For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మహాభారతంలోని ఎవరికి తెలియని10 ప్రేమ కథలు

  By Staff
  |

  మహాభారతం ఎన్నో రహస్యాలు కలిగిన పౌరాణిక గ్రంధం. ఈ పురాణంలో మీరు ఒకేచోట ప్రేమ, గౌరవం, ధైర్యం, తెలివి, భక్తీ, నీతి కధలను చూస్తారు. మరోవైపు మీరు ద్రోహం, అవినీతి, రంకుతనం, అన్యాయాన్ని కూడా చూస్తారు.

  మహాభారతంలో అనేక ప్రేమ కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రసిద్ధికెక్కినవి మరియు చాలా మందికి తెలిసినవి, ఎవ్వరికీ తెలియనివి మరికొన్ని ఉన్నాయి. ఈ మహాభారత కథలో, కొన్ని వినని ప్రేమ కథలలో పాత్రల గురించి మనం తెలుసుకుందాం.

  10 Love stories from Mahabharat that no one know

  వాటిని గురించి తెలిసుకోవాలంటే ఈ స్లయిడ్ షో క్లిక్ చేయండి ...

   శ్రీ కృష్ణుడు మరియు అతని 16.108 భార్యలు

  శ్రీ కృష్ణుడు మరియు అతని 16.108 భార్యలు

  16.108 భార్యలలో, 16,000 మంది అనేక సంవత్సరాలు వేచిఉన్న తరువాత కానీ, వారు శ్రీ కృష్ణుని వివాహం చేసుకోవటానికి తిరిగి జన్మించారు. ఈ సుప్రీం లార్డ్ ఎవరినైనా సంతోషంగా చేయగలడు ఎందుకంటే అతనికొక్కడికే ప్రతి ఒక్కరిని ప్రేమించే శక్తి గలవాడు, వారందరిచేత ప్రేమించగలవాడు.

  ద్రౌపది మరియు పాండవులు

  ద్రౌపది మరియు పాండవులు

  ద్రౌపది అయిదుగురు పాండవ సోదరులందరిని వివాహమాడింది. ఆమె, తనయొక్క ప్రతి భర్తపట్ల ప్రధాన నిబద్ధతను నిర్వహిస్తూ వచ్చింది. అది మాత్రమేకాదు, అందరు సోదరులు ద్రౌపది పట్ల న్యాయం చేయాలని విశ్వాసం కలిగి ఉన్నారు.

  MOST READ:ఉత్తర ప్రగల్భాలు అనే మాట అలా వచ్చింది, ఉత్తరుడిలా మాట్లాడకండి దమ్ముంటే చేసి చూపించాలి

   గాంధారి మరియు ధృతరాష్ట్రుడు

  గాంధారి మరియు ధృతరాష్ట్రుడు

  విచిత్రవీర్య మరణం తరువాత అతని తల్లి సత్యవతి తన మొదటి బిడ్డ, వేద్ వ్యాస్ ను పంపారు. తన తల్లి కోరిక ప్రకారం, అతను తన యోగ శక్తులతో కుమారుడి జననం కొరకు విచిత్రవీర్యుడి ఇద్దరి భార్యలను సందర్శించాడు. వ్యాసుడు అంబికను (అంబ యొక్క సోదరి) సందర్శించినప్పుడు, అతని భయంకరమైన మరియు నిషిద్ధమైన రూపాన్ని చూసి ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె భయపడి కళ్ళు మూసుకొన్నది. వేద వ్యాసుడు, మహాభారతాన్ని రాసిన మహాపురుషుడు.

  గాంధారి మరియు ధృతరాష్ట్రుడు ప్రేమ కథ వారి వివాహం తర్వాత ప్రారంభమయ్యింది. గాంధారి, అతనిని కలుసుకున్నతరువాతే అతను గుడ్డివాడు అన్న విషయం తెలుసుకున్నది. ఆ తరువాతే ఆమె తన భర్త దృష్టిలేక ఆనందించటం లేదు, కాబట్టి ఆమె కూడా ఆనందాన్ని త్యజించింది. ఆమె వైవాహిక జీవితం మొత్తం స్వచ్ఛందంగా ఆమె కళ్లకు గంతలు కట్టుకుని గడిపింది.

