For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Alcohol effects: ఆల్కహాల్ సంబంధాలను ఎలా నాశనం చేస్తుందంటే..

|

Alcohol effects: మద్యం సేవించడాన్ని ఈ మధ్య కాలంలో ఎవరూ పెద్ద తప్పుగా చూడటం లేదు. మందు తాగడం సర్వసాధారణం అయిపోయింది. ప్రత్యేక కార్యక్రమాల్లో విందు పానీయంగా మద్యం తీసుకోవడాన్ని చాలా మంది తప్పుగా చూడటం లేదు. కానీ మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకుంటే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాగే సంబంధాలపైనా ప్రభావం పడుతుంది.

చెడు ప్రభావాల గురించి తెలిసినా తాగడం ఆపరు:

చెడు ప్రభావాల గురించి తెలిసినా తాగడం ఆపరు:

మద్యం మహా చెడ్డది. దానిని పరిమితంగా తీసుకుంటే కిక్కు ఇస్తుంది. మజాగా ఉంటుంది. కానీ ఆ కిక్కు మరింత మందు తాగమని ప్రోత్సహిస్తుంది. పరిమితి దాటి తాగితే మానసికంగా, ఆరోగ్యంగా చాలా ప్రభావాలు ఉంటాయి. చాలా మందికి మందు తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని తెలుసు అయినా.. మందు తాగడం మాత్రం ఆపలేరు. ఫ్రెండ్స్ పేరు చెప్పి లేదా ప్రత్యేక కార్యక్రమాల్లో, విందు వినోదాల మాటున మద్యం సేవిస్తుంటారు. కష్టం వచ్చినా, లాభం వచ్చిన మందు తాగి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఆల్కహాల్ వల్ల సంబంధాలు చెడిపోతాయి:

ఆల్కహాల్ వల్ల సంబంధాలు చెడిపోతాయి:

మద్యపానం చేసేవారు తమ ప్రియమైన వారి కంటే తమ ఆల్కహాల్ బాటిల్‌కు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వారు తమ సంబంధాలను ఎంతగా కోల్పోతారో గ్రహించలేరు. మద్యపానానికి బానిసగా మారిన వారు ఎవరూ చెప్పేది వినరు. మద్యం తాగొద్దు అని ప్రియమైన చెప్పడం వారికి చికాకుగా అనిపిస్తుంది. ఎందుకంటే వారి ఏకైక ప్రాధాన్యత తాగడం. వారికి ఎప్పుడు అదే ధ్యాస ఉంటుంది. రిలేషన్ షిప్ పై వారు దృష్టి పెట్టరు. భాగస్వామి పట్ల కాకుండా మద్యం పట్ల ఎక్కువ ప్రేమను, ఇష్టాన్ని చూపిస్తారు. ఇది పోనుపోను విడిపోవడానికి దారి తీస్తుంది. మద్యపానం వల్ల భార్యభర్తలు విడిపోవడం అనేది చాలా చోట్ల జరిగేదే.

మద్యంతో అన్నింటిపైనా ప్రభావం:

మద్యంతో అన్నింటిపైనా ప్రభావం:

మద్యపానాని బానిసగా మారితే కేవలం భాగస్వామి మాత్రమే కాదు.. తల్లిదండ్రులు, పిల్లలు, బంధుమిత్రులపై దాని ప్రభావం ఉంటుంది. మీరు తాగడం వల్ల వారిపై ప్రత్యక్షంగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ పరోక్ష ప్రభావం తప్పకుండా ఉంటుంది. మత్తులో లేనప్పుడు ఆ కుటుంబసభ్యులు ఏమంటారోనన్న భావన వారిలో ఉంటుంది. వారి నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇది క్రమంగా కుటుంబసభ్యులు, బంధువుల నుండి దూరం అవడానికి కారణం అవుతుంది.

