్రద్ధగా వింటారు

* చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పేది సరిగ్గా వినరు. వారు అలాగే ఏదో ఒకటి చెబుతుంటారని వారిని పట్టించుకోరు.

* కానీ తాతమ్మలు పిల్లలు చెప్పేది ఎంతో శ్రద్ధగా వింటారు. వారు చెప్పే చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారు.

* వారు చెప్పే వాటి నుండి ప్రశ్నలు అడగడం.. మరింత సమాచారం అడగడం చాలా మంది చూసే ఉంటారు.

* స్కూల్ లో ఏదైనా జరిగినా వారు తల్లిదండ్రులతో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు వినని పక్షంలో పిల్లలు వెంటనే గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పరిగెడతారు.

5. నైతిక విలువలను పెంపొందించడం

5. నైతిక విలువలను పెంపొందించడం

* పిల్లలు పెరుగుతున్న వారికి కొన్ని విలువు నేర్పాలి. అవి వారు మెరుగైన జీవితం గడపడానికి ఉపయోగపడతాయి. ఈ విలువలు నేర్పడంలో తల్లిదండ్రుల కంటే కూడా తాత, నానమ్మలే ముందు ఉంటారని పలు అధ్యయనాల్లే తేలింది.

* సానుభూతి, దయ, స్వీయ-అవగాహన యాక్సప్టెన్స్ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ నుండే నేర్చుకుంటారట.

* వీటి గురించి తాతమ్మలు తరచూ చెప్పడం ద్వారా అవి పిల్లల్లో నాటుకుపోతాయి. అవి పిల్లలు పెద్దవారు అయ్యే కొద్దీ బయట పడుతుంటాయి.

* నైతిక విలువలు, ఇచ్చిపుచ్చుకోవడం, మనకున్న దానిని ఇతరులతో పంచుకోవడం అనేవి మంచి అలవాట్లుగా ప్రతి ఒక్కరూ చెబుతుంటారు.

English summary

Reasons Why Your Kids Needs Their Grandparents in telugu

read on to know Reasons Why Your Kids Needs Their Grandparents in telugu
Story first published:Thursday, July 21, 2022, 17:15 [IST]
Desktop Bottom Promotion