   అర్జున్ ఉలూపి

  అర్జున్ ఉలూపి

  ఉలూపి ఒక నాగ యువరాణి మరియు ఆమె అతనితో ప్రేమలో ఉన్నప్పుడు,ఆమె అర్జునుడిని అపహరించింది. బ్రహ్మచర్యం యొక్క నియమాలను మరియు ఇతర మహిళలతో ఉన్న సంబంధం కాకుండా ద్రౌపదితో ఉన్న సంబంధం, వీటన్నిటిని అధిగమించి ఆమె అతనిని ఒప్పించింది. ఆమె తరువాత అతనికి నీటిలో ఉండగా ఎటువంటి హాని జరగదనే ఒక వరం ఇచ్చింది.

   రుక్మిణి మరియు శ్రీ కృష్ణ

  రుక్మిణి మరియు శ్రీ కృష్ణ

  శ్రీ కృష్ణుడు ఆమె కుటుంబం యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా రుక్మిణిని అపహరించి వివాహం చేసుకున్నాడు. ఆమె శ్రీ కృష్ణునితో ప్రేమలో ఉన్నప్పటికీ.

  అర్జునుడు, చిత్రాంగద

  అర్జునుడు, చిత్రాంగద

  చిత్రాంగద, మణిపూర్ యువరాణి. నది కావేరి ఒడ్డున ఉన్న మణిపూర్ కు రాజు చిత్రవాహన ఉండగా, అర్జునుడు దీనిని సందర్శించాడు. అతని కుమార్తె చిత్రాంగద, చాలా అందమైనది మరియు అర్జునుడు ఆమెను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. వెంటనే అర్జునుడు ఆమెకు తెలిపాడు. ఆమెను వివాహం చేసుకుంటానని ఆమె తండ్రిని అడిగినప్పుడు, ఆమె తండ్రి వారి పిల్లలు మణిపూర్ లో పెరగాలని మరియు సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు. అర్జునుడు అంగీకరించాడు. బబ్రువాహనుడు జన్మించిన తరువాత, అర్జునుడు భార్యను, కొడుకును వొదిలి తన సోదరులతో కలిసి ఉన్నాడు. చిత్రవాహనుడి మరణం తరువాత, బబృవాహనుడు మణిపూర్ రాజ్యానికి రాజయ్యాడు. మహాభారత యుద్ధం తరువాత, అర్జునుడు, తన కుమారుడు, బబృవాహనుడి చేతిలో పరాజయం పాలయ్యాడు.

  అర్జునుడు, సుభద్ర

  అర్జునుడు, సుభద్ర

  అర్జునుడు, సుభద్ర సోదరుడు, గద, ద్రోణుడి వద్ద కలిసి శిక్షణ తీసుకున్నారు. అజ్ఞాతవాసం తరువాత, అర్జునుడు ద్వారకకు చేరుకున్నాడు. ఆ సమయంలో అర్జునుడు సుభద్ర మందిరానికి ఆహ్వానింపబడ్డాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు అర్జునుడు శ్రీ కృష్ణుడిలో సగభాగం అయిన తన సోదరి అయిన సుభద్రణు వివాహం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడే సుభద్రణు అపహరించమని అర్జునుడికి సలహా ఇచ్చాడు. సుభద్ర ద్రౌపదిని కలిసినప్పుడు ఆమె అర్జునుడితో ఆమె వివాహం గురించి వెంటనే చెప్పలేదు. వారు స్నేహపూర్వకంగా కలిసిన ఒక గంట తర్వాత కానీ, సుభద్ర ద్రౌపదికి వివాహ విషయం గురించి చెప్పింది మరియు ఆమె కూడా అంగీకరించింది.

  MOST READ:రాత్రికి రాత్రి దంతాలను తెల్లగా తళతళ మెరించడం ఎలా...