మద్యం భావోద్వేగాలను ప్రలోభపెడుతుంది:

మద్యం భావోద్వేగాలను ప్రలోభపెడుతుంది:

తరచూ మద్యం సేవించే వారు విపరీతమైన ధోరణిలో ప్రవర్తిస్తుంటారు. చుక్క గొంతులో పడగానే వారి ధోరణి పూర్తిగా మారిపోతుంది. కుటుంబసభ్యులపై, భాగస్వామిపై కేకలు వేస్తారు. ఇంట్లో గొడవ చేస్తారు. భాగస్వామిని శారీరకంగా హింసిస్తారు. ఇది వారిలో విపరీతమైన భావనలను ప్రేరేపిస్తుంది. తాగిన వారి పట్ల తమ అభిరుచి మారుతుంది. పలు అధ్యయనాల ప్రకారం భాగస్వాముల్లో ఒకరు మద్యపానానికి బానిసలైతే.. ఆ ఇంట్లో హింస చెలరేగుతుంది.

అలాంటి వ్యక్తితో సంబంధ కష్టం:

అలాంటి వ్యక్తితో సంబంధ కష్టం:

కలిగి ఉండటం నిజంగా చాలా కష్టం, కానీ వారిని ప్రేమించడం మరియు శ్రద్ధ వహించడం అనేది రెండో వ్యక్తికి ఉన్న ఏకైక ఆశ. ఒకరు వారి థెరపిస్ట్ లేదా దేవదూత పాత్రను మారువేషంలో ఆడవలసి ఉంటుంది, అయితే మద్యపాన వ్యసనం ద్వారా ధ్వంసమైన సంబంధాన్ని కొనసాగించడానికి నిశ్చయమైన మద్దతు కీలకం కావచ్చు.

మద్యపానం వల్ల సర్వం కోల్పోతారు:

మద్యపానం వల్ల సర్వం కోల్పోతారు:

ఆల్కహాల్ కు బానిసగా మారితే అది భావోద్వేగ, మానసిక శక్తిని హరించి వేస్తుంది. వ్యక్తిని ప్రపంచానికి అందుబాటులో లేకుండా చేస్తుంది. వ్యక్తి కూడా ఆర్థికంగా చితికిపోతాడు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతాడు. చాలా సమస్యలు వచ్చి పడతాయి. ప్రతి ఒక్కరూ నమ్మకాన్ని కోల్పోతారు.

క్యాన్సర్ బారిన పడతారు:

క్యాన్సర్ బారిన పడతారు:

ఒక అధ్యయనం ప్రకారం.. ఒక వారంలో 3 గ్లాసుల కంటే ఎక్కువ మద్యం తాగితే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయట. 5 నుండి 6 శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. విపరీతంగా మద్యం తాగితే అది ఇతర ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడుతుందని వైద్యులు చెబుతున్నారు.

లివర్ పై తీవ్ర ప్రభావం:

లివర్ పై తీవ్ర ప్రభావం:

మానవ శరీరంలో కాలేయం అతి పెద్ద అవయవం. లివర్ లో ఎలాంటి నొప్పి తెలిపే నరాలు ఉండవు. కాబట్టి లివర్ పై ఏదైనా ప్రభావం పడినా.. పరిస్థితి చేయిదాటి పోయే వరకు దాని గురించి బయటపడదు. ఎక్కువగా మద్యం సేవిస్తే లివర్ కు కొవ్వు ఏర్పడుతుంది. దీనిని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. కాలేయ కణాలన్నీ కొవ్వుతో నిండిపోతాయి. ఇది కాలేయం పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలసట, ఆయాసం వంటివి ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల తలెత్తుతాయి.

ఆల్కహాల్ వల్ల కిడ్నీలకు ప్రమాదమే:

ఆల్కహాల్ వల్ల కిడ్నీలకు ప్రమాదమే:

ఎక్కువగా మందు తాగితే కిడ్నీలపైనా ప్రభావం పడుతుంది. కిడ్నీలు తీవ్ర ఒత్తిడికి గురి అవుతాయి. ఇది బీపీని పెంచుతుంది. రోజులో మూడు కంటే ఎక్కువ పెగ్గులు తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది కిడ్నీ పనితీరు దెబ్బతినడానికి కారణం అవుతుంది.

English summary

Ways Alcohol Destroys Relationships in Telugu

read on to know Ways Alcohol Destroys Relationships in Telugu..
Story first published: Wednesday, July 27, 2022, 15:35 [IST]
Desktop Bottom Promotion