  హిడింబ మరియు భీముడు

  హిడింబ మరియు భీముడు

  భీముడు, కుంతి కుమారుడు. హిడింబ నరభక్షకురాలు. ఆమె భీముడితో ప్రేమలో పడిపడింది మరియు అదే ఆమెలో ప్రతిదీ మార్పును తెచ్చింది.. వివాహం తరువాత, వారు పరిమితమైన కాలం మాత్రమే కలిసి జీవించారు. అప్పుడు భీముడు వదిలి వెళ్లాడు. హిడింబ ఘటోత్కచుడికి జన్మనిచ్చింది మరియు విచారించకుండా ఒంటరిగా ఆమె అతనిని సంరక్షించింది.

  సత్యవతి మరియు ఋషి పరాశరుడు

  సత్యవతి మరియు ఋషి పరాశరుడు

  పరాశరుడు భక్తి ద్వారా అనేక యోగ శక్తులను పొందిన, ఒక గౌరవనీయుడైన గొప్ప ఋషి అని అందరికి తెలిసిన విషయమే. సత్యవతి, ఒక మత్స్యకారుడి, దాశారాజు, కుమార్తె, ఆమె పడవలో ప్రజలను యమునా నదిని దాటిస్తుండేది. ఒక రోజు ఆమె పడవలో ఋషి పరాశరుడిని దాటిస్తున్నది. ఆ సమయంలో ఋషి ఆమె రూపానికి ఆకర్షితుడై, ఆమెకు కోరికను వ్యక్తం చేశాడు. అతను ఆమెతో సంగమం వలన ఆమె ఒక గొప్ప వ్యక్తి జన్మకు కారణమౌతుందని తెలిపాడు. సత్యవతి అతనికి మూడు షరతులు పెట్టింది - 1. ఎవరూ వారు ఏమి చేస్తున్నారో చూడకూడదు, పరాశరుడి వారిద్దరి చుట్టూ ఒక కృత్రిమ పొగమంచు రూపొందించాడు; 2. తన కన్యత్వం చెక్కుచెదరకుండా ఉండాలి - పరాశరుడు ఆమెకు, జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె కన్యగానే ఉంటుందని హామీ ఇచ్చాడు ; 3. ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన బదులు సుగంధభరిత వాసన రావాలని కోరుకున్నది - పరాశరుడు ఆమె శరీరం నుండి తొమ్మిది మైళ్ళ దూరం వరకు ఒక దివ్య వాసన వొస్తుందని వాగ్దానం చేశాడు. ఆమె వేద వ్యాసూడికి జన్మనిచ్చింది.

  సత్యవతి మరియు శంతనుడు

  సత్యవతి మరియు శంతనుడు

  సత్యవతి పరిమళం శంతనుడిని ఆకర్షించింది. అతను ఆ పరిమళం వొచ్చే దిశను అనుసరించాడు మరియు సత్యవతి పడవలో కూర్చొని ఉండటం చూశాడు. అతను పడవలోకి ఎక్కి నదిని దాటించమని సత్యవతిని కోరాడు. అతను ఆవలి ఒడ్డుకు చేరుకున్నతరువాత అతను తిరిగి పడవలోకి ఎక్కి అవతలి ఒడ్డుకు చేర్చమని ఆమెణు కోరాడు. ఈ విధంగా ఆ రోజు సంధ్యాసమయం వరకు కొనసాగింది. ఇదేవిధంగా కొంతకాలం రోజువారీ కొనసాగింది. చివరగా, శంతనుడు వివాహం చేసుకోమని సత్యవతిని కోరాడు. సత్యవతి తన అంగీకారం తెలిపింది కానీ ఆమె తండ్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పింది. ఆమె తండ్రి పెట్టిన షరతులు విని శంతనుడు నిరాశ చెందాడు మరియు ఆ షరతులు తీర్చటానికి తను అశక్తుడినని తెలిపాడు. గంగ మరియు శంతనుడి కుమారుడు విషయానని సులభతరం చేశాడు.

  English summary

  10 Love stories from Mahabharat that no one knows: Spiritual Stories in Telugu

  There have many love stories in Mahabharat. While some of them are famous and known to most people, there are some, which no one is aware about. In this story, we will tell you about some unheard love stories of various charcaters of Mahabharat.